
karthika deepam 9 april 2022 full episode
Karthika Deepam 9 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 1322 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా జీవితాన్ని క్షణాల్లో తారుమారు చేసిన నా శత్రువును ఎప్పటికీ వదలను గాక వదలను అంటుంది జ్వాల. ఆ మాటలు విన్న హిమ బాధపడుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన పాత మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి హిమ వెళ్లబోతుండగా ఏయ్ తింగరి అని పిలుస్తుంది జ్వాల. చెప్పాచేయకుండా వెళ్తున్నావు ఏంటి అని అడుగుతుంది జ్వాల. దీంతో తనను అలాగే తదేకంగా చూస్తుంది హిమ.
karthika deepam 9 april 2022 full episode
ఇంకా నీ కోపం తగ్గలేదా శౌర్య. నేను చేసిన తప్పుకు ఇంకేం శిక్ష అనుభవించాలి నేను.. అని మనసులో అనుకుంటుంది. ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. అమ్మ నాన్న.. నేను శౌర్యను చూశాను. మన శౌర్యను చూశాను అంటుంది హిమ. శౌర్య కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నానో కదా. ఈరోజు శౌర్య కనిపించింది. ఆ జ్వాలనే మన శౌర్య డాడీ. శౌర్య కనిపించగానే పొంగిపోయాను. ఈ జన్మకు ఇది చాలు దేవుడా అనుకున్నాను. కానీ.. శౌర్య దగ్గరికెళ్లి గట్టిగా హత్తుకొని నేనే హిమను అని చెప్పాలనిపించింది. కానీ.. చెప్పలేని పరిస్థితి అంటుంది హిమ.
మీ చావుకు నేనే కారణం అయిపోయాను. ఆ కోపంతోనే శౌర్య నాకోసం ఎదురు చూస్తోంది డాడీ. శౌర్య మనసులో ఉన్న కోపాన్ని పోగొట్టేలా చేసుకోవడమే నా ముందున్న లక్ష్యం. ఎలాగైనా శౌర్య నన్ను క్షమించేలా చేస్తాను.. అని అనుకుంటుంది హిమ.
మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అసలే.. తను ఒక హార్ట్ పేషెంట్. తనను నేను కాపాడుకుంటాను అమ్మ. నాకు ధైర్యం ఇవ్వండి డాడీ. పై నుంచి నన్ను దీవించండి.. అని అనుకుంటుంది. శౌర్య మనసులో నుంచి ద్వేషం పోగొట్టి దాన్ని ప్రేమలా మార్చుకోవాలి. మేము ఇద్దరం మళ్లీ కలిసి ఉండాలి.. అని అనుకుంటుంది.
మరోవైపు సౌందర్య.. స్వప్న ఇంటికి వస్తుంది. నువ్వేంటే పంతంలో నీకంటే నేనేమీ తక్కువ కాదు అంటుంది సౌందర్య. డాడీ నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు కానీ.. సందర్శకులకు మాత్రం ప్రవేశం లేదు అంటుంది స్వప్న. అది బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే బోర్డు తగిలించమంటే తగిలిస్తాను అంటుంది స్వప్న.
అప్పుడే నిరుపమ్ వస్తాడు. అమ్మమ్మ ఎప్పుడు వచ్చావు అంటాడు. ఇప్పుడే వచ్చింది వెళ్లిపోతుంది కూడా ఇప్పుడే అంటాడు ఆనంద రావు. లోపలికి పదా అమ్మమ్మ అంటాడు నిరుపమ్. దీంతో ఈ ఇంట్లోకి ఎవరు రావాలో.. ఎవరు రాకూడదో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చేయ్ అంటాడు నిరుపమ్.
నాకు నువ్వు పాఠాలు చెప్పాల్సిన పని లేదు అని నిరుపమ్ తో అంటుంది స్వప్న. రేపు నీకూ కోడళ్లు వస్తారు.. అని స్వప్నతో అంటాడు ఆనంద రావు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కొత్త చుట్టరికాలు లేని ప్రేమలు చూపించాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న.
మరోవైపు జ్వాల.. ఇంటికి వచ్చి ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇంద్రుడు మందు తాగడం చూసి చంద్రమ్మ తిడుతుంది. ఎందుకు మందు తాగుతున్నావు బాబాయి అని అడుగుతుంది జ్వాల. దీంతో చేసిన పాపాలు మరిచిపోవడం కోసం అమ్మ అంటాడు ఇంద్రుడు.
దీంతో చనిపోవడానికి ముందు రోజు కూడా మా అమ్మానాన్నలు ఇలాగే మందు తాగి ఎంజాయ్ చేశారు అని గుర్తు చేసుకుంటుంది జ్వాల. ఇంతలో తింగరి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది జ్వాల. దీంతో నిన్ను చూడాలనిపించింది అంటుంది హిమ.
ఏంటి తింగరి చీకట్లో వచ్చావు. భయం వేయలేదా అంటే.. నువ్వే నా ధైర్యం అంటుంది. ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మను చూస్తుంది హిమ. చూసి.. తనను చిన్నప్పుడు రక్షించింది వీళ్లే అని గుర్తుకు తెచ్చుకుంటుంది. దేవుడా.. పిన్ని బాబాయి దగ్గరే శౌర్య ఉంటుందా అని అనుకుంటుంది హిమ.
ఎవరమ్మా అని అడుగుతుంది చంద్రమ్మ. దీంతో డాక్టరమ్మ అని చెబుతుంది. ఊరికే… తింగరి తింగరి అని అంటుంటే.. నీ పేరు ఏంటమ్మా అని అడుగుతుంది చంద్రమ్మ. దీంతో హిమకు ఏం చెప్పాలో అర్థం కాదు. నా పేరు అంటూ చెప్పబోతుండగా.. నీ పేరు చెప్పకు అంటుంది జ్వాల.
నీ పేరు తింగరి అంతే.. నీ పేరు చెప్పకు అంటుంది జ్వాల. తర్వాత వాళ్లింట్లో భోజనం చేస్తుంది హిమ. తనకు శౌర్యే తినిపిస్తుంది. దీంతో తన కంట్లో నుంచి కన్నీళ్లు ఆగవు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.