Karthika Deepam 4 July Today Episode : జ్వాలకు అవార్డ్.. తన పెళ్లి ఆపాలని హిమ ప్రయత్నాలు.. ఇంతలో ట్విస్ట్.. నిరుపమ్.. జ్వాలను పెళ్లి చేసుకుంటాడా?

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 4 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 1395 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ విఫలం అయిందని ఇలా వెళ్లిపోవడం కరెక్ట్ కాదు అని అంటాడు ఆనంద రావు. ఏంటి వీళ్లు నేను వెళ్లిపోతానంటే ఇంతలా బాధపడుతున్నారు. కొంపదీసి నేను ఎవరో తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది జ్వాల. నేను వెళ్తానంటే మీకెందుకు అంత కంగారు అని అడుగుతుంది జ్వాల. నా మీద మీకు ఎందుకు అంత స్పెషల్ ఇంటరెస్ట్. నేనెవరో మీరెవరో కదా. మనం ఏదో అనుకోకుండా కలిశాం. సీనియర్ సిటిజన్ అని నిన్ను పిలుస్తాను.. యంగ్ మ్యాన్ అని ఆయన్నుపిలుస్తాను. ఏదో రైల్ లో ప్రయాణం చేసినట్టు మనం కలిశాం. ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు వెళ్లిపోవాలి. జీవితం కూడా అంతే కదా సీసీ అంటుంది జ్వాల. దీంతో నిన్ను చూస్తుంటే కుటుంబ సభ్యురాలిగా ఫీల్ అయ్యాం అంటుంది సౌందర్య. దీంతో వీళ్లిద్దరికీ నేనెవరో తెలిసినట్టుంది. తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారా? లేక అని అనుకుంటుంది.

Advertisement

karthika deepam 4 july 2022 full episode

కట్ చేస్తే ఆటో స్టాండ్ దగ్గర ప్యాసెంజర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జ్వాల. రాత్రి అవుతుంది. ఇంతలో మంగళ్ హాట్ కు వెళ్లాలి అని ఇద్దరు కస్టమర్లు వస్తారు. మీటర్ మీద ఎక్కువ ఇస్తాం అని బతిమిలాడుతారు. దీంతో సరే ఎక్కండి అంటుంది జ్వాల. వాళ్లను ఆటోలో తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆటోలో ఓ వ్యక్తి సిగరేట్ వెలిగిస్తాడు. దీంతో ఆటో ఆపి సిగిరెట్ కాల్చొద్దు అంటుంది. దీంతో సరే అంటాడు. ఇంతలో ఓ వ్యక్తి తెల్లారే సమయానికి కోల్ కతాకు వెళ్లే ట్రెయిన్ ఉంది మనకు ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా. దొరకం కదా అంటాడు. దీంతో ఏం కాదు.. కోల్ కతా రైలు ఎక్కామంటే మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు అని ఇంకో వ్యక్తి అంటాడు. 5 లక్షల కోసం ఎవ్వరూ కోల్ కతా దాకా రారు అంటాడు. ఇంతలో వీళ్లు దొంగలు అని అనుకుంటుంది జ్వాల. వెంటనే పోలీస్ స్టేషన్ కు ఆటోను తీసుకెళ్లి ఇద్దరినీ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అప్పజెబుతుంది జ్వాల. దీంతో ఎస్ఐ జ్వాల చేసిన పనికి మెచ్చుకుంటాడు.

Advertisement

కట్ చేస్తే మరో ప్యాసెంజర్ ను దింపుతుంది జ్వాల. అతడు 500 నోటు ఇస్తాడు. చేంజ్ లేవు అంటుంది. దీంతో అతడు కూడా చేంజ్ లేవంటాడు. దీంతో ఆ 500 నోటు తీసుకొని అక్కడున్న వాళ్లను చేంజ్ అడుగుతుంది. దీంతో ఎవ్వరూ చేంజ్ లేదంటారు. చివరకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఓ వ్యక్తిని చేంజ్ అడుగుతుంది.

అతడు ఎవరో కాదు నిరుపమ్. అతడిని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత 500 నోటుకు చేంజ్ ఇస్తాడు నిరుపమ్. కారులోనే హిమ కూడా ఉంటుంది. అయ్యో ఎలా అయిపోయావు జ్వాల. ఏదో ఒక అద్భుతం జరిగి వీళ్లిద్దరి పెళ్లి జరిగితే బాగుండు అని అనుకుంటుంది హిమ.

Karthika Deepam 4 July Today Episode : శౌర్య గురించి టెన్షన్ పడ్డా సౌందర్య, ఆనంద రావు

ఆ తర్వాత చేంజ్ తీసుకొని అక్కడి నుంచి వచ్చి ఆ వ్యక్తిని 200 ఇచ్చి 300 రూపాయలు తన దగ్గరే పెట్టుకుంటుంది. కట్ చేస్తే ఆనంద రావుకు ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెబుతుంది సౌందర్య. ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. చాలామంది పెద్దగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు కానీ.. ఇంట్లో మనుషులు ఉండాలని మాత్రం అనుకోరు అంటాడు.

శౌర్యకు ఈ ఐశ్వర్యం అనుభవించే రాత లేదు. శౌర్య మనల్ని గుర్తు పట్టలేదా అని అంటాడు ఆనంద రావు. తను పెద్దయ్యాక ఇలా ఉంటుందని మనం అనుకోం కానీ.. మనల్ని చూసి అది గుర్తుపట్టాలి కదా అంటుంది సౌందర్య. దాని మనసు ఏంటో అర్థం కావట్లేదు. తన పేరే మార్చుకుంది అంటుంది సౌందర్య.

మరోవైపు నిరుపమ్ ఇచ్చిన డబ్బులను ఖర్చుపెట్టకుండా దాచుకుంటా అని అనుకుంటుంది జ్వాల. ప్రాణం కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించా. ఇద్దరూ కలిసి చాలా అద్భుతంగా నన్ను మోసం చేశారు కదా. డాక్టర్ సాబ్ ఎన్ని ఊహించుకున్నాను. మీరు హాస్పిటల్ కు వెళ్తే కారు నడపాలని.. మీరు అమెరికా వెళ్తే మీతో పాటు నేను రావాలని. మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలని అని అనుకుంటుంది జ్వాల.

డాక్టర్ సాబ్ భార్య  అనిపించుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది కదా అని సంబురపడ్డాను అని అనుకుంటుంది జ్వాల. తింగరి ఎలా మాట్లాడేది. ఎలా ఉండేది. నా బాధ్యత.. నా బాధ్యత అనేది. నా జీవితాన్నే లాగేసుకుంది అని అనుకుంటుంది జ్వాల. ఆ తర్వాత ఆ నోట్లను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడుతుంది జ్వాల.

డాక్టర్ సాబ్ కు దూరంగా ఉండాలనుకున్నా. మళ్లీ ఏంటి ఇలా ఆలోచిస్తున్నా. ఇదంతా కల అయితే ఎంత బాగుండు అని అనుకుంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయితే బాగుండేది కదా. డాక్టర్ సాబ్ వచ్చి జ్వాల.. నువ్వంటే నాకిష్టం.. అంతకుముందు చెప్పినవన్నీ ఉత్తుత్తినే అంటే ఎంత బాగుండు అని అనుకుంటుంది జ్వాల.

ఎంత పిచ్చిదాన్ని నేను ఎంత అత్యాశ నాది. తప్పదు..డాక్టర్ సాబ్ ను మరిచిపోక తప్పదు అని అనుకుంటుంది జ్వాల. అమ్మా.. డాడీ.. శౌర్యతో నిరుపమ్ బావకు పెళ్లి చేస్తా అని మాటిచ్చా కానీ.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? బావతో నా పెళ్లి ఫిక్స్ అయింది. శౌర్యతో ప్రేమించట్లేదు అని బావ చెప్పాడు. వీళ్లిద్దరినీ ఎలా కలపాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది హిమ.

ఇంతలో అక్కడికి నిరుపమ్ వస్తాడు. పదా.. షాపింగ్ కు వెళ్దాం. నీకు ఏం కావాలో నేను సెలెక్ట్ చేస్తా.. నాకు ఏం కావాలో నువ్వు సెలెక్ట్ చేయి అంటాడు నిరుపమ్. వద్దు బావ అంటాడు. ఆసుపత్రికి పోవాలి కదా అంటుంది హిమ. దీంతో మన ప్లేస్ లో వేరే వాళ్లను పెట్టి వచ్చాను అంటాడు నిరుపమ్.

నాతో ఉండే ప్రతిక్షణాన్ని నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను అంటాడు నిరుపమ్. మరోవైపు హైదరాబాద్ క్లబ్ నుంచి జ్వాల కోసం వస్తారు. పోలీస్ స్టేషన్ లో మీ అడ్రస్ ఇచ్చారు. ఇద్దరు దొంగలను పట్టించావు కదా అంటారు. నీలాంటి ధైర్యవంతులకు, సాహసం చూపించే అమ్మాయిలకు అవార్డులు ఇస్తుంటాం అంటారు.

ఈ సంవత్సరం అవార్డు కమిటీ మీ పేరును ఎంపిక చేసింది అంటారు. దీనికి అవార్డు ఎందుకు అంటుంది. దీంతో అలా అనకు అమ్మ.. మీ వివరాలు చెప్పండి అంటాడు. దీంతో తన వివరాలు చెబుతుంది. ఇన్విటేషన్ తీసుకోండి. ఎక్కడికి రావాలో.. ఎప్పుడు రావాలో అందులో అన్ని వివరాలు ఉన్నాయి అంటారు.

కట్ చేస్తే హిమ, నిరుపమ్ ఇద్దరూ కొబ్బరి బోండాం తాగుతూ ఉంటారు. నీ మొహంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నా కానీ.. అది నా తప్పు అవుతుంది. నువ్వు ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి అంటాడు నిరుపమ్. నీకు ఏదైనా ఎక్కువ ఇవ్వాలని నా మనసు ఆరాటపడుతోంది హిమ అంటాడు.

ఇంతలో తన పర్సులో నుంచి 500 నోటు తీస్తాడు నిరుపమ్. అది జ్వాల ఇచ్చిన నోటు. ఆ నోటును చూడగానే నిరుపమ్ కు జ్వాల గుర్తొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

17 hours ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

2 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

2 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

2 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

3 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

3 days ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

3 days ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

3 days ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

3 days ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

3 days ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

3 days ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

3 days ago