karthika deepam 8 january 2022 full episode
Karthika Deepam 8 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జనవరి 2022, శనివారం 1244 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేరళ నుంచి తన దగ్గర పని చేయడం కోసం మోనిత విన్ని అనే ఓ మహిళను తీసుకొచ్చుకుంటుంది. తనను వారణాసే తెలియక మోనిత ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. ఓహో.. ఇక్కడికి వచ్చావా అనుకుంటాడు వారణాసి. చూశావా వారణాసి. నా దగ్గర పనిచేయడానికి ఎవ్వరూ రారన్నావు కదా. ఇప్పుడు చూడు విన్ని వచ్చింది. తనది కేరళ అంటుంది మోనిత. మేడమ్ మీరంటే ఈ ఆటో డ్రైవర్ కు ఎందుకంత కోపం అంటుంది విన్ని. నీకు నేనంటే ఎందుకు అంత కోపం వారణాసి. కార్తీక్ కు నేను కూడా భార్యనే కదా అంటుంది. అది మీరు అనుకుంటే కాదు. మేము ఎప్పటికీ ఒప్పుకోము.. అని చెప్పి వారణాసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
karthika deepam 8 january 2022 full episode
మరోవైపు తను చేసిన పిండి వంటలు ఎవ్వరూ కొనరు. దీంతో దీప నిరాశతో వెనుదిరుగుతుంది. ఇంతలో రుద్రాణి కనిపిస్తుంది. ఏం దీప అంతా కులాశానా. బేరాలు బాగా సాగుతున్నాయా అని అడుగుతుంది. వెనకాల రంగరాజును కట్టుకొని రెండు చేతుల్లో సంచులు పట్టుకున్నావంటే రెండు చేతులా సంపాదిస్తున్నావన్నమాట. సరుకులు అలాగే ఉన్నట్టున్నాయే బోణి కూడా అయినట్టుగా లేదు.. అంటూ మాట్లాడుతుంది రుద్రాణి. ఏంటి దీప ఇప్పటికైనా అర్థం అయిందా.. ఈ రుద్రాణి అంటే ఏంటో ఏం చేయగలదో అంటుంది రుద్రాణి. పిండి వంటలు ఎలా ఉన్నాయిరా మనవి అని అడుగుతుంది తన పనోళ్లను. అవును అక్క మళ్లీ మళ్లీ ఆర్డర్ చేస్తున్నారు అంటారు. విన్నావు కదా.. నువ్వు ఏ దారిలో వచ్చినా నేను అడ్డువస్తా అంటుంది రుద్రాణి. మీరు ఏ దారిలో అడ్డు వచ్చినా నేను ఏం చేస్తానో తెలుసు కదా. తెలిసేలా చేశాను కదా రుద్రాణి గారు అంటుంది దీప.
గుర్తు పెట్టుకున్నాను దీప. అన్నీ గుర్తు పెట్టుకున్నాను. కానీ.. మీ సారు.. నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టాడన్న విషయం నువ్వు గుర్తు పెట్టుకో.. అంటుంది రుద్రాణి. నీ బాకీ నేను తీరుస్తా అంటుంది దీప. ఎలా తీరుస్తావు అంటుంది రుద్రాణి. లక్షల బాకీ ఇలా తిరుగుతూ ఎలా సంపాదిస్తావు అంటుంది రుద్రాణి.
గాలి వీస్తే చిన్న చిన్న దీపాలే ఆరిపోతాయి. అదే పెద్ద మంట అయితే ఆ గాలికి ఇంకా ఎక్కువగా మండుతుంది. నేను మంటలాంటిదాన్ని. ఈ దీప బలంగా మారుతుంది. ఎదురు నిలుస్తుంది అంటుంది దీప. ఈ దీప ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది.
ఏది ఏమైనా మీరు అప్పు తీర్చలేరు అనేది నాకు అర్థం అయింది. అందుకే నీకు నేను మాంచి సంక్రాంతి ఆఫర్ ఇస్తాను అంటుంది రుద్రాణి. మీ పిల్లల్లో ఒకరిని నాకు ఇచ్చేయ్ అంటుంది రుద్రాణి. దీంతో తనపై మరోసారి చేయి చేసుకోబోతుంది. నీకు ఉన్నది రెండే ఆప్షన్లు.. నీ పిల్లల్లో ఒకరిని ఇవ్వడం, రంగ రాజును ఇవ్వడం, లేదా అప్పు తీర్చడం అంటుంది.
అప్పు తీర్చుతాను అంటుంది దీప. ఏం చేసి తీర్చుతావు అని అడుగుతుంది. దీంతో ఏదో ఒకటి చేసి గడువులోగా తీరుస్తాం అంటుంది దీప. ఎలా తీరుస్తావు. ఆ దేవుడు వచ్చి తీరుస్తాడా అని అడుగుతుంది. ఈ దీప ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది రుద్రాణి.
మరోవైపు కార్తీక్ వేగంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. తినడానికి ఏమైనా ఉన్నాయో చూస్తాడు. చూస్తే బియ్యం కొన్నే ఉంటాయి. పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. దీప ఎక్కడైనా డబ్బులు పెట్టిందేమో అని అనుకుంటాడు కార్తీక్.
దీప ఎక్కడైనా డబ్బులు పెట్టిందేమో అని చూస్తాడడు కానీ.. ఇంట్లో బియ్యం ఉండవు.. డబ్బులు ఉండవు. పిల్లలు ఆకలితో ఉన్నారు ఏం చేయాలి అని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో బాగా ఎండ కొడుతుంది. దీపకు నడవడం చేతకాదు. ఒక సోడా తాగుతుంది.
మరోవైపు కార్తీక్ ఓ హోటల్ కు వస్తాడు. భోజనం అడుగుతాడు. ప్లేట్ మీల్స్ ఎంత అంటే 60. ఫుల్ మీల్స్ అయితే 100 అంటాడు. పార్శిల్ అయితే 120 అని చెబుతాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు.
మరోవైపు పనోళ్లు లేక హోటల్ యజమాని చిరాకు పడుతుంటాడు. సాయంత్రం లోగా డబ్బులు తెచ్చిస్తాను.. ఒక ఫుల్ మీల్స్ పార్శిల్ ఇవ్వండి అంటాడు. కానీ.. హోటల్ యజమాని ఇవ్వడు. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు. దీంతో హోటల్ లో పని చేయడానికి ఒప్పుకొని పిల్లలకు పార్శిల్ తీసుకెళ్తాడు కార్తీక్. వాళ్లకు తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.