Karthika Deepam 31 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1497 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, దీప ఇద్దరూ కలిసి శౌర్య ఫంక్షన్ కు రావడం కోసం రెడీ అవుతారు. మరోవైపు జ్వాలమ్మకు స్నానం కూడా అయిపోయింది. ఈ గండ ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటుంది చంద్రమ్మ. ఇంతలో వస్తాడు ఇంద్రుడు. ఎక్కడికి వెళ్లాలి.. అన్ని పనులు నేనే చూసుకోవాలా అంటుంది. అవును.. మీ ఆటోవాళ్లను అందరినీ భోజనానికి పిలిచావా.. ఎవరినైనా మరిచిపోయావా అని అడుగుతుంది చంద్రమ్మ. అందరినీ పిలిచాను అంటాడు కానీ.. కార్తీక్, దీపను వెళ్లి తీసుకురావాలి కదా అని అనుకుంటాడు ఇంద్రుడు. మరోవైపు జ్వాలమ్మ మనల్ని వదిలిపోతే ఏం చేస్తావు అని అంటాడు ఇంద్రుడు. దీంతో ఇప్పుడు జ్వాలమ్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పు. తను ఇప్పుడు పెద్దమనిషి అయింది కదా. తను ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తుంది అని అంటుంది. ఒకవేళ తన కన్న తల్లిదండ్రులు వస్తే అని అంటాడు. అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి లోపలికి వెళ్తుంది చంద్రమ్మ.
మరోవైపు దీప, కార్తీక్ ఇద్దరూ కారులో బయలుదేరుతారు. శౌర్యను చూడబోతున్నందుకు చాలా సంతోషిస్తుంది దీప. అప్పుడే శౌర్య అని నాకు అనుమానం వచ్చింది కానీ.. నేను సరుకుల లిస్ట్ రాసి ఇస్తే అచ్చం మా అమ్మ చేతి వ్రాతలాగానే అనిపించిందట. అనుమానం వచ్చింది కానీ.. అసలు శౌర్య ఇక్కడెందుకు ఉంటుందిలే అనిపించింది. ఆరోజు బతుకమ్మలోనూ ఇంద్రుడు వచ్చి శౌర్య పిలుస్తుంది అని చెప్పాడు. నేనే వెళ్లలేదు. వెళ్లి ఉంటే అప్పుడే శౌర్య కనిపించి ఉండేది అంటుంది దీప. అప్పుడు నువ్వు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతాడు కార్తీక్. దీంతో అప్పుడు మీకోసం వెతుకుతున్నా అంటుంది దీప. సర్లే.. ఇప్పుడు ఎలాగూ ఇంద్రుడు వస్తాడు కదా. ఇవాళ శౌర్య కనిపిస్తుందిలే అంటాడు. ఆ తర్వాత ఇంద్రుడు కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు కార్తీక్, దీప.
మరోవైపు శౌర్య బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ వంటలు వండుతూ ఉంటారు. వంటలు వండే వాళ్లను చూసి తన అమ్మ అనుకొని అక్కడికి వెళ్లబోతుంది శౌర్య. ఇంతలో చంద్రమ్మ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. దీంతో శౌర్య.. అక్కడ అమ్మ ఉంది అంటుంది. నాకు అమ్మ కావాలి అంటుంది.
ఇందులో ఇంద్రుడు కూడా వస్తాడు. నాకు అమ్మ కావాలి బాబాయి అంటుంది శౌర్య. ఈరోజైనా అమ్మ కనిపిస్తుంది. నాకోసం వస్తుందని అనుకున్నాను బాబాయి. రాదా బాబాయి. అమ్మ నాకు గంధం పూయదా బాబాయి. అక్షింతలు వేసి ఆశీర్వదించదా బాబాయి అంటుంది శౌర్య.
దీంతో ఇంద్రుడుకు ఏం చేయాలో అర్థం కాదు. నీ ఏడుపుకు కారణం నేనే నమ్మా. మీ అమ్మానాన్నలు నిన్ను చూడటానికి వస్తా అన్నారు కానీ.. ఎక్కడ తీసుకెళ్తారో అని నేను తీసుకురాలేదు అని అనుకుంటాడు. నీ కళ్లలో సంతోషం కనబడితేనే ఈ కళ్లలో సంతోషం. నీ కళ్లలో కన్నీరు కారిస్తే ఇక్కడ కారుతాయమ్మా.
ఈ చిన్న విషయం తెలుసుకోని పిచ్చోడమ్మా మీ బాబాయి. ఇదిగో ఇప్పుడు ఏడిస్తే కానీ అర్థం కాదమ్మ అంటాడు ఇంద్రుడు. నువ్వు ఏడవొద్దు అంటాడు. ఇక నీ కళ్లలో నుంచి కన్నీళ్లు రావు. ఈ బాబాయి రానివ్వడు. ఇప్పుడే వస్తాను. చంద్రమ్మ పాప జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు ఇంద్రుడు.
మరోవైపు మోనితకు చాలా కోపం వస్తుంది. తన ఇంట్లో ఉన్న వస్తువులను అన్నింటినీ పడేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శివ వస్తాడు. మేడమ్ ఏమైంది అంటాడు. దీంతో ఆపరా నువ్వు. నువ్వు నాతో మాట్లాడుకు. నిన్ను చంపేస్తాను అంటూ సంబంధం లేకుండా శివతో మాట్లాడుతుంది.
ఇంతలో లోపలికి వెళ్లి గన్ తీసుకొని వచ్చి శివకు గురి పెట్టి నువ్వు ఎంత ఏడ్చినా వదలను వంటలక్క. ఈసారి నిన్ను అస్సలు వదలను. చచ్చాక నేను, కార్తీక్ చాలా హ్యాపీగా ఉంటాం అంటుంది మోనిత. ఇంతలో మేడమ్ మేడమ్ నేను వంటలక్కను కాదు.. శివను అంటాడు.
దీంతో ఎందుకొచ్చావురా. పో.. బయటికి పో అంటుంది. నువ్వు బయటే కాపలా కాయి. ఎవ్వరినీ రానివ్వకు అంటుంది మోనిత. మరోవైపు ఇంద్రుడు చెప్పిన చోటుకు వస్తారు కార్తీక్, దీప. ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటారు కార్తీక్, దీప. నేను శౌర్య తల్లిని అని తెలిస్తే.. శౌర్యను ఇస్తారో ఇవ్వరో అని మీరు అన్నారు కదా. ఇప్పుడు వస్తారో రారో అని అంటుంది దీప.
ఇంతలో అక్కడికి ఇంద్రుడు వస్తాడు. దీంతో దీప, కార్తీక్ సంతోషిస్తారు. సర్లే.. కారెక్కు బయలుదేరుదాం అంటే. వద్దులేంటి సార్.. నేను ముందెళ్తాను. మీరు వెనకాలే రండి అంటాడు. దీంతో సరే అంటాడు. మరోవైపు శౌర్య ఫంక్షన్ రెడీ అవుతుంది. పిన్నీ బాబాయి ఏడి అని అడుగుతుంది శౌర్య.
దీంతో ఎవరో తెలిసిన వాళ్లు ఉంటే తీసుకొద్దామని వెళ్తాడమ్మా. వస్తాడులే అంటుంది. బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను అని అనుకుంటాడు ఇంద్రుడు. అందుకే మీ అమ్మానాన్నలలో మమ్మల్ని చూసుకొని నీకే ఇచ్చేస్తున్నాను శౌర్యమ్మ అని అనుకుంటాడు.
మా స్వార్థం కోసం నిన్ను ఇంకో నరకంలో ఉంచలేం. అందుకనే ఇచ్చేస్తున్నాను అని అనుకుంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.