karthika deepam 4 january 2022 full episode
Karthika Deepam 4 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1240 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఇంట్లో ఒక్కడే ఉంటాడు. బాబును చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రుద్రాణి వస్తుంది. ఏంటి సారు మీరు.. ఏం పని చేస్తున్నారు. ఇది వరకు ఏం చేసేవారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. భర్త.. భార్య అయ్యారు.. భార్య భర్త అయిందా? దీప పిండి వంటలు చేసి అమ్మడం ఏంటి.. మీరు ఇంట్లో ఊరికే కూర్చోవడం ఏంటి. అసలే రోజులు బాగా లేవు. పిండి వంటలు చేసే నీ భార్య ఇంటికి జాగ్రత్తగా తిరిగి రావాలి కదా. స్కూల్ కు వెళ్లే నీ పిల్లలు జాగ్రత్తగా రావాలి కదా అంటుంది రుద్రాణి. నేనేదో అన్నానని ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. ఎవరి టైమ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ముందు జాగ్రత్తగా చెప్పాను.. అంతే. నేను వెళ్లొస్తాను. రంగరాజు జాగ్రత్త. దీప, పిల్లలు కూడా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి.
karthika deepam 4 january 2022 full episode
మరోవైపు సౌందర్య విసిరేసిన ఫోటోను క్యాచ్ పట్టి ఇంటికి తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ ఫోటోను చూస్తూ మురిసిపోతుంది. అయ్యో కార్తీక్.. ఎంత ముద్దొస్తున్నావో.. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవు అని అనుకుంటుంది. ఇంతలో నర్సమ్మ వస్తుంది. మీ ఆయన వస్తారనే నమ్మకం మీకుందా అని అడుగుతుంది నర్సమ్మ. వస్తాడు.. నా కార్తీక్ వస్తాడు అని చెబుతుంది. మరోవైపు మహేశ్.. తాడికొండకు వెళ్తాడు. సౌందర్య చెప్పిందని కార్తీక్ ఫ్యామిలీ కోసం వెతుకుతుంటాడు. రుద్రాణి మనిషిని చూసి ఫోటో చూపించబోతాడు కానీ.. అతడు చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే కార్తీక్.. దీప క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రుద్రాణి.. దీపను ఏమైనా చేస్తే.. పిల్లలను ఏమైనా చేస్తే ఎలా అని భయపడతాడు.
సాయంత్రం అవుతోంది… దీప ఇంకా రాలేదు ఏంటి.. అని భయపడతాడు కార్తీక్. ఇంతలో మహాలక్ష్మి వస్తుంది. దీప ఉందా అని అడుగుతుంది. దీంతో దీప లేదమ్మా అంటాడు. కొంచెం సేపు బాబును చూసుకో. నేను స్కూల్ దాకా వెళ్లి వస్తాను అని అంటాడు. మరోవైపు సాయంత్రం అవుతున్నా.. అమ్మ ఇంకా రాలేదు ఏంటి అని పిల్లలు వెయిట్ చేస్తుంటారు.
ఇంతలో రుద్రాణి వస్తుంది. ఏంట్రా పిల్లలు అమ్మ కోసం చూస్తున్నారా అంటుంది రుద్రాణి. కూర్చొండి.. అని చెప్పి వాళ్ల పక్కన కూర్చుంటుంది. ఎందుకురా భయపడతారు. ఆరోజు మేమే కదా మీకు పండ్లు, చాకొలేట్స్ ఇచ్చాను అంటుంది. అవి మేము తినలేదు. వేరే వాళ్లకు ఇచ్చాం అంటారు.
అప్పుడు తినకపోతేనేం.. ఇప్పుడు భోజనం తెచ్చాను. మీకోసం తినండి.. అంటూ అన్నాన్ని కలిపి పెడుతుంది. మీరెవరు మాకు లంచ్ తేవడానికి అని ప్రశ్నిస్తుంది శౌర్య. మా అమ్మ తీసుకొస్తుంది. మీరు వెళ్లండి అని అంటారు పిల్లలు. పిల్లలు కదా.. ఇలాగే బతిమిలాడాలి. బుజ్జగించాలి.. అని అంటుంది రుద్రాణి.
ఎంత చెప్పినా శౌర్య తినదు. దీంతో మాకేమీ వద్దు. మీరు వద్దు.. మీ అన్నం వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతారు పిల్లలు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. రుద్రాణి అంటూ తన మీద విరుచుకుపడతాడు. డాడీ అన్నం తినమంటూ అరుస్తుంది. అవును నాన్న.. తెస్తే తినాలంటుంది.. అని చెబుతారు. మనుషులా, రాక్షసులా అంటూ రుద్రాణిని తిడుతాడు.
మీరు ఇంటికి వెళ్లండి అని పిల్లలకు చెబుతాడు కార్తీక్. నేను ఇప్పుడే వస్తాను.. అని చెబుతాడు కార్తీక్. అసలు ఏంటి మీ ఉద్దేశం. మా పిల్లలకు మీరు భోజనం పెట్టడం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. పిల్లలకు భోజనం పెట్టకుండా.. మధ్యలో నుంచి వాళ్లను స్కూల్ నుంచి ఇంటికి పంపించావేంటి అని అడుగుతుంది రుద్రాణి.
ఏంటి సారు.. నేను ఏదో అన్నానని భయపడి వచ్చావా అంటుంది. పిల్లలను నేను ఏం చేయను. అందులో ఒకరు నాకు కావాలి కదా. పిల్లలు అంటే నాకు ఇష్టం సారు. వాళ్లను నేను ఏం చేయను. దీపమ్మ ఇంటికి వచ్చిందా.. రాలేదా.. అంటూ అనుమానంగా అడుగుతుంది రుద్రాణి.
ఎక్కడుందో వెతుక్కోవా మరి.. అని అంటుంది రుద్రాణి. వెళ్లి వెతుక్కో.. అని అంటుంది రుద్రాణి. రేయ్ చూస్తావేంట్రా చేయి కడుక్కోవాలి వెళ్లి నీళ్లు తీసుకురా అని చెప్పి చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు మహేశ్.. ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కనీసం ఈ ఊరిలోనైనా దొరుకుతారేమోనని చూస్తుంటాడు.
మరోవైపు కార్తీక్.. దీప కోసం వెతుకుతూ ఉంటాడు. దీప ఎక్కడికి వెళ్లింది అని టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. దీపకు ఏం కాదు.. దీప క్షేమంగానే ఉంటుంది.. అని మనసులో అనుకుంటాడు కార్తీక్. కానీ.. లోపల ఏదో భయం తనను వెంటాడుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.