Karthika Deepam 7 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జనవరి 2022 శుక్రవారం ఎపిసోడ్ 1243 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ కోసం బెంగ పెట్టుకొని ఆనంద రావు జబ్బుపడతాడు. డాక్టర్ భారతి వచ్చి ఆయనకు చెక్ చేస్తుంది. కార్తీక్ గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి అంటుంది భారతి. వాళ్లు ఊరెళ్లారు.. రేపో ఎల్లుండో వస్తారు అన్నట్టు కాదు కదా. వాళ్లు ఎప్పుడు వస్తారో.. రారో కూడా తెలియదు.. నేను ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు.. అంటూ ఆనంద రావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఆంటి.. అంకుల్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు. వయసుతో పాటు వచ్చే సమస్యలు కూడా తోడయ్యాయి.. అని సౌందర్యతో చెబుతుంది భారతి.
మరోవైపు దీప పిండివంటలను ప్యాక్ చేస్తుంటుంది. కార్తీక్ కూడా వచ్చి ప్యాక్ చేస్తా అంటాడు. వద్దండి అంటుంది. ఇంతలో పిల్లలు స్కూల్ కు వెళ్లొస్తాం అని చెబుతారు. మరోవైపు మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన హాస్పిటల్ కు ఎవ్వరూ రాకపోవడం.. తనకు కనీసం కూరగాయలు కూడా తెచ్చి ఇచ్చేవాళ్లు లేకపోవడం.. నర్సమ్మను కూడా బస్తీ వాళ్లు వెళ్లగొట్టడంతో ఏం చేయాలో మోనితకు అర్థం కాలేదు. సౌందర్య ఆంటి.. మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియదు ఆంటి. సెల్ ఫోన్ దొరికిన మహేశ్ ను పిలిచి.. వాడికి డబ్బులు ఇచ్చి రహస్యంగా కార్తీక్ ను వెతకడం కోసం వాడిని గూడచారిగా పంపిస్తారా? వావ్.. సూపర్ ఆంటి. ఎన్ని గేమ్స్ ఆడినా.. చివరకు గేమ్ లో విజయం నాదే.. అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు మోనితకు ఎవరో ఒక మహిళ ఫోన్ చేస్తుంది. నేను విన్నిని మాట్లాడుతున్నాను అంటుంది. మేడమ్.. నేను మీ దగ్గరికి వచ్చాను. నాకు ఇక్కడ అడ్రస్ సరిగ్గా అర్థం కావడం లేదు.. అడ్రస్ చెప్పండి అంటుంది. దీంతో అడ్రస్ చెబుతుంది. వచ్చేయ్ అంటుంది.
మరోవైపు కార్తీక్ ఇంకా ఏదో పరధ్యానంలో ఉంటాడు. దీప గురించి.. పిల్లల గురించే ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. పిచ్చోడిలా అరుస్తాడు. కార్తీక్ పిచ్చోడిలా అరుస్తుంటే అక్కడున్న వాళ్లు చూసి షాక్ అవుతారు. ఇంతలో దీప అదే దారిలో వెళ్తుంటుంది. చూసి షాక్ అవుతుంది. ఏంటండి మీరు ఇలా రండి.. కూర్చోండి.. అని అంటుంది.
ఏమండి.. నేను ఒక మాట చెప్పనా.. మీరు ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అంటుంది. నాకు పిచ్చి లేస్తుంది అంటాడు కార్తీక్. మనకు ఏం తక్కువైందండి. మీకు నేనున్నాను. నాకు మీరున్నారు. దేవుడు మనకు రత్నాల్లాంటి ఆడపిల్లలు ఉన్నారు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు అంటుంది దీప.
డబ్బు, కారు, బంగ్లా లేకపోయినా కొన్ని కోట్ల మంది సంతోషంగా ఉన్నారు. మనకు ఏం కాదు. మీరు దయచేసి భయపడకండి. మీకు ఏం లేదు అనుకోకండి. మనకు అన్నీ ఉన్నాయి అనుకోండి.. కాస్త డబ్బు లేదు అనుకోండి అంతే అని చెప్పి కార్తీక్ కు బాక్స్ ఇస్తుంది. ఈ బాక్స్ పిల్లలకు ఇచ్చి రండి. నేను షాపులో పిండివంటలు ఇచ్చి వస్తాను అని చెబుతుంది దీప.
నేను వెళ్లివస్తాను.. మీరు జాగ్రత్త అని చెబుతుంది. మరోవైపు సౌందర్య ఇంకా పిల్లలు, కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఆదిత్య అక్కడికి వస్తాడు. డాడీ ఎక్కడ మమ్మి.. కనిపించడం లేదు అని అడుగుతాడు.
దీంతో ఇంటి ముందు వాకింగ్ చేస్తున్నట్టున్నాడు. ఆయన్ను చూస్తుంటే భయమేస్తుంది ఆదిత్య. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. వేళాపాలా లేకుండా పచార్లు చేస్తున్నారు అని చెబుతుంది సౌందర్య. పైకి బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం మానసికంగా వీక్ గా ఉన్నారని డాక్టర్ భారతి కూడా చెప్పింది.. అని అంటుంది సౌందర్య.
మరోవైపు దీప.. పిండి వంటలు అమ్మేందుకు కిరాణ షాపునకు వెళ్తుంది. కానీ.. వద్దు అంటాడు సేటు. మేము ఇప్పటికే తీసుకున్నాం అంటాడు. వేరేవాళ్లు ఇచ్చారు అంటాడు. వాళ్లు 25 రూపాయలకే ప్యాకెట్ ఇచ్చారు అంటాడు. ఎవరు అంటే రుద్రాణి అంటాడు. ప్యాకెట్ తీసి చూపిస్తాడు. దీంతో దీప షాక్ అవుతుంది.
దీప వాటిని అమ్మకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చాలా కిరాణ షాపుల్లో అడుగుతుంది కానీ.. ఎవ్వరూ కొనరు. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు కార్తీక్ బాక్స్ ఇచ్చేందుకు స్కూల్ కు వెళ్తూ ఉంటాడు. నేను ఏమౌతున్నాను.. అని బాధపడతాడు.
తనకు ఏదో ఒక సాయం చేయాలి కదా అని అనుకుంటూ స్కూల్ కు వెళ్తాడు. కానీ.. బాక్స్ కింద పడి భోజనం మొత్తం పోతుంది. మరి మీరు ఏం తింటారు అంటే.. ఏం కాదు నాన్న మేము సాయంత్రం ఇంటికి వచ్చాక తింటాంలే అంటారు. లేదమ్మా.. నేను వెళ్లి మీకు అన్నం తీసుకొస్తాను అంటాడు కార్తీక్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.