Karthika Deepam 4 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1267 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజంగా నమ్మలేకపోతున్నాను. డాక్టర్ కార్తీక్ గారు మన ఆపరేషన్ కు రావడం ఏంటి.. అని షాక్ అవుతుంది అంజలి. వెంటనే ఆపరేషన్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ డాక్టర్ కార్తీక్ ఉంటాడు. కార్తీక్ వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. బయట.. తన కూతురుకు ఏమౌతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది దీప. డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లారో అనుకుంటుంది. డాక్టర్ బాబు లోపలికి వెళ్లిన విషయం గమనించదు దీప. దీంతో భయపడుతూ ఉంటుంది దీప. డాక్టర్ బాబు.. అత్తమ్మకు ఇలా ఉంటే మీరు ఎక్కడికి వెళ్లారు.. ఇది మీకు న్యాయమా అని అనుకుంటుంది దీప.
కార్తీక్.. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. తన కూతురు అయినప్పటికీ.. ధైర్యం తెచ్చుకొని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కార్తీక్ ఆపరేషన్ చేస్తుంటే.. అంజలి, ధనుంజయ్ చూస్తుంటారు. ఆపరేషన్ చేస్తూ… రౌడీ నిన్ను డాడీ రక్షించుకుంటాడురా అని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో ఆపరేషన్ పూర్తయిపోతుంది. మరోవైపు మోనిత, భారతి ఇద్దరూ చాయ్ తాగుతూ ఉంటారు. విన్నీని అయినా కొన్ని రోజులు ఉంచుతావా.. లేక పంపించేస్తావా అంటుంది డాక్టర్ భారతి. వెళ్తాను మోనిత. నైట్ వస్తాను. నీ లగేజ్ ప్యాక్ చేసి పెట్టకో అంటుంది. వెళ్లేముందు ఈ రెండు వేళ్లలో ఒకటి పట్టుకో అంటుంది. థ్యాంక్స్ భారతి. మనం వెళ్లే ఊరిలో కార్తీక్ ఉంటాడని ఒకటి.. ఉండడని ఇంకోటి అనుకున్నాను. థ్యాంక్స్ భారతి.. నువ్వు ఉంటాడని పట్టుకున్నావు అంటుంది మోనిత.
డాక్టర్ గారు ఇంత స్పీడ్ గా ఎలా ఆపరేషన్ చేయగలిగారు అని అడుగుతారు అంజలి, ధనుంజయ్. మీతో కలిసి ఒక సర్జరీకి మీ పక్కన నిలుచున్నాను అంటాడు ధనుంజయ్. ఆపరేషన్ అయిపోయాక.. కార్తీక్ బయటికి వస్తాడు. కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది దీప.
మాస్క్ ఉన్నా అతడి కళ్లను చూసి గుర్తుపడుతుంది. వెళ్తూ.. ఆపరేషన్ సక్సెస్ అని చెబుతాడు కార్తీక్. దీంతో చాలా సంతోషిస్తుంది దీప. కంగ్రాట్స్ ఆపరేషన్ సక్సెస్ అంటారు డాక్టర్లు. అవును.. మీ ఆయన ఎక్కడ అని అడుగుతారు డాక్టర్లు.
బయటికి వెళ్లారు మేడమ్ అంటుంది దీప. సరే.. వస్తాం అని చెప్పి అంజలి, ధనుంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే శౌర్యకు ఆపరేషన్ జరిగిందని.. పాప బతికిందని రుద్రాణికి తన మనుషులు చెబుతారు. ఆపరేషన్ అయిపోయిందట.. ఆపరేషన్ సక్సెస్ అట అంటారు. దీంతో రుద్రాణికి ఏం చేయాలో అర్థం కాదు.
ఎంత ఖర్చు అయిందో తెలుసుకున్నారా అని అంటుంది రుద్రాణి. అది కనుక్కోలేదు అక్క అంటారు. ఆపరేషన్ అంటే మామూలు విషయం కాదు. వాళ్లకు ఒక్క రూపాయి దొరకకుండా చేసినా ఆపరేషన్ ఎలా చేయించుకోగలిగారు.. నా బాకీ కూడా తీర్చేస్తారా.. నా బాకీ కూడా తీర్చేస్తే ఇక నాకెందుకు భయపడతారు అని అనుకుంటుంది రుద్రాణి.
శౌర్య స్పృహ లోకి వస్తుంది. అమ్మ ఇంటికి వెళ్లిపోదాం అమ్మ అంటుంది. నీకు పెద్ద గండం గడిచింది అంటుంది దీప. నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో అంటుంది దీప. అమ్మ.. తమ్ముడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది శౌర్య. నాన్న, హిమ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది శౌర్య.
అసలు నాకేమైంది అని అడుగుతుంది. నీకేం కాలేదమ్మా. కడుపునొప్పి అంతే.. అంటుంది. కడుపునొప్పి అయితే ఇక్కడ ఎందుకు అమ్మా నొప్పిగా ఉంది అంటుంది శౌర్య. దీంతో శౌర్యకు ఏం చెప్పాలో దీపకు అర్థం కాదు. నాకు నానమ్మ, తాతయ్యను చూడాలని ఉంది అంటుంది శౌర్య.
కట్ చేస్తే కార్తీక్ చైర్ లో కూర్చొని శౌర్య పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హిమను తన ఒడిలో పడుకోబెడతాడు. ఇంతలో అక్కడికి అప్పారావు వస్తాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు బావా. నాకు తెలుసు బావా నువ్వు ఎక్కడికి వెళ్లావో అంటాడు. గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని వచ్చావు కదా అంటాడు అప్పారావు.
నువ్వు మంచోడివి బావా. నీ గురించి నేను వివరాలు అడగను కానీ.. నువ్వు గొప్పోడివి బావా అంటాడు అప్పారావు. లేదు బావ. తెలిసో తెలియకో నిన్ను చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించు బావా అంటాడు అప్పారావు. ఏ ముహూర్తాన నిన్ను బావా అని పిలిచానో కానీ.. ఆ పిలుపు ఇప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటాడు అప్పారావు.
సరే.. అప్పు ఇప్పటి దాకా మాతోనే ఉన్నావు. చాలా థ్యాంక్స్ అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. మోనిత రెడీ అవుతుంది. భారతి కారులో మోనిత ఇంటిక వస్తుంది. కారులో ఇద్దరూ బయలుదేరుతారు. శౌర్యను చూసి అంజలి డాక్టర్ మాట్లాడుతుంది. నీకేం కాదు.. తగ్గిపోతుంది. పెద్ద డాక్టర్ నీకు ఆపరేషన్ చేశారు. నీకేం కాదు అంటుంది.
మా పరిస్థితి తెలుసుకొని మీరు మాకు సాయం చేశారు. మీ మేలు మరిచిపోలేం డాక్టర్ అంటాడు కార్తీక్. మీ వల్ల కార్తీక్ మా ఆసుపత్రికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది అంజలి. ఆయన కూడా ఫీజు తీసుకోలేదు. అంత పెద్ద డాక్టర్ ఫీజు తీసుకోనప్పుడు మేము మిమ్మల్ని ఫీజు అడగడం కరెక్ట్ కాదు అంటుంది అంజలి.
అవును.. అడగడం మరిచిపోయాను మీది ఏఊరు అంటుంది. దీంతో తాడికొండ అంటుంది. మీరు ఏమనుకోనంటే.. నేను ఒక మాట అడగొచ్చా.. అంటుంది డాక్టర్. మీరు వంట బాగా చేస్తారట కదా. మా పాప పుట్టిన రోజుకు గెస్టులకు వంట చేసి పెడతారా అంటుంది అంజలి.
సరే.. చేస్తా అంటుంది దీప. నేను కూడా మా ఆవిడకు తోడుగా వస్తాను అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.