Karthika Deepam 7 Sep Today Episode : కార్తీక దీపం 7 సెప్టెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 1138 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజు సీసీటీవీ కెమెరాలు సర్వీస్ కోసం తీసేశారు కదా మేడమ్ అని రత్నసీత చెప్పేసరకి.. ఓ.. మోనిత స్టేషన్ కు వచ్చింది అని చెప్పిన రోజే సీసీటీవీ కెమెరాలు సర్వీస్ కు ఇచ్చారా? అంటుంది ఏసీపీ మేడమ్. కార్తీక్ చెప్పింది.. మోనిత చెప్పింది నిజమే అని అనుకోవాలంటే.. మన స్టేషన్ లో ఎవరైనా మోనితకు సాయం చేస్తున్నారా? వాళ్లు చెప్పినట్టు నిజంగానే మోనిత బతికే ఉందా? అనే డౌట్ ఏసీపీకి కూడా వస్తుంది.
కట్ చేస్తే.. కార్తీక్ ఇంకా ఆసుపత్రిలోనే ఉండి.. తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. తనకు పిచ్చి లేస్తుంది. ఓవైపు మోనిత టార్చర్ తట్టుకోలేకపోతుంటాడు. ఇంతలోనే దీప అక్కడికి వస్తుంది. డాక్టర్ బాబు ఏమైంది.. ఒంట్లో బాగలేదా.. కళ్లు తిరుగుతున్నాయా? అంటూ అడుగుతుంది దీప. నువ్వు వచ్చావు కదా.. నువ్వు పక్కన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది.. కూర్చో అని అంటాడు కార్తీక్. మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు డాక్టర్ బాబు.. అనగానే ఈ టెన్షన్ నాకోసం కాదు.. నీ కోసం.. నా కుటుంబం కోసం.. పిల్లల కోసం అంటాడు కార్తీక్.
నిరపరాధికి శిక్ష పడదు డాక్టర్ బాబు.. అంటుంది దీప. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు.. అని చెబుతుంది. అవును.. మీరంతా జాగ్రత్తగా ఉండండి.. అని చెబుతాడు కార్తీక్. ఎందుకండి.. మాకు జాగ్రత్తలు చెప్పుతున్నారు.. ఆ మోనిత బతికే ఉందని నమ్ముతున్నారు కదా.. మీరు మోనిత బతికే ఉందని నమ్మితే చాలు.. నేను అది ఎక్కడ దాచుకొని ఉన్నా సరే.. దాన్ని వెతికి పట్టుకొని తీసుకొస్తా.. ఏసీపీకి అప్పగిస్తా.. అని చెబుతాడు కార్తీక్.
కట్ చేస్తే.. మోనిత పెళ్లికి రెడీ అవుతుంటుంది. ఇంతలోనే రత్నసీత వస్తుంది. రా.. రత్నసీత నీకోసమే చూస్తున్నాను. ఇవాళ నా పెళ్లి.. అని చెబుతుండగానే.. వద్దు మేడమ్ ఇవన్నీ ఆపేయండి. పెళ్లి ప్రపోజల్స్ నుండి డ్రాప్ అయిపోండి. రోషిణి మేడమ్ కు డౌట్ వచ్చింది. రోషిణి మేడమ్ ఆరా తీస్తోంది.. అంటూ సీసీటీవీ కెమెరాల విషయం గురించి చెప్పింది రత్నసీత. మీరు వచ్చి దయచేసి లొంగిపోండి మేడమ్.. అంటుంది కుదరదు అని చెబుతుంది. ఆ దేవుడు దిగి వచ్చి చెప్పినా నేను డ్రాప్ కాను.. అంటుంది మోనిత. నా పెళ్లి అయ్యాక నేనే ఎలాగూ ఏసీపీకి లొంగిపోతాను. వెళ్లి నీ పని నువ్వు చూసుకో. వెళ్లి డ్యూటీ చేసుకోపో.. అని రత్నసీతకు చెబుతుంది మోనిత.
కట్ చేస్తే ఆనంద రావు.. ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుంటాడు. సౌందర్య ఎక్కడికో బయలు దేరుతుంది. లాయర్ తో మాట్లాడారా.. అని అడుగుతుంది. ఆ.. కోర్టుకు వస్తా అన్నాడు అంటాడు ఆనంద రావు. నాకు చాలా టెన్షన్ గా ఉందండి.. అంటుంది. నేను కోర్టు వెళ్తాను అని చెబుతుంది సౌందర్య.. నేను కూడా వస్తాను.. అని చెబుతాడు ఆనందరావు. వద్దండి.. కోర్టులో జరిగే విషయాలు చూసి.. మీరు తట్టుకోలేరు.. వద్దు అని చెబుతుంది సౌందర్య.
ఏం కాదు.. ఏం జరిగినా తట్టుకునే శక్తి నాకు ఉంది. అక్కడికి రాకపోయినా.. ఇక్కడ ఉండి కూడా నేను టెన్షన్ పడుతూ ఉండాలి కదా.. అని చెబుతాడు ఆనంద రావు. దేవుడి దయ వల్ల.. కార్తీక్, దీప అనుకుంటున్నట్టు ఆ మోనిత కనిపిస్తే.. కార్తీక్ వెంటనే బయటికి వస్తాడు.. అని సౌందర్య.. ఆనందరావుకు చెబుతుండగానే అన్నీ విన్న శౌర్య.. అవునా.. అని అంటుంది. మోనిత కనబడటానికి.. నాన్న బయటికి రావడానికి సంబంధం ఏంటి నానమ్మా.. అని అడుగుతుంది శౌర్య.
డాక్టర్ బాబు భోం చేయండి అని అడుగుతుంది దీప. ఆకలి లేదు అంటాడు. ఎందుకు.. అని అడుగుతుంది.. ఇంకేదో కారణం ఉంది.. అని అంటుంది. మీరు శిక్ష పడుతుందని భయపడుతున్నారా? అని అడుగుతుంది. నాకు దాని గురించి దిగులు లేదు.. అంటాడు. మీరందరూ బాగుండాలి.. బాగుంటారు.. మోనిత నిన్ను రివాల్వర్ తో చంపాలని చూసింది కదా.. అని చెబుతాడు. ఆ మోనిత మిమ్మల్ని కూడా బెదరిస్తోందా.. తను నిన్ను బెదిరించదు.. అని చెబుతుంది దీప.
మోనిత ఎప్పుడైతే అమెరికా నుంచి తిరిగి వచ్చిందో అప్పటి నుంచి నా జీవితం అస్తవ్యస్తంగా మారింది. తను నా జీవితాన్ని నాశనం చేసింది. అమెరికా వెళ్లకముందే హిమను చంపించింది. అమెరికా నుంచి తిరిగి వచ్చి.. నేను పెళ్లి చేసుకున్నానని తెలిసి.. చాలా నేరాలు చేసింది. నా పక్కనే ఉంటూ.. మంచిగా ఉన్నట్టు నటిస్తూ.. నిన్నూ నన్నూ 10 ఏళ్లు విడదీసింది. కట్టుకున్న భార్య మాట వినలేదు.. కన్నతల్లి మాట వినలేదు.. అందుకే అనుభవిస్తున్నాను. కానీ.. నాకు ఏదైనా అయితే.. నేను జైలుకు వెళ్తే.. మీరు అంతా ఏమైపోతారు.. అంటూ గుక్కపెట్టి ఏడుస్తాడు కార్తీక్.
మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు డాక్టర్ బాబు.. అని అంటుంది దీప. అవును.. అంటాడు. మీరు నిర్దోషి అని నేను నమ్ముతున్నాను. ఆ మోనితను ఎక్కడున్నా పట్టుకొని నేను పోలీసులకు అప్పగిస్తాను.. అంటుంది దీప. వద్దు.. నువ్వు మోనిత జోలికి అస్సలు పోకు.. అంటాడు కార్తీక్. అది మనిషి కాదు.. అడవి మృగం. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను కూడా వదలదు.. అని చెబుతాడు కార్తీక్.
కార్తీక్ ను ఈరోజు కోర్టుకు హాజరు పరచాలి.. అన్నీ సిద్ధం చేయి.. నేను చిన్న ఎంక్వయిరీ ఉంది అక్కడికి వెళ్లి వస్తా. మన స్టేషన్ కు ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో చూసుకోవాలి కదా.. అప్రమత్తంగా ఉండాలి కదా.. అని కానిస్టేబుల్ కు చెప్పి వెళ్తుంది ఏసీపీ.
కట్ చేస్తే.. మోనిత డాక్టర్ లా రెడీ అయి.. ఆసుపత్రికి బయలు దేరుతుంది. వస్తున్నా కార్తీక్. ఇక నేను వెయిట్ చేయలేను. ఇన్నేళ్లు ఎదురు చూసి చూసి నా కళ్లు కాయలు కాచాయి. ఇవాళ్టితో నా ఎదురుచూపులు తప్పిపోతాయి. నువ్వు ఈరోజు నుంచి నా వాడవి.. అని అనుకుంటుంది మోనిత.
సౌందర్య, ఆనంద రావు ఇద్దరూ కారులో కోర్టుకు బయలు దేరుతారు. శౌర్యకు డౌట్ వచ్చిందా.. అని అడుగుతుంది సౌందర్య. పిల్లలు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. అని సౌందర్య.. ఆనంద రావుతో అంటుంది. దీప కూడా వస్తుందా కోర్టుకు అని ఆనంద రావు అడుగుతాడు.
ఆసుపత్రిలో కార్తీక్ కు దీప భోజనం తినిపిస్తుంది. లాభం లేదు.. ఎటూ నన్ను కోర్టుకు తీసుకెళ్తారు. మోనిత బతికే ఉందని తెలియకపోయినా.. కనీసం నావాళ్ల కోసం పోలీసులతో మాట్లాడి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయిస్తాను.. అప్పుడు నావాళ్లకు ఏం కాదు.. అని అనుకుంటాడు కార్తీక్. కార్తీక్ కు భోజనం తినిపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప. ఇవాళ మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఇక మీరు మాకు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు. ఏ నేరం చేయకున్నా శిక్ష అనుభవించాల్సి పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటుంది దీప. ఆ మోనిత వల్లే వచ్చింది.. అని చెబుతాడు కార్తీక్. ఇంతలోనే మోనిత కారు దిగి ఆసుపత్రికి వస్తుంది.
ఆ తర్వాత ఎస్ఐకి ఫోన్ చేయడం.. ఎస్ఐ ఫోన్ తీసుకెళ్లి కార్తీక్ కు ఇవ్వడం.. కార్తీక్ తనతో మాట్లాడుతుండగానే.. ప్లేట్ కడిగేందుకు బయటికి వచ్చిన దీప.. మోనితను చూడటం.. అన్నీ ఒకేసారి జరుగుతాయి. మోనితను చూసి కోపంతో తన చేతుల్లో ఉన్న ప్లేట్ ను కిందపడేస్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.