Karthika Depam 6 Oct Today Episode : కార్తీక్ తో మోనితను చూసి హిమ షాక్.. హిమ, శౌర్య పేపర్ చదివారని తెలుసుకొని దీప షాక్.. నాన్న గుడ్ బాయ్ కాదు అని శౌర్యతో చెప్పిన హిమ

karthika deepam 6 october 2021 full episodekarthika deepam 6 october 2021 full episode

karthika deepam 6 october 2021 full episode

Karthika Depam 6 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 6 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1163 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమస్య నీ సంసారంలోకి ప్రవేశించింది. కన్నీళ్లు పెట్టుకుంటావో.. కఠినమైన నిర్ణయం తీసుకుంటావో నీకే వదిలేస్తున్నాను దీప. నీకోసం కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప నేనేం చేయలేను.. నువ్వే ఆలోచించు.. నీ మనసు ఏది చెబితే అది చేయ్ అని సౌందర్య.. దీపకు చెబుతుంది. దీంతో దీప ఏం చేయాలి.. అని ఆలోచిస్తుంది. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది.

karthika deepam 6 october 2021 full episode

మరోవైపు హిమ ఆసుపత్రిలో తన తండ్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన తండ్రి ఆపరేషన్ చేస్తున్నాడని తెలిసి కూర్చొని ఉంటుంది. ఇంతలో ఆపరేషన్ పూర్తి చేసుకొని వస్తాడు కార్తీక్. సాయంత్రం మరో ఆపరేషన్ చేయాలని సిబ్బందితో చెప్పి తన రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు.

karthika deepam 6 october 2021 full episode

Karthika Depam 6 Oct Today Episode : కార్తీక్ రూమ్ లో కూర్చొని కార్తీక్ కు షాక్ ఇచ్చిన మోనిత

తన రూమ్ లో తన సీటులో మోనిత కూర్చొని ఉంటుంది. డాక్టర్ భారతి తనకు వేరే చీర ఇవ్వడంతో ఆ చీర కట్టుకొని అక్కడికి వస్తుంది. నువ్వా అని అంటాడు కార్తీక్. అవును కార్తీక్.. మోనితను నీ మోనితను. ఏంటి కార్తీక్ అలా చిక్కిపోయావు. నామీద బెంగ పెట్టుకున్నావా? అందుకే.. నన్ను ఖైదీ చీరలో చూడలేవని… కలర్ శారీలో వచ్చా. ఎలా ఉన్నా నేను. బాగున్నా కదా.. అంటుంది.

karthika deepam 6 october 2021 full episode

నువ్వేంటి ఇక్కడా.. ఎలా వచ్చావు అని అడుగుతాడు కార్తీక్. ప్రేమ ఎంత పని అయినా చేస్తుంది కార్తీక్. నిన్ను చూడక కొన్ని రోజులే అయినా యుగాలు అయినట్టు అనిపిస్తోంది కార్తీక్. ఇది కూడా ప్రేమ మహిమే కదా అంటుంది మోనిత. ఎందుకు వచ్చావు? అని అడుగుతాడు కార్తీక్.

karthika deepam 6 october 2021 full episode

ఇదేం ప్రశ్న.. నేను రాలేదు. నీమీద ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అనగానే షట్ అప్ మోనిత.. అని కార్తీక్ అంటాడు. అయ్యో రామా.. జైలులో ఎంతో కష్టపడి హార్ట్ ఎటాక్ వచ్చిందని నమ్మించి.. ఇంత కష్టపడి వస్తే.. నువ్వు ఇలా మాట్లాడుతావా? అంటుంది మోనిత. నీతో మాట్లాడటానికి ఇంకేం మిగల్లేదు.. అంటాడు కార్తీక్.

karthika deepam 6 october 2021 full episode

Karthika Depam 6 Oct Today Episode : మోనిత, కార్తీక్ ను చూసి షాక్ అయిన హిమ

ఇంతలో హిమ.. కార్తీక్ రూమ్ కి వెళ్లబోతుంది. రూమ్ బయట నుంచి లోపల మోనిత ఉండటం చూసి షాక్ అవుతుంది. గెట్ అవుట్ మోనిత.. అని కార్తీక్ అంటుండగా హిమ చూస్తుంది. కార్తీక్ హిమను చూడడు కానీ.. మోనిత మాత్రం హిమను చూసి వెంటనే ప్లేట్ మారుస్తుంది.

karthika deepam 6 october 2021 full episode

లక్ అంటే ఇలా ఉండాలి.. దేవుడా నువ్వు ఉన్నావు అని హిమను చూసి అనుకున్న మోనిత.. ఎందుకు కార్తీక్.. నా మీద నీకు అంత కోపం.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు కార్తీక్ అంటుంది. ఇంతలో మోనిత ఆంటి డాడీ దగ్గర ఉందేంటి.. జైలులో కదా ఉండాలి అని అనుకుంటుంది హిమ.

karthika deepam 6 october 2021 full episode

కార్తీక్ పదే పదే నన్ను ఎందుకు వెళ్లమంటున్నావు. నేను చేసిన తప్పు ఏంటి. ఆరోజు విజయనగరంలో ఉన్న హిమ ఆచూకి తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నావు కదా కార్తీక్. ఆ మాట నిజమా కాదా.. ఆ మాట తప్పావు కదా కార్తీక్. నువ్వు నన్ను మోసం చేశావు కదా. ఇచ్చిన మాట తప్పావు కదా కార్తీక్. పెళ్లి చేసుకుంటానన్న మాట తప్పావు కదా కార్తీక్. మీ అమ్మాయి హిమ.. అమ్మేది కార్తీక్ అంటే.. ఎవరో ముక్కు మొహం తెలియని ఓ అమ్మాయి ఫోటో చూపించావు. అది తప్పే కదా కార్తీక్. పాపం.. పిల్లకు అబద్ధం చెప్పొచ్చా. వంటలక్కే మీ అమ్మ అని చెప్పలేదు కదా కార్తీక్.. అనగానే మోనిత నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు కార్తీక్.

నిజం మాట్లాడుతున్నాను కార్తీక్. ఎక్కువ కాదు. నువ్వంటే హిమకు వాళ్ల అమ్మ గురించి అబద్ధం చెప్పావు కానీ.. నేను అలా చెప్పలేను. రేపు నాకు పాప బాబు పుడితే.. మమ్మీ మమ్మీ మా డాడీ ఎవరు అని అడిగితే.. మీ నాన్న పెద్ద డాక్టర్. ఆయన పేరు కార్తీక్ అని చెబుతాను.. అంటుంది మోనిత. దీంతో హిమ షాక్ అవుతుంది.

నీలా పిల్లలకు నేను అబద్ధం చెప్పలేను కార్తీక్. తప్పు కదా.. నా కడుపులోని బిడ్డకు తండ్రివి నువ్వే కదా కార్తీక్.. అంటుంది మోనిత. ఈ మాట వినగానే.. హిమ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో మోనిత ఫుల్ ఖుషీ అవుతుంది.

Karthika Depam 6 Oct Today Episode : నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేను కాదు.. అని ఖరాఖండిగా చెప్పిన కార్తీక్

నువ్వే కదా కార్తీక్.. అని అనగానే కాదు కాదు కాదు.. నువ్వు ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ చేయించుకొని కడుపు చేసుకుంటే ఎవ్వరూ కాదు. అది అనైతికం అనగానే.. కరెక్టే కార్తీక్ కానీ.. ఎలా అయినా ఆ బిడ్డకు తండ్రివి నువ్వే. ఇవన్నీ అవమానాలు భరించింది నీకోసమే కదా.. అనగానే మోనిత గెట్ అవుట్ అంటాడు కార్తీక్. మోనిత మాట్లాడటం పోలీసులు విని.. మేడమ్ రండి మేడమ్ ఏంటి ఈ గొడవ అంటుంది. హార్ట్ ఎటాక్ వచ్చిందని డిటెయిల్స్ రాయించాను మేడమ్ అంటుంది.. ఓహో.. హార్ట్ ఎటాక్ వచ్చిందని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చావా? నువ్వు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చావని చెబితే నీ శిక్ష ఇంకా పెరుగుతుంది అని చెబుతాడు కార్తీక్. వద్దండి.. నా ఉద్యోగం పోతుంది అని కానిస్టేబుల్ అంటుంది. నువ్వు శిక్షాకాలం పెంచు కార్తీక్.. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. అని చెబుతుంది. బై కార్తీక్.. టైమ్ కు తిను. శిక్షాకాలం అయిపోగానే నేను వచ్చేస్తా.. అని చెప్పి మోనిత వెళ్లిపోతుంది.

Karthika Depam 6 Oct Today Episode : శౌర్య పేపర్ చదివిందని తెలుసుకున్న దీప

కట్ చేస్తే.. ఇంట్లో శౌర్య.. పూలకుండిలో దాచిన పేపర్ ను తిరిగి తీసి.. నాన్న ఇలా చేశాడా అని అనుకుంటుంది శౌర్య. పేపర్ ను చేతుల్లో పట్టుకొని ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన దీప.. పేపర్ ను లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇవ్వు అత్తమ్మ అనగానే అమ్మ ఆ పేపర్ నేను ఎప్పుడో చదివేశాను.. అంటుంది. నేనే కాదు.. హిమ కూడా చూసేసింది. ఇద్దరం కలిసే చదివాం అంటుంది. అందులో ఉన్నవి అన్నీ అబద్ధాలు నమ్మొద్దు అత్తమ్మ అంటుంది. ఇందులో ఉన్నవి అబద్ధాలు అయితే ఈ పేపర్ టీపాయ్ మీద ఉండాలి కదా.. బెడ్ కింద ఎందుకు ఉన్నట్టు.. దాచిపెట్టావా? మాట్లాడవేంటమ్మా.. చెప్పు.. ఇంకొక కొత్త అబద్ధం ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? మీ అందరికీ అలవాటే కదా అంటుంది శౌర్య.

karthika deepam 6 october 2021 full episode

అత్తమ్మ.. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లా ఆలోచించాలి.. చిన్నపిల్లల్లాగానే మాట్లాడాలి అంటుంది దీప. అసలు.. నాన్నకు నువ్వంటే ఇష్టమేనా అమ్మా.. మోనిత ఆంటీని మోసం చేశాడా నాన్న. నాన్న నిన్ను కూడా మోసం చేశాడా? లేకపోతే నాన్నకు నువ్వు ఎందుకు దూరం అయ్యావు అమ్మా.. అని శౌర్య అడుగుతుంది.

అత్తమ్మ.. ఏంటమ్మా ఇవి. ఏంటి ఈ మాటలు అనగానే అమ్మా.. మాకు అన్నీ అర్థం కాకపోవచ్చు కానీ.. కొన్ని అయినా తెలుస్తాయి కదా అంటుంది. ఒకప్పుడు నువ్వు నాన్న దుబాయ్ లో ఉన్నాడు అన్నావు అది అబద్ధం కాదా.. ఇక్కడ హిమకు నానమ్మ.. అక్కడ నువ్వు.. అన్నీ అబద్ధాలే. మన ఇంటికి నాన్న వచ్చి తిని వెళ్తుంటే.. డబ్బులు తీసుకున్నావు కానీ.. నిజం చెప్పలేదు. ఇవన్నీ అబద్ధాలు అయినప్పుడు.. ఈ పేపర్ లో ఉన్నదాని గురించి ఇంకేం చెబుతారో మాకు తెలియదా అమ్మ. నువ్వు చెప్పేవి అబద్ధాలా? ఈ పేపర్ లో రాసినవి అబద్ధాలా? నానమ్మ చెప్పినవి అబద్ధాలా? ఏంటి అమ్మా మాకు ఈ కన్ఫ్యూజన్.. అని శౌర్య వెక్కివెక్కి ఏడుస్తుంది.

నా సంగతి వదిలేయ్ అమ్మ. ఈ పేపర్ చూసి హిమ ఎంత బాధపడిందో తెలుసా పాపం. నాకు అబద్ధం చెప్పినా పర్వాలేదు కానీ.. కనీసం హిమకు అయినా నిజం చెప్పండి అమ్మ.. అని శౌర్య అనగానే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.

karthika deepam 6 october 2021 full episode

Karthika Depam 6 Oct Today Episode : స్కూల్ కు వెళ్లకుండా వేరే చోటుకు వెళ్లిన హిమ

కట్ చేస్తే కారులో హిమ ఓ చోట దిగుతుంది. అది ఎక్కడో తెలియదు. స్కూల్ కు కూడా వెళ్లకుండా.. ఓ చోట కూర్చొని తెగ ఆలోచిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎవ్వరితో మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. పిల్లలు ఇద్దరూ మోనిత గురించి పేపర్ లో చదివారని దీప.. అందరికీ చెబుతుంది. అందుకే.. పిల్లలకు ఏం జరిగిందో మనమే చెప్పేయాలి. లేదంటే పది మంది చెప్పిన మాటలనే నమ్ముతారు.. అని ఆదిత్య సీరియస్ అవుతాడు.

karthika deepam 6 october 2021 full episode

వెంటనే హిమ.. శౌర్యకు అన్ని విషయాలు చెబుతుంది. నాన్న మోనిత ఆంటీని పెళ్లి చేసుకుంటా అన్నాడు.. అని చెబుతుంది. అలా ఎలా చేసుకుంటాడు అని అంటుంది శౌర్య. అది తప్పు కదా.. అని అంటుంది. కానీ.. డాడీ గుడ్ బాయ్ ఏం కాదు తెలుసా? అని అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Share

Recent Posts

Alcohol And Tobacco : పొగాకు, మధ్యపానం సులువుగా మానేసే చిట్కాలు ఇవిగో

Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…

2 hours ago

Kanuga Health Benefits : ఈ చెట్టు ఆకులు, వేర్లు, కాయ‌లు అన్ని ఆరోగ్య ప్ర‌దాయ‌మే

Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…

3 hours ago

Today Gold Price : భారీగా పెరిగిన గోల్డ్ ధర..కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిందే !!

Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…

4 hours ago

Mint Health Benefits : పుదీనాతో బ‌హుముఖ‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్ర‌మే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…

5 hours ago

Farmers : రైతుల‌కి ప్ర‌భుత్వం అందించిన శుభ‌వార్త‌తో ఫుల్ హ్యాపీ

Farmers  : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…

6 hours ago

Liver Diseases : టాప్ 5 కాలేయ వ్యాధులు.. లైట్ తీసుకున్నారో పోతారు

Liver Diseases  : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…

7 hours ago

10th Pass : మీరు ప‌ది పాస్ అయ్యారా.. రూ. 25 వేలు మీ సొంతం..!

10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…

8 hours ago

Caffeine : టీ, కాఫీలు మానేయడం వల్ల ఆరోగ్యానికి జ‌రిగే మేలు తెలుసా..?

Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…

9 hours ago