Home » Entertainment » Karthika Deepam 6 April 2022 Full Episode
Entertainment

Karthika Deepam 6 April Today Episode : శౌర్యను కనిపెట్టిన హిమ.. కానీ.. శౌర్య దగ్గరికి వెళ్లి తానే హిమ అనే నిజం చెబుతుందా? శౌర్యకు హిమ ఎవరో తెలుస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: April 6, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam 6 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 ఏప్రిల్ 2022, బుధవారం ఎపిసోడ్ 1319 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో నుంచి వెళ్లిపోతే.. ఇంట్లో వాళ్లు ఇంతలా బాధపడతారా? అయినా నేను ఇంట్లో నుంచి వెళ్తే కనీసం నాకోసం వెతకలేదు. అయినా నా కోపం అంతా దాని మీదే అని అనుకుంటుంది జ్వాల. ఆ మహిళను సౌందర్య ఇంటి వద్దే దించుతుంది. కానీ.. పైన ఉన్న సౌందర్య, ఆనంద రావును చూడదు. అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకునేలోపే.. ఆటోలో ఆ మహిళ బ్యాగు ఒకటి మరిచిపోతుంది. దీంతో ఆ బ్యాగును తీసుకొని ఇంట్లోకి రాబోతుంది జ్వాల.

Advertisement

karthika deepam 6 april 2022 full episode

తను ఇంట్లో అడుగు పెట్టగానే సౌందర్యకు ఏదో తెలియని కొత్తదనం కలుగుతుంది. కానీ.. అదేమీ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆ ఇంటిని చూసి పెద్దిళ్లే. మా నానమ్మ వాళ్లు కూడా ఇలాంటి పెద్ద ఇంట్లోనే ఉంటారంట అని అనుకుంటుంది జ్వాల. డోర్ వద్దకు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అంటుంది. అది విన్న సౌందర్య డోర్ వద్దకు రాబోతుంది. ఇంతలో లక్ష్మీని పిలిచి ఎవరో వచ్చినట్టున్నారు చూడు అంటుంది సౌందర్య. లక్ష్మీ వెళ్లి ఎవరా అని చూస్తుంది. తన బ్యాగు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

Advertisement

మరోవైపు ప్రేమ్.. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ లో హిమ ఫోటోలను చూస్తుంటాడు. హిమ నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి అంటే నేను నిన్నే చూపిస్తాను. అమాయకత్వం, అణకువ.. మాట తీరు అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి.

నిజంగా నువ్వు నా జీవితంలోకి వస్తే బాగుంటుంది. ఈసారి నీకు ఒక అందమైన ఫోటోను బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఆ ఫోటో కెమెరాతో తీసింది కాదు.. నా మనసుతో తీసింది. ఆ ఫోటో నీకు ఇస్తూ నా ప్రేమ గురించి చెబుతాను హిమ. ఎప్పుడెప్పుడు నా ప్రేమ విషయం నీకు చెప్పాలా అని ఉంది అని అనుకుంటాడు ప్రేమ్.

Advertisement

మరోవైపు జ్వాలకు నిరుపమ్ కనిపిస్తాడు. ఆటోలో వెళ్లాలి అంటాడు. దీంతో కూర్చోండి డాక్టర్ సాబ్ అంటుంది. చివరకు చూస్తే.. నిరుపమ్ కాదు.. వేరే ఎవరో వస్తారు. నాకు ఏమైంది. ఎవరో వస్తే డాక్టర్ సాబ్ అనుకోవడం ఏంటి. నాకేమైంది అని అనుకుంటుంది శౌర్య.

ఇంతలోనే మరోసారి డాక్టర్ సాబ్ కనిపిస్తాడు. ఈసారి నిజమేనా అని అనుకుంటుంది. కానీ.. చూస్తే అతడు వేరే డాక్టర్. నాకేమైపోతోంది అని అనుకుంటుంది. ఇంతలో నిరుపమ్ స్కూటీ మీద వెళ్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు తనకు.

Karthika Deepam 6 April Today Episode : శౌర్య ఆచూకీ కోసం మెడికల్ క్యాంపు నిర్వహించిన హిమ

ఇంతలో తనకు తన ఆటో వెనుక ఉన్న వొదిలేదేలే అని పదం కనిపిస్తుంది. దీంతో మళ్లీ హిమ గుర్తొస్తుంది. ఆ హిమను వదిలను అని అనుకుంటుంది శౌర్య. ఇంతలోనే శౌర్యకు ఫోన్ వస్తుంది. చంద్రమ్మ ఫోన్ చేస్తుంది. ఈ టైమ్ లోనా అంటుంది. ఇంటికి రావడం ఏంటి పిన్ని అంటుంది. సరే వస్తున్నాను అంటుంది.

మరోవైపు హిమ, నిరుపమ్ ఇద్దరూ కారులో వెళ్తుంటారు. శౌర్య ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. మెడికల్ క్యాంపులకు మా ఫ్యామిలీకి విడదీయరాని బంధం ఏదో ఉందని నమ్మకం. అమ్మ డాడీ విడిపోయినప్పుడు మా శౌర్య కూడా మెడికల్ క్యాంప్ లోనే గుర్తుపట్టిందట.

Advertisement

వారణాసి, అరుణ ఆంటి, లక్ష్మణ్ అంకుల్.. అక్కడ ఉన్నవాళ్లకు అందరికీ అమ్మ, శౌర్య గురించి బాగా తెలుసు. శౌర్య ఎప్పుడైనా అక్కడికి వచ్చి వెళ్లిందేమో. శౌర్యను చూసిన వాళ్లు.. ఎవరో ఒకరు మెడికల్ క్యాంపునకు వస్తారని ఆశ బావ అంటుంది హిమ.

శౌర్య కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు నిరుపమ్. శౌర్య ఇప్పుడు ఎలా ఉందో.. ఎక్కడుందో కదా హిమ అంటాడు నిరుపమ్. ఆ తర్వాత మెడికల్ క్యాంపులో జ్వాల రక్తం ఇస్తుంది. అక్కడ నిరుపమ్ తన చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టును చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హిమ.. తనే శౌర్య అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి