Home » Entertainment » Karthika Deepam 8 September 2021 Wednesday 1139 Episode Highlights
Entertainment

Karthika Deepam 8 Sep Today Episode : మోనిత పెళ్లి గోల.. ఆందోళనలో డాక్టర్ బాబు.. వంటలక్క చేజింగ్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 8, 2021 1:20 pm
Advertisement

Karthika Deepam 8 Sep Today Episode : బుల్లితెరపై కార్తీకదీపం దూసుకుపోతోన్న తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. ఇక ఇప్పుడు కథ మంచి రసవత్తరంగా సాగింది. డాక్టర్ బాబుకు మోనిత ముచ్చెమటలు పట్టిస్తోంది. మోనిత బెదిరింపులకు డాక్టర్ బాబు ఆందోళన చెందుతున్నాడు. మరో వైపు మోనిత ఆట కట్టించేందుకు వంటలక్క ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 తేదీ రాత్రి ప్రసారం కానున్న సీరియల్‌లో ఏం జరిగిందంటే..

Advertisement

karthika deepam 8 september 2021 wednesday 1139 episode highlights 

Advertisement

దీప, డాక్టర్ బాబు హాస్పిటల్‌లో మాట్లాడుకుంటారు. డాక్టర్ బాబు కోసం టిఫిన్ బాక్స్‌ను దీప తీసుకొస్తుంది. ఆ సమయంలో ఆ ఇద్దరూ మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కరెక్ట్‌గా అదే సమయంలో డాక్టర్ రీనా రూపంలో ఉన్న మోనిత కూడా వచ్చేస్తుంది. వారు మాట్లాడుకుంటున్న మాటలను మోనిత వింటుంది. డాక్టర్ రూపంలో ఉంది తానే అని దీపకు కార్తీక్ చెబుతాడేమోనని మోనిత భయపడుతుంది.

 

Advertisement

karthika deepam 7 september 2021 tuesday 1138 episode highlights

కార్తీక్‌కు డాక్టర్ రీనా నుంచి ఫోన్ వస్తుంది  Karthika Deepam 8 Sep Today Episode

అయితే అంతలోపే కార్తీక్‌కు డాక్టర్ రీనా నుంచి ఫోన్ వస్తుంది. దీపను ప్లేట్స్ కడిగేందుకు బయటకు పంపిస్తాడు కార్తీక్. ఇక అలా కార్తీక్‌తో మోనిత ముచ్చటపెడుతున్న సమయంలోనే దీప చూస్తేస్తుంది. మోనితను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పారిపోతోంది. ఇక మోనిత వెంట పడేందుకు దీప కూడా వారణాశి ఆటలో ఎక్కుతుంది.

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

మోనిత క్యాబ్లో, దీప ఆటలో చేజింగ్ సీన్ జరిగింది.ఇక ఎంతకీ దీప రాకపోవడంతో డాక్టర్ బాబు ఆందోళన చెందుతాడు. మోనితను చేజ్ చేసుకుంటూ వెళ్లి ఉంటుందా? ఒకవేళ దీపను మోనిత చంపేస్తే ఎలా అని ఆందోళన చెందుతాడు. ‘మా దీప.. మా దీప కనిపించడం లేదు.. భోజనం పెట్టి ప్లేట్స్ కడగటానికి బయటికి వచ్చింది.. తిరిగి రాలేదు. డాక్టర్ రీనాని నువ్వు చూశావా?’ అంటాడు. రత్నసీత షాక్ అవుతుంది.

Advertisement

 

Karthika deepam 6 september 2021 monday full episode 1137 highlights

అవునా అంటుంది. ఇక తదుపరి భాగంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కచ్చితంగా కలుగుతుంది. మరి వంటలక్క ఆ మోనితను పట్టుకుంటుందా? డాక్టర్ బాబును శిక్ష నుంచి తప్పిస్తుందా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి