
karthika deepam 9 march 2022 full episode
Karthika Deepam 9 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 1295 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకా నువ్వు కార్తీక్ గురించి ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నాకు ఒకటి అనిపిస్తోంది. బాధ పడటానికి అలవాటు పడిపోయి.. బాధపడటానికి ఏమీ లేదే అని ఆలోచించి మరీ నువ్వు బాధపడుతున్నావనిపిస్తోంది సౌందర్య అంటాడు ఆనంద రావు. మీరు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నా నా మనసుకు అది ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది అంటుంది సౌందర్య. మీరు ఎన్నయినా చెప్పండి. నా మనసు భయం గుప్పిట్లో నుంచి బయటికి రాలేకపోతోంది అంటుంది సౌందర్య. భయం పిరికిది.. అందుకే అది మనసు చాటు నుంచి భయపెడుతూనే ఉంటుంది. ధైర్యం రాగానే పారిపోతుంది. అందుకే.. భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండు అంటాడు ఆనంద రావు.
karthika deepam 9 march 2022 full episode
కట్ చేస్తే.. కార్తీక్, దీప.. ఇద్దరూ కలిసి మందు కొడతారు. తనకు అప్పటికే ఎక్కేస్తుంది. ఇప్పటికే ఒక పెగ్ వేశాను.. ఇక నాకు చాలు డాక్టర్ బాబు అంటుంది దీప. దీంతో పర్లేదు మరో పెగ్గు తాగు వంటలక్క అంటాడు కార్తీక్. దీంతో పెగ్గును దించకుండా తాగేస్తుంది. రెండు పెగ్గులు వేయగానే.. తనకు ఫుల్లుగా ఎక్కేస్తుంది. చికెన్ ఎవరు తినిపిస్తారు అంటుంది వంటలక్క. దీంతో చికెన్ అంటుంది. దీంతో సరే అని చికెన్ తినిపిస్తాడు కార్తీక్. కొంచెం కొంచెం తాగాలి మేడమ్ అంటాడు కార్తీక్. దీంతో మేడమా.. మేడమ్ ఎవరు అంటాడు కార్తీక్. నువ్వు డాక్టర్ బాబు.. నేను వంటలక్క. మధ్యలో మేడమ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది దీప. ఎవరా మేడమ్.. యూ టెల్.. ఐ హియర్. హూ మేడమ్ అంటుంది దీప.
మేడమ్ అంటే ఇంకెవరో కాదు మేడమ్.. మీరే అంటాడు కార్తీక్. దీంతో ఐ మేడమ్.. అంటూ నవ్వుతుంది దీప. ఏంటి డాక్టర్ బాబు. నన్ను మేడమ్ అని పిలుస్తున్నారా. ఏంటి సామి ఇది అంటుంది దీప. అప్పుడప్పుడు మందు కొడితే ధైర్యం పెరుగుతుంది. రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది తెలుసా అంటాడు కార్తీక్.
ఎలా ఉంది మేడమ్ అంటాడు కార్తీక్. దీంతో ఎలాగో ఉంది డాక్టర్ బాబు అంటుంది దీప. మీరు ఎలాగైనా గొప్పవాళ్లు డాక్టర్ బాబు. రెస్పెక్ట్ మేడమ్ అంటున్నారు. ఇంతకంటే గొప్పేం కావాలి చెప్పండి అంటుంది దీప. మీరు కూడా గొప్పోళ్లే మేడమ్ అంటాడు కార్తీక్.
వై గొప్ప.. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఓపిక పట్టారు. నేను కష్టాల్లో ఉంటే క్షమించారు. మీరు గ్రేట్ మేడమ్.. మీరు గ్రేట్ అంటాడు కార్తీక్. హలో డాక్టర్ బాబు. ఆ టాపిక్ ఎత్తకండి.. పాత విషయాలు అన్నింటికీ గోలీమార్ అంటుంది దీప. వద్దు వద్దు అంటున్నా మందు తాగించారు. ఇంకో పెగ్ పోయ్ అంటుంది దీప.
దీంతో ఇక చాలు మేడమ్ అంటాడు కార్తీక్. ఏం కాదు అంటుంది దీప. పెద్ద పెద్ద కష్టాలే చూసింది దీప. ఈ రెండు పెగ్గులు ఎంత చెప్పండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకుంటాను అంటుంది దీప. కార్తీక్ ను ఎత్తుకోబోతూ కింద పడుతుంది. ఇవన్నీ ఎందుకు దీప అంటాడు కార్తీక్.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు దీప అంటాడు కార్తీక్. మీకు మందు ఎక్కువైంది మేడమ్ అంటే.. ఊరికే నన్ను మందు ఎక్కువైంది అనకురా అంటుంది దీప. దీంతో రానా అంటాడు కార్తీక్. నువ్వు నా మొగుడివే కదా.. రా అంటే తప్పేంటి అంటుంది దీప.
బయట ఏదో సౌండ్ వినిపిస్తోంది.. నీకు వినిపించిందా.. నాకు ఒక్కదానికే వినిపిస్తోందా.. అని అడుగుతుంది దీప. దీంతో నాకు కూడా వినిపిస్తోంది అంటాడు కార్తీక్. అయితే.. మనిద్దరికీ ఎక్కినట్టుంది అంటుంది దీప. పదా.. బయటికెళ్దాం అంటుంది దీప.
దీంతో.. బయట ఎవరో యూత్ డ్యాన్స్ వేస్తున్నట్టున్నారు అంటాడు కార్తీక్. పదా.. అయితే వెళ్లి డ్యాన్స్ చేద్దాం అంటుంది దీప. చీరలో కొంచెం డ్యాన్స్ కష్టమేమో అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది దీప. మరోవైపు కార్తీక్ ఫ్యామిలీ చిక్ మగళూరు వెళ్లినట్టుగా తెలుసుకుంటుంది మోనిత.
నన్ను ఇక్కడ వదిలేసి.. నువ్వు అక్కడ దీపతో ఉండటం కరెక్ట్ కాదు కదా. నువ్వు వెళ్లావని తెలిశాక కూడా నేను కామ్ గా ఉండటం అస్సలు కరెక్ట్ కాదు కదా. గాలిలో దూళిలా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి కదా. మనిషిని నువ్వు మార్చినా నేను మార్చలేను.. అని అనుకుంటుంది మోనిత.
కార్తీక్, దీప.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసే డ్రెస్ వేసుకొని.. బయటికి వెళ్తారు. కానీ.. దీప మాత్రం తూలుతూ ఉంటుంది. ఇంతలో పిల్లలు ఇద్దరూ వస్తారు. అమ్మ నువ్వు ప్యాంట్ వేసుకున్నావా అని షాక్ అవుతారు. డాడీ.. అంటూ ఏదో చెప్పబోతుంది.
కానీ.. ఏంటమ్మా.. మీరు టాటూ వేయించుకున్నారా అని అడుగుతాడు కార్తీక్. దీంతో అవును అని చెబుతారు పిల్లలు. కానీ.. దీప మాత్రం ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మకు ఏమైంది.. ఏదోలా మాట్లాడుతోంది అంటారు పిల్లలు. డ్యాన్స్ చేద్దామంటే ఇదంతా ఏంటి అని అడుడుతుంది దీప.
అక్కడికి వెళ్లి మావా ఏక్ పెగ్ లా.. అనే పాట పెట్టి ఫుల్లుగా డ్యాన్స్ చేస్తుంది దీప. తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో తనను తీసుకెళ్లి పడుకోబెడతాడు కార్తీక్. ఉదయం లేచి.. ఎంత రచ్చ చేశావు దీప.. నీకు అసలు అవన్నీ గుర్తున్నాయా అని అనుకుంటాడు కార్తీక్.
జన్మ ధన్యం అయినట్టుగా ఉంది.. అని అనుకుంటాడు కార్తీక్. తను పడుకోవడం చూసి తన దగ్గరికి వెళ్లి తన ముఖం మీద గాలి ఊదుతాడు. దీంతో తను లేచి తనవైపునకు తిప్పుకుంటుంది. రాత్రి ఏం జరిగింది డాక్టర్ బాబు అంటుంది దీప. దీంతో మందుకొట్టాం.. చాలా ఎంజాయ్ చేశాం అంటాడు కార్తీక్.
ఆతర్వాత అందరూ కలిసి ఓ ప్లేస్ కు వెళ్తారు. అక్కడే హిమ కారు నడుపుతుంది. లోపల దీప కూడా ఉంటుంది. వెంటనే కారును వెంబడించి.. కారును పట్టుకొని డోర్ తీసి లోపలికి వెళ్తాడు. కార్తీక్. అంతలోనే కారు అదుపు తప్పి లోయలో పడి కార్తీక్, దీప, హిమ.. ముగ్గురూ చనిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
This website uses cookies.