Karthika Deepam 7 Feb Today Episode : కార్తీక్ ను చూశాను అని మోనిత చెప్పినా నమ్మని భారతి.. భారతి, మోనిత గురించి తెలుసుకున్న కార్తీక్.. ఏం చేస్తాడు? వాళ్ల కంటపడతాడా?

Karthika Deepam 7 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1269 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంజలి.. వంట సంగతి చూసుకో అని భారతికి చెబుతుంది. దీంతో నేను అదే చెబుతున్నాను అంజలి.. నేను గెస్టుల సంగతి చూసుకుంటాను.. మోనిత, వంటలను చూసుకుంటుంది అని చెబుతుంది భారతి. సరే.. అంజలి గారు నేను వంట సంగతి చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వంట దగ్గరికి వెళ్తుంది మోనిత. అప్పుడే అక్కడ కార్తీక్ వంట చేస్తూ ఉంటాడు. కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది మోనిత. కార్తీక్.. ఇక్కడున్నాడా అని ఆశ్చర్యపోతుంది. కార్తీక్.. ఇక్కడుండటమేంటి ఆని తెగ సంతోషపడిపోతుంది మోనిత.

karthika deepam 7 february 2022 full episode

వెంటనే లోపలికి వెళ్లి భారతిని పిలుస్తుంది మోనిత. భారతి.. కార్తీక్ కనిపించాడు నాకు అంటుంది మోనిత. అయ్యో భారతి నా కళ్లతో నేను చూశానురా చూపిస్తాను అంటుంది మోనిత. వంట దగ్గరికి భారతిని తీసుకెళ్తుంది మోనిత. అదిగో చూడు కార్తీక్ అంటుంది. కానీ.. అక్కడ కార్తీక్ ఉండడు. వేరే వ్యక్తి అక్కడ వంట చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు కార్తీక్.. అని అడుగుతుంది. దీంతో ఇప్పటి దాకా నేను చూశాను భారతి అంటుంది. కానీ.. భారతి మాత్రం తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అయితే.. అప్పుడే వంట చేసి కార్తీక్ అక్కడి నుంచి పరదా వెనక్కి వెళ్లి దీపతో కలిసి పనిచేస్తుంటాడు. ఆ విషయాన్ని భారతి, మోనిత గమనించరు.

దీంతో భారతి.. కార్తీక్ ఎక్కడున్నాడో అన్ని ఆసుపత్రుల్లో వెతుకుదామా అంటుంది మోనిత. భారతి.. ఇప్పుడే చెప్పాను కదా.. వద్దు అని. కార్తీక్ ఇక్కడే ఉన్నాడని తెలుసు కదా. బర్త్ డే పార్టీ అయిపోయాక వెతుకుదాం అని చెప్పా కదా అంటుంది భారతి.

ఇంతలో కార్తీక్ కు కాఫీ ఇచ్చిన దీప.. లోపల ఉన్నవాళ్లకు ఇచ్చి వస్తా అని చెబుతుంది దీప. మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కుర్చీలో కూర్చొని కాఫీ తాగండి అంటుంది దీప. ఇంతలో దీప కాఫీ తీసుకొని లోపలికి రాబోతుంది. మోనిత కూడా అటువైపు రాబోయే సరికి.. అప్పుడే అంజలి వచ్చి మోనితను లోపలికి తీసుకెళ్తుంది.

Karthika Deepam 7 Feb Today Episode : అందరికీ కాఫీ ఇస్తూ భారతి, మోనితను చూసి షాక్ అయిన దీప

అప్పుడే దీప వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంటుంది. అక్కడే డాక్టర్ భారతిని చూస్తుంది. భారతి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. తన కాఫీ తీసుకుంటుంది కానీ.. తనను చూడదు. దీప మాత్రం భారతిని చూసి షాక్ అవుతుంది. భారతి ఏంటి ఇక్కడికి వచ్చిందేంటి.. అని అనుకుంటుంది దీప.

నన్ను ఇక్కడ చూసిందంటే అత్తయ్య వాళ్లకు ఖచ్చితంగా చెప్పేస్తుంది అని అనుకుంటుంది దీప. అప్పుడే మోనితను కూడా చూస్తుంది దీప. మోనితను చూసి షాక్ అవుతుంది దీప. అంటే.. మోనిత, భారతి.. అంజలి మేడమ్ వాళ్ల ఫ్రెండ్సా.. వెళ్లి ఆయనకు చెప్పాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.

డాక్టర్ బాబు ఇటు రండి.. అని చెప్పి.. మనం అర్జెంట్ గా వెళ్లిపోవాలి అంటుంది. మోనిత, భారతిలు ఇక్కడే ఉన్నారు అంటుంది. మోనిత ఇక్కడికెలా వచ్చింది అని అడుగుతాడు. కానీ.. ఒప్పుకున్న పనిని మధ్యలో వదిలేసి ఎలా వెళ్తాం చెప్పు అని అంటాడు.

ఏంకాదు వెళ్దాం పదండి అంటుంది. కానీ.. కార్తీక్ వద్దు అంటాడు. మనకు ఎంతో సాయం చేసిన అంజలి గారి వంట పనిని ఇలా వదిలేసి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు కదా అంటాడు కార్తీక్. మనం టెన్షన్ లో ఉన్నాం అని ఎదుటివాళ్లను టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వంటలన్నీ త్వరగా పూర్తి చేసి వెళ్దాం అంటాడు కార్తీక్.

వంటలన్నీ అయిపోయాయండి.. వెళ్దామా అంటుంది దీప. ఒకసారి వెళ్లి తనకు చెప్పిరా అంటాడు కార్తీక్. ఇంతలో అంజలి అక్కడికి వస్తుంది. వంటలు వండటంతో పాటు గెస్టులకు కాఫీలు, టీలు కూడా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అంటుంది అంజలి.

సరే అండి.. ఇక మేము వెళ్తాం అంటారు. భలేవారే.. ఎక్కడికి వెళ్తారు. కేక్ కట్ చేశాక భోం చేసి వెళ్లండి అంటుంది అంజలి. ఇంతలో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. టవల్ ను ముఖానికి అడ్డంగా కట్టుకుంటాడు. తను బలవంతపెడుతుంటే తప్పని పరిస్థితుల్లో కార్తీక్ లోపలికి వస్తాడు.

దీప కూడా వస్తుంది. ఇంతలో కేక్ కట్ చేస్తారు. కానీ.. దీప, కార్తీక్ దూరంగా నిలుచుంటారు. అంజలి చూసి రండి.. అందరికీ కేక్ ఇవ్వండి అని కార్తీక్ ను పిలుస్తుంది. దీంతో ప్లేట్ తీసుకెళ్లి కేక్ తీసుకొని అందరికీ సర్వ్ చేస్తుంటాడు కార్తీక్. ఇంతలో భారతితో మోనిత మాట్లాడుతూ ఉంటుంది. భారతి కార్తీక్.. ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఉంటాడంటావా లేక ఏదైనా హాస్పిటల్ పెట్టి ఉంటాడంటావా అంటుంది.

నీకు ఎప్పుడూ ఇదే టాపికా అంటుంది భారతి. కేక్ తీసుకుంటూ కార్తీక్ ను చూస్తుంది మోనిత. తను కూడా అచ్చం కార్తీక్ లాగే కనిపిస్తున్నాడు నాకు అని భారతికి చెబుతుంది మోనిత. కార్తీక్ నా మీద అలిగాడు. నా మీద అలిగి ఇక్కడికి వచ్చేశాడు. ఇదే ఊళ్లో ఉన్నాడని తెలిసింది. మీరు ఒకసారి పేషెంట్ డిటెయిల్స్ ఇస్తే నేను కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకొని బతిమిలాడుకుంటాను అని అంజలితో అంటుంది మోనిత.

దీంతో ఇందాక మీకు కేకు ఇచ్చాడు కదా. ఆయనే ఆ పేషెంట్ తండ్రి అని చెబుతుంది అంజలి. దీంతో మోనిత.. అతడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

4 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

7 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

10 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

12 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

15 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

17 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago