Karthika Deepam 5 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 1396 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకేదైనా ఎక్కువ ఇవ్వాలని నా మనసు ఆరాటపడుతోంది హిమ అంటాడు నిరుపమ్. దీంతో ఏది ఎక్కువైనా ప్రమాదకరమే బావ అంటుంది హిమ. కొబ్బరి బోండాం తాగాక.. డబ్బులు ఇవ్వడం కోసం పర్స్ తీస్తాడు నిరుపమ్. అందులో నుంచి 500 నోట్ తీసి ఇస్తాడు. ఈ నోట్ ను ఎలా ఖర్చు పెడదామన్నా కూడా అస్సలు కుదరడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదిగో బాబు తీసుకో నోటు అని 500 నోటు ఇస్తాడు కొబ్బరి బోండాం అతడికి. దీంతో చేంజ్ లేదు అంటాడు. దీంతో ఈ 500 నువ్వే ఉంచుకో అంటాడు. కానీ.. అతడు తీసుకోడు. దీంతో తన దగ్గర ఉన్న చేంజ్ ఇస్తాడు. ఆ తర్వాత బావ ఏమైంది అని అడుగుతుంది. ఈ 500 నోటు జ్వాల ఇచ్చింది. ఎంత వదిలించుకుందామన్నా అస్సలు వదలడం లేదు అంటాడు నిరుపమ్. దీంతో వద్దు బావ.. జ్వాలను వదిలించుకోవాలని చూడకు అని మనసులో అనుకుంటుంది హిమ.
కట్ చేస్తే బ్యాంక్ వాళ్లు ఫోన్ చేసి వెంటనే బ్యాంక్ లోన్ తీర్చాలని ఒత్తిడి చేస్తాడు శోభను. లేదంటే హాస్పిటల్ సీజ్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తారు. దీంతో వద్దు నేను త్వరలోనే డబ్బులు క్లియర్ చేస్తా అని చెబుతుంది శోభ. మరోవైపు హైదరాబాద్ క్లబ్ అవార్డుల ప్రోగ్రామ్ కు సౌందర్య, ఆనంద రావు.. హిమను కూడా తీసుకొస్తారు. నన్నెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది హిమ. దీంతో అందరిలో కలవాలి అని చెబుతుంది సౌందర్య. బాగా చెప్పావు సౌందర్య అంటాడు ఆనంద రావు. నీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు గొప్ప అవార్డు వస్తుంది అంటాడు ఆనంద రావు. దీంతో నాకు శౌర్య, బావను కలిపితే చాలు.. అదే పెద్ద అవార్డు అంటుంది హిమ. డాక్టర్ హిమ గారు మీరు బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్ అంటారు నిర్వాహకులు.
శౌర్య కూడా వస్తే బాగుండు కదా నానమ్మ అని అంటుంది హిమ. ఇన్నాళ్లు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు తెలిశాక అయినా మనతో ఉంటే బాగుండు అని అంటుంది హిమ. ఇంతలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ క్లబ్ వార్షికోత్సవానికి స్వాగతం అంటుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా వచ్చిన సౌందర్య, ఆనంద రావును వేదిక మీదికి పిలుస్తారు.
సౌందర్య మాట్లాడుతూ ఉండగా.. ఇంతలో అక్కడికి జ్వాల వస్తుంది. జ్వాలను చూసి సౌందర్య షాక్ అవుతుంది. వీళ్లు ఉన్నారు ఏంటి.. నానమ్మ, తాతయ్యలు ముఖ్య అతిథులుగా వచ్చారా? వచ్చే ఉంటారులే.. సౌండ్ పార్టీలు కదా అని అనుకుంటుంది జ్వాల.
ఇంకా ముందుకు వచ్చి తింగరిని చూస్తుంది జ్వాల. ఇది కూడా వచ్చిందా. ఇదెందుకు వచ్చింది.. దీనికి కూడా ఏదైనా అవార్డు ఇస్తున్నారా అని అనుకుంటుంది. అయినా ఇది ఉండగా నేనెందుకు ఇక్కడ ఉండాలి.. నేను వెళ్లిపోతా అని అనుకుంటుంది. ఇంతలో నిర్వాహకుడు వచ్చి అక్కడ కూర్చోండి అంటాడు.
కానీ.. వద్దు అని అంటుంది జ్వాల. శౌర్య ఇక్కడికొచ్చిందేంటి సౌందర్య అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో నాకే అర్థం కావడం లేదు అంటుంది సౌందర్య. అవార్డులు మీ చేతుల మీదుగా ఇవ్వండి అని నిర్వాహకులు చెబుతారు. ఒక్కొక్కరికి అవార్డులు ఇస్తుంటారు.
తర్వాత జ్వాలను పిలుస్తారు. జ్వాల వచ్చిందా అని చూసి షాక్ అవుతుంది తింగరి. తర్వాత జ్వాల స్టేజ్ మీదకు వెళ్తుంది. శౌర్యకు అవార్డు ఇస్తున్నారా గ్రేట్ అని అనుకుంటుంది హిమ. ఈరోజు నేను ఇక్కడికి రావడం మంచిదైంది అని అనుకుంటుంది హిమ.
ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అంటుంది సౌందర్య. ఇలాంటి ధైర్యం ఉన్న యంగ్ ఫ్రెండ్ నాకు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అని అంటుంది సౌందర్య. నన్ను నానమ్మ అని పిలిస్తే బాగుంటుందని నా మనసు చెబుతోంది అంటుంది సౌందర్య.
కానీ.. ముద్దుగా సీనియర్ సిటిజన్ సీసీ అని పిలుస్తుంది. అయినా నాకు సంతోషమే అంటుంది సౌందర్య. త్వరలోనే నానమ్మ అని పిలుస్తుందని ఆశిస్తున్నాను అంటుంది సౌందర్య. ఈ అవార్డును యంగ్ డాక్టర్ జ్వాల గారికి అవార్డును అందజేయాలని కోరుతున్నాం అంటారు నిర్వాహకులు.
దీంతో హిమ స్టేజ్ మీదికి వస్తుంది. జ్వాలకు కోపం వస్తుంది. డాక్టర్ హిమ గారికి గట్టిగా చప్పట్లు అని అంటారు నిర్వాహకులు. దీంతో జ్వాల షాక్ అవుతుంది. తనే హిమ అని అనుకుంటుంది. దీంతో హిమ చెంప చెళ్లుమనిపిస్తుంది జ్వాల. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కవుతారు.
నువ్వు హిమవా.. అంటుంది జ్వాల. ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది. దీంతో శౌర్య అది అంటుంది.. హిమ. చంపేస్తాను అంటుంది శౌర్య. ఇంత మోసం చేస్తావా. నా పక్కనే ఉన్నావు. నా స్టోరీ తెలుసుకుంటావు. నా శత్రవు గురించి చెబుతుంటే వింటావు. నా ప్రేమను లాగేసుకుంటావు. నా డాక్టర్ సాబ్ ను దూరం చేస్తావు. పెళ్లి చేసుకుంటావు.. నువ్వు మహా మోసగత్తెవు అంటుంది శౌర్య.
దీంతో నేను మొదటి రోజే చెప్పాలనుకున్నాను అంటుంది హిమ. కానీ.. నోర్మూయ్ అంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.