Karthika Deepam 7 Dec Today Episode : పేషెంట్ ను చంపినందుకు తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన కార్తీక్.. హాస్పిటల్ కట్టేందుకు బస్తీలో స్థలం చూసిన దీప.. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా?

Advertisement
Advertisement

Karthika Deepam 7 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తను ఆపరేషన్ చేసి ఒక వ్యక్తిని పొట్టనపెట్టుకోవడంతో ఆ ఫ్యామిలీ అనాథగా మారడంతో.. ఎలాగైనా ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని కార్తీక్.. తన తల్లి సౌందర్యతో కలిసి చనిపోయిన పేషెంట్ ఇంటికి వెళ్తారు. ఒక కవర్ పట్టుకొని వెళ్తారు. అందులో ఏముందో తెలియదు. వెళ్లగానే.. చనిపోయిన పేషెంట్ భార్య.. మళ్లీ ఎందుకు వచ్చావు. ఏం చేద్దామని వచ్చావు అంటూ సీరియస్ అవుతుంది. కానీ.. కార్తీక్ మాత్రం తన ముందు కూర్చొని తన చేయి పట్టుకొని.. అమ్మా.. నీకు అన్యాయం జరిగింది. నేను కాదనను. పోయిన మీ ఆయనను నేను తెచ్చివ్వలేను. జరిగిన నష్టాన్ని ఏం చేసినా తీర్చలేను అమ్మ. పోయిన మనిషి ప్రాణాలు తీసుకురాలేను కానీ.. ఒక్క పని చేయగలను అమ్మ.. అంటాడు కార్తీక్.

Advertisement

karthika deepam 7 december 2021 full episode

నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు కొన్ని కోట్ల విలువ ఉంటుంది. నేనేమి ఉంచుకోకుండా అన్నీ మీకే ఇస్తున్నాను. ఈ ఆస్తితో మీరు జీవితాంతం హాయిగా బతకొచ్చు. పిల్లలకు మంచి చదువు చెప్పించవచ్చు. పెళ్లిళ్లు చేయొచ్చు.. అని చెప్పి.. తన ఆస్తుల పట్టాలను తన చేతుల్లో పెడతాడు. దీంతో ఇదేంటయ్యా ఇది.. ప్రాణాలు తీసి.. ఈ పట్టాలు ఇస్తున్నావా? మనిషే పోయాక.. ఈ ఆస్తులు ఎవరికి కావాలి.. వద్దుపో అంటుంది. నువ్వే చంపి.. నువ్వే ఆస్తులు ఇస్తావా.. అంటుంది. నీ కాళ్లు పట్టుకుంటాను. తీసుకో అమ్మా.. అంటాడు. నీ పేరు మీద ఆస్తులు రాయించాను. తీసుకో అమ్మా అంటాడు కార్తీక్. కానీ.. నీలమ్మ మాత్రం వద్దంటుంది. అక్కడున్న వాళ్లు కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం పనికొస్తాయి. తీసుకో అమ్మా అంటారు. ఆ ఫైల్ ను చనిపోయిన వ్యక్తి కాళ్ల దగ్గర పెట్టి.. మీకు దండం పెడతాను.. ఇంకోసారి మా పిల్లలను మాత్రం శపించకండి. నా పిల్లలకు ఉసురు తగులుతుంది అని మాత్రం అనకండి. మేం బతికేదే వాళ్ల కోసం అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.

Advertisement

మరోవైపు దీప.. బస్తీలో ఒక ప్లేస్ చూస్తుంది. దాన్ని కొని అక్కడ 4 ఫ్లోర్స్ హాస్పిటల్ కట్టాలి. పైన ఐదో ఫ్లోర్ లో మేం ఉండటానికి ఇల్లు కట్టుకోవాలి అంటుంది దీప. అవును అమ్మ.. ఈ సైట్ బాగుంది వెంటనే కొనేయి అక్క. అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటాడు వారణాసి. దీప కూడా ఎప్పుడెప్పుడు ఆ సైట్ కొని అక్కడ హాస్పిటల్ కట్టాలని తెగ ఆరాటపడుతుంది.

మరోవైపు కారులో వెళ్తుంటారు కార్తీక్, సౌందర్య. నా మీద కోపం వస్తుందా మమ్మీ.. అని అడుగుతాడు కార్తీక్. లేదురా నేను మీ అమ్మనురా అంటుంది. నేను చేసింది తప్పు కాదు మమ్మీ.. పాపం. నా పిల్లల గురించి నేను ఆలోచించాను మమ్మీ. అందుకే.. నా ఆస్తిని ఇచ్చేశాను అంటాడు కార్తీక్.

నేను చేసిన పాపానికి నన్ను తిట్టవా మమ్మీ అని అంటాడు. నీకు కొడుకుగా పుట్టి నేను ఎన్నో తప్పులు చేశాను. మీరు అవమానపడేలా చేశాను. పోలీస్ స్టేషన్లు, కోర్టులు.. ఇంటా బయటా.. నా కోసం మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నేను ఒక దురదృష్టవంతుడిని.. చెడ్డ భర్తను.. చెడ్డ తండ్రిని.. ఇప్పుడు చెడ్డ డాక్టర్ ను కూడా అయ్యాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. అని సౌందర్యతో అంటాడు కార్తీక్.

Karthika Deepam 7 Dec Today Episode : బస్తీలో స్థలం చూసి వెంటనే కొనేందుకు సిద్ధమైన దీప

మరోవైపు ప్రియమణి.. అన్నం తింటూ ఉంటుంది. పొరబోయేసరికి.. నీళ్లు తెచ్చి ఇస్తుంది మోనిత. నీళ్లు కూడా తెచ్చుకోకుండా అన్నం తింటున్నావా అని అడుగుతుంది. నువ్వు వండిన కర్రీస్ నీకు ఎంతలా నచ్చుతాయో.. నా కార్తీక్ నాకెంత నచ్చాలి. కార్తీక్ అంటే నాకు అంత పిచ్చి ప్రేమ అంటుంది మోనిత. దీప నన్ను ఎంత ఇబ్బంది పెడితే.. కార్తీక్ మీద నాకు అంత ప్రేమ పెరుగుతుంది… అంటుంది మోనిత.

ఇంతలో కార్తీక్, సౌందర్య ఇంటికి వస్తారు. ఆనంద రావు ఇంటి బయటే ఉంటాడు. కాళ్లు కడుక్కొని రండి అని చెబుతాడు. ఇంట్లోకి వస్తారు. ఇంతలో ఆటో దిగి దీప ఇంటికి వస్తుంది. దీప చాలా సంతోషంతో ఇంటికి వస్తుంది. డాక్టర్ బాబు అంటూ నవ్వుకుంటూ వస్తుంది. నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది తెలుసా. చెప్పలేను. థ్యాంక్యూ డాక్టర్ బాబు. నా మాట వినగానే బస్తీలో స్థలం కొందామన్నారు. హాస్పిటల్, ఇల్లు అక్కడే కడదామన్నారు.. అంటుంది.

బస్తీలో వారణాసి మంచి స్థలం చూపించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు బస్తీలో ఎన్నో కష్టాలు పడ్డ నేను.. ఇప్పుడు డాక్టర్ బాబు పుణ్యం వల్ల ఇల్లు కట్టుకోబోతున్నాను. మీరు చెప్పిన మాట నిజమే మామయ్య గారు. నేను ఈ ఇంటి పెద్ద కోడలును. కాదు కాదు.. ది గ్రేట్ డాక్టర్ బాబు భార్యను.. అంటుంది దీప.

పిల్లలకు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. వాళ్లకు బస్తీ అంటే చాలా ఇష్టం. డాక్టర్ బాబు.. మీరు నాకు ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్.. బస్తీలో ఇల్లు కట్టివ్వడం. 10 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వమన్నారు. నేనెమన్నానో తెలుసా.. 10 లక్షలు ఏంటి.. 15 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తాం అని చెప్పాను. అంతే కదా డాక్టర్ బాబు. వారం రోజుల్లో డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నారంట.. అని చెబుతుంది దీప.

వారం రోజులు అవసరం లేదు.. మూడు రోజుల్లో కట్టేస్తామని వారణాసికి చెప్పేశాను అంటుంది దీప. కానీ.. ఎవ్వరూ మాట్లాడకపోయేసరికి.. ఏంటి నేనే మాట్లాడుతున్నాను.. మీరెవరూ మాట్లాడటం లేదు. ఏంటి డాక్టర్ బాబు.. అలా డల్ గా మొహం పెట్టారేంటి.. అని అనేసరికి.. దీపకు గట్టిగా హత్తుకుంటాడు కార్తీక్. నన్ను క్షమించు దీప అంటాడు కార్తీక్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

38 seconds ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

1 hour ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

2 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

3 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

4 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

5 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

6 hours ago

RRB NTPC Recruitment : 11558 ఖాళీల కోసం దరఖాస్తుల ఆహ్వానం..అర్హత & చివరి తేదీ..!

RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను…

7 hours ago

This website uses cookies.