Karthika Deepam 5 Feb Today Episode : అంజలి ఇంట్లో వంట చేస్తుండగా కార్తీక్ ను చూసి మోనిత షాక్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

Karthika Deepam 5 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 ఫిబ్రవరి 2022, శనివారం ఎపిసోడ్ 1268 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత 10 రోజుల్లో కార్తీక్ ను తీసుకొస్తా అని చెప్పడంతో ఆదిత్య దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే చెప్పిందా.. అన్నయ్య ఎక్కడున్నాడో తనకు తెలిసిందా అని శ్రావ్యతో చెబుతాడు ఆదిత్య. మరోవైపు కారులో భారతి, మోనిత వెళ్తుంటారు. నాకు ఒక డౌట్ భారతి.. ఆ ఊళ్లో ఎలా ఉండాలి. ఎక్కడ ఉంటాం భారతి అంటుంది మోనిత. దీంతో వెంటనే కారు ఆపి.. అంజలికి ఫోన్ చేస్తుంది భారతి. అంజలి మేము బయలుదేరాం. మేము ఉండటానికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా అంటుంది. దీంతో మాది చాలా పెద్ద ఇల్లు. అక్కడ ఉండటానికి ఎటువంటి సమస్యా ఉండదు అని చెబుతుంది అంజలి. దీంతో విన్నావా.. అని మోనితకు చెబుతుంది భారతి.

karthika deepam 5 february 2022 full episode

నా కార్తీక్ అక్కడ కనిపిస్తాడా అంటుంది మోనిత. నాకెందుకో వెళ్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. నా కార్తీక్ ఎందుకో అక్కడ ఉంటాడేమో అనిపిస్తోంది.. అంటుంది మోనిత. మరోవైపు సామాన్లు తీసుకొని కార్తీక్, దీప.. ఇద్దరూ అంజలి ఇంటికి బయలుదేరుతారు. ఎలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడు అని అనుకుంటుంది దీప. మీరు ఎలా ఉన్నా నాకు డాక్టర్ బాబు లాగానే కనిపిస్తారు. ఇప్పుడు కూడా వంట చేయడానికి వస్తున్నా నాకేంటో ఆపరేషన్ చేయడానికే వెళ్తున్నట్టు ఉంది తెలుసా అంటుంది దీప. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అంటుంది దీప. టైమ్ బాగోలేనప్పుడు అన్నింటినీ భరించాలి అంటుంది దీప. మీరు ఇలా వంట చేయడానికి రావడం నాకు నచ్చలేదు అంటుంది దీప. నువ్వు వంటలక్కవు అయితే నేను వంటలయ్యను.. అంటాడు కార్తీక్.

మరోవైపు అంజలి ఇంటికి.. అప్పటికే మోనిత, భారతి వస్తారు. మోనిత పూలను డెకరేట్ చేస్తూ ఉంటుంది మోనిత. ఇంతలో మోనిత వంగుతుంది. తన తాళి కనిపిస్తుంది. తాళి చూసి మీకు పెళ్లి అయిందా అని అడుగుతుంది. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు మోనితకు.

అయింది.. అని చెబుతుంది మోనిత. మీ వారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది అంజలి. వద్దు అని భారతి చెప్పినా వినకుండా.. మా వారు డాక్టర్ అంటుంది. మా ఆయన కూడా డాక్టర్ అంటుంది మోనిత. తను కార్డియాలజిస్ట్ అంటుంది. కార్డియాలజిస్ట్ అనగానే గుర్తొచ్చింది ఫేమస్ కార్డియాలజిస్ట్ కార్తీక్ మీవారికి తెలిసి ఉండాలి కదా అంటుంది అంజలి.

ఇంతలో అంజలి ఇంటికి కార్తీక్, దీప వస్తారు. బెల్ కొడతాడు కార్తీక్. ఆ బెల్ ను విని.. ఆగండి నేను చూస్తాను అంటుంది మోనిత. ఇంతలో అంజలి వచ్చి నేను చూస్తాను మీరు వెళ్లండి అంటుంది అంజలి. డోర్ తీస్తుంది. నమస్కారం అంటుంది.

Karthika Deepam 5 Feb Today Episode : మోనిత భర్తే కార్తీక్ అని తెలుసుకున్న అంజలి

మోనిత నువ్వు కార్తీక్ గురించి అస్సలు చెప్పొద్దు అంటుంది భారతి. మరోవైపు కిచెన్ లోకి వెళ్లి వంట చేయండి అని చెబుతుంది అంజలి. దీంతో వాళ్లు కిచెన్ లోకి వెళ్లిపోతారు. డాక్టర్ కార్తీక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం అంటుంది అంజలి.

మీకు, మీ వారికి తెలిసే ఉండాలి అంటుంది అంజలి. మా వారే డాక్టర్ కార్తీక్ అంటుంది మోనిత. దీంతో అంజలి షాక్ అవుతుంది. డాక్టర్ కార్తీక్ మీవారా అంటుంది. దీంతో అవును.. మోనిత కార్తీక్ పేరు వినడానికి కూడా బాగుంది కదా అంటుంది మోనిత.

భారతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది. మీవారే కార్తీకా. మీవారు మా హాస్పిటల్ కు వచ్చారు తెలుసా అంటుంది. దీంతో మోనిత షాక్ అవుతుంది. మీ హాస్పిటల్ కు కార్తీక్ వచ్చాడా అంటుంది. కార్తీక్ లాంటి గ్రేట్ డాక్టర్ మా హాస్పిటల్ కు వచ్చారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అంటుంది.

మీ హాస్పిటల్ కు ఎందుకు వచ్చినట్టు అని అడిగితే ఒక పూర్ ఫ్యామిలీ అమ్మాయికి సర్జరీ చేసి వెళ్లారు అంటుంది అంజలి. కార్తీక్ గారు మా లాంటి చిన్న ఆసుపత్రికి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాను అంటుంది అంజలి. నిజంగా మీరు చూశారా.. కార్తీక్ నిజంగా వచ్చారా అంటుంది.

నేను ఆయనతో పాటు సర్జరీలో పాల్గొన్నాను అంటుంది అంజలి. కార్తీక్ చివరకు ఇక్కడికి వచ్చి చేరావా.. ఎంతో దూరంలో లేవు. మోనిత నీకు దగ్గరికి వచ్చింది కార్తీక్ అనుకుంటుంది. మరోవైపు కార్తీక్, దీప ఇద్దరూ వంట ప్రారంభిస్తారు.

భారతిని పిలిచి.. నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది తెలుసా అంటుంది మోనిత. నాకూ ఆశ్చర్యంగానే ఉంది.. అంటుంది భారతి. భారతి.. నేను వెళ్లి కార్తీక్ ఎక్కడున్నాడో వెతుకుతాను సరేనా.. అంజలి అడిగితే ఏదో ఒకటి చెప్పు అంటుంది మోనిత.

బర్త్ డే మధ్యలో వెళ్తే ఎలా అంటుంది భారతి. మోనిత నా మాట విను. అంజలి భర్త వస్తారట. తన ముందు ఇవి మాట్లాడకు. బర్త్ డే పార్టీ అయిపోయాక వెళ్లి వెతుకుదాం అంటుంది భారతి. కానీ.. మోనిత వినదు. వద్దు మోనిత. నీకు దండం పెడతాను. రచ్చ చేయకు. నువ్వు వెళ్లిపోతే నేను వాళ్లకు సమాధానం చెప్పలేను అంటుంది భారతి.

మరోవైపు వంటలక్క వంటలను వండుతూ ఉంటుంది. వంటలక్క.. ఘుమఘుమలాడుతోంది. నాకూ వంట నేర్పించవచ్చు కదా.. అంటుంది. నా కార్తీక్ ఇక్కడే ఉన్నాడని తెలిసి నేను ఇంకా ఇక్కడే ఎలా ఉండగలను అంటుంది మోనిత.

దీంతో అంజలిని ఇబ్బంది పెట్టకు. కాస్త ఓపిక పట్టు అంటుంది భారతి. వెళ్లి వంటలు సరిగ్గా చేస్తున్నార్ లేదో చూడు అంటుంది. ఇంతలో అంజలి వచ్చి భారతి కొంచెం పనులు ఉన్నాయి. వెళ్లి వంటలు సరిగ్గా చేస్తున్నారో లేదో చూడవా అంటుంది.

దీంతో నేను అదే చెబుతున్నాను అంజలి. నువ్వు వెళ్లి పనులు చూసుకో అంటుంది. వంటల సంగతి నేను చూసుకుంటాలే అంటుంది. వాళ్లు కొత్త వంట వాళ్లు ఎలా చేస్తారో ఏమో అని టెన్షన్ గా ఉంది అంటుంది అంజలి. దీంతో నువ్వేం టెన్షన్ పడకు.. నేను గెస్ట్ లను చూసుకుంటాను. మోనిత వంటలను చూసుకుంటుంది అని చెబుతుంది భారతి.

కట్ చేస్తే వంటల దగ్గరికి వెళ్తుంది మోనిత. అక్కడ వంట వండుతున్న కార్తీక్ ను చూస్తుంది మోనిత. షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago