Karthika Deepam 8 Nov Today Episode : శౌర్యను తీసుకొని సంగారెడ్డికి పారిపోయిన ఇంద్రుడు, చంద్రమ్మ.. ఈ విషయం తెలిసి వెక్కివెక్కి ఏడ్చిన దీప, కార్తీక్.. ఇంతలో అసలు ట్విస్ట్?

Advertisement
Advertisement

Karthika Deepam 8 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 నవంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1504 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ నిజంగానే దీపతో వెళ్లిపోయాడా అని అనుకుంటుండగానే అప్పుడే కార్తీక్ వస్తాడు. దీంతో మోనిత సంతోషిస్తుంది. వచ్చావా.. ఏంటి కార్తీక్ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. దీంతో దుర్గ గారు ఇంట్లో లేరా? ఇంకా ఎంతగా ప్రేమగా నటించినా అది నిజం కాదు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో నా ప్రేమ నటనా.. అంటూ బాధపడుతుంది. నువ్వు నాతో ఏదో దాస్తున్నావు అదేంటో తెలుసుకుంటా. అడ్డొస్తే ఆ వంటలక్కను నేనే స్వయంగా అడ్డు తొలగిస్తా అని అనుకుంటుంది మోనిత. మరోవైపు ఉదయం కాగానే ఇంద్రుడు ఇంటికి వెళ్తారు కార్తీక్, దీపం. చూస్తే ఇళ్లు ఖాళీగా కనిపిస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారా డాక్టర్ బాబు అని అంటుంది దీప. ఏవండి.. ఈ ఇల్లు అంటే.. అద్దెకు కావాలా రాత్రే ఖాళీ చేశారు. తలుపులు తెరిచే ఉన్నాయి.. అంటాడు.

Advertisement

karthika deepam 8 november 2022 full episode

రాత్రి ఉన్నారు కదా.. పొద్దున్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం ఏంటి. అయితే నా అనుమానం నిజమే. శౌర్య వాళ్లతోనే ఉంది. నేను రాత్రి వచ్చి శౌర్యను చూపించమనే సరికి.. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు అని అంటుంది దీప. ఇంట్లోకి వెళ్లి చూస్తారు. అందులో ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో శౌర్య ఫంక్షన్ రోజు దిగిన ఫోటో ఉంటుంది. అందులో శౌర్య ఉండటంతో షాక్ అవుతారు. నా శౌర్య డాక్టర్ బాబు. ఇక్కడే ఉందని చెప్పానా. చూడండి అంటుంది దీప. నా శౌర్య అంటూ ఏడుస్తుంది దీప. నా అత్తమ్మ అంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప. ఆ రోజు శౌర్యకు బదులు మనకు వేరే అమ్మాయిని చూపించారు. మనం ఇవన్నీ కొనిచ్చేసరికి వాళ్లకు నువ్వే శౌర్య తల్లివని తెలిసి ఉంటుంది. అందుకే అప్పుడు అమ్మాయిని మార్చి చూపించారు అంటాడు కార్తీక్.

Advertisement

నువ్వు మళ్లీ రావడం, గట్టిగా అడగడంతో శౌర్యను తీసుకొని వెళ్లిపోయారు అంటాడు కార్తీక్. వాళ్లకు నేను ఏం అన్యాయం చేశాను డాక్టర్ బాబు. ఎందుకు నా బిడ్డను నాకు దక్కకుండా చేశారు. ఏ తల్లి అయినా తన బిడ్డ మొదటి పండుగ తన చేతుల మీదుగా చేసి మురిసిపోతుంది. కానీ.. నేను నా బిడ్డ తల మీద అక్షంతలు కూడా వేయలేకపోయాను. ఆరోజు ఎంత ఆరాటంతో వచ్చాను. అయినా నా మీద మనసు కరగలేదు అంటుంది దీప.

అప్పటికీ బాత్ రూమ్ లో ఎవరో స్నానం చేస్తున్న శబ్దం వస్తుంది. బయటికి వచ్చేదాకా చూడాల్సింది. అప్పుడే చూసి ఉంటే శౌర్య కనిపించేది. నాకు నా బిడ్డ దొరికి ఉండేది. తప్పు చేశాను డాక్టర్ బాబు అంటుంది దీప. దీంతో నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అంటాడు కార్తీక్.

Karthika Deepam 8 Nov Today Episode : శౌర్యను ఎక్కడికి తీసుకెళ్లారని టెన్షన్ పడ్డ కార్తీక్

మనం తెలుసుకునే లోపు వాళ్లు జాగ్రత్త పడ్డారు అంటాడు కార్తీక్. శౌర్యను ఎక్కడికి తీసుకెళ్లారు. ఈ ఊళ్లోనే ఉన్నారా? లేక శౌర్యను ఎక్కడికైనా తీసుకెళ్లారా? నా శౌర్య నాకు కావాలి డాక్టర్ బాబు అని అంటుంది దీప. శౌర్యను వాళ్లు ఎక్కడికి తీసుకెళ్లినా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. తెలుసుకుందాం. శౌర్యను తీసుకొచ్చి నీకు అప్పగించే పూచీ నాది. ఏడవకు అంటాడు డాక్టర్ బాబు.

మరోవైపు ఆటోలో వెళ్తుంటారు ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది శౌర్య. దీంతో మనం సంగారెడ్డి పక్కనే ఉన్న ఓ ఊరికి వెళ్తున్నాం అంటాడు ఇంద్రుడు. దీంతో అమ్మను వెతకడానికి సంగారెడ్డి వెళ్దామనుకున్నాం కదా అంటుంది శౌర్య.

దీంతో ఏం కాదమ్మా.. మనం రోజూ ఆటో తోలడానికి సంగారెడ్డికే వెళ్తాం. అక్కడ రోజూ వెతుకుదాం అని శౌర్యకు అబద్ధం చెబుతాడు ఇంద్రుడు. మరోవైపు గుడికి వెళ్లి గంట కొడుతూనే ఉంటుంది దీప. అందరూ తనను విచిత్రంగా చూస్తారు. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ఆపు అన్నా కూడా ఆపదు.

తర్వాత తనను తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు కార్తీక్. శౌర్య వీళ్లతో ఉంటే.. మరి హిమ ఎక్కడుంది. హిమ కూడా ఇంద్రుడితోనే ఉందా. అసలు శౌర్య ఇక్కడ ఎందుకు ఉండిపోయింది. అమ్మానాన్నలను శౌర్య ఎందుకు కలవలేదు అని టెన్షన్ పడతాడు కార్తీక్.

ముందు మోనితను వదిలించుకోవాలి. అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు ఇంద్రుడు, చంద్రమ్మతో కలిసి గుడికి వెళ్తుంది శౌర్య. అమ్మానాన్నల పేర్లు చెప్పు అంటే ఇంద్రుడు, చంద్రమ్మ అని చెబుతాడు ఇంద్రుడు. దీంతో శౌర్యకు కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Gold Rate Today on Jan 28th 2026: బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట..ఈరోజు బంగారం ధరలు ఇలా !!

Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…

3 minutes ago

Brahmamudi Today Episode: మంత్రికి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్

Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…

31 minutes ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం: ఇది నవవసంతం – జ్యోత్స్న ప్లాన్‌ను పసిగట్టిన దీప, కార్తీక్.. నిజం బయటపడుతుందా?

Karthika Deepam 2 Today Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీకదీపం: ఇది నవవసంతం' సీరియల్ ఇప్పుడు ఎంతో…

1 hour ago

Screen Time Guidelines: అతిగా ఫోన్‌ చూస్తున్నారా?..మీ ఒంట్లో వచ్చే సమస్యలు ఇవే..?

Screen Time Guidelines: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేకుండా జీవితం ఊహించలేనిది. పని అయినా చదువు…

2 hours ago

Heart Attack : పెరుగుతున్న గుండెపోటు.. 48 గంటల ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..!

Heart attack : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సు, లింగం అనే తేడా లేకుండా…

3 hours ago

Zodiac Signs : 28 జనవరి 2026 బుధవారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు పసుపు కొమ్ములను నీటిలో వదలండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…

4 hours ago

India EU Free Trade Agreement 2026 : భారత్-ఈయూ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం: భారీగా తగ్గనున్న కార్లు, మద్యం ధరలు

India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…

13 hours ago

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…

14 hours ago