Karthika Deepam 9 Nov Today Episode : మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దీపే తన భార్య అని మోనితను వదిలేస్తాడా? దీపతో కలిసి వెళ్లిపోతాడా?

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 9 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1505 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజారికి ఎందుకు మా అమ్మానాన్నల పేర్లు చెప్పలేదు అని శౌర్య.. ఇంద్రుడు, చంద్రమ్మను అడుగుతుంది. దీంతో ఇప్పుడు పూజారికి మీ అమ్మానాన్నల గురించి చెబితే వాళ్లు ఎవరు అని అడుగుతాడు. అంతేకాదు.. కథ మొత్తం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ నానమ్మ, తాతయ్య కూడా నీ గురించి వెతుకుతున్నారు కదా. మళ్లీ వాళ్లకు మన గురించి తెలిస్తే నిన్ను తీసుకెళ్తారు. అందుకే చెప్పలేదు అంటాడు. ఆ తర్వాత మరి మనం సంగారెడ్డికి ఎప్పుడు వెళ్తున్నాం అని అడుగుతుంది శౌర్య. దీంతో ఎందుకు అని అంటాడు ఇంద్రుడు. అదేంటి.. మనం అమ్మను వెతకడానికి వెళ్దాం అని అనుకున్నాం కదా అంటుంది శౌర్య. దీంతో అవును.. వెళ్దాం. ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. అన్నీ సర్దుకోవాలి కదా. ఊరు అలవాటు అవ్వాలి కదా.. అని శౌర్యకు ఎలాగోలా సర్దిచెబుతాడు ఇంద్రుడు.

Advertisement

karthika deepam 9 november 2022 full episode

మరోవైపు దీపతో ఇవాళ ఎలాగైనా తేల్చుకోవాలని అనుకుంటుంది మోనిత. తన ఇంటికి వెళ్తుంది కానీ.. అక్కడ దీప ఉండదు. ఇంటి తలుపులు మాత్రం తీసే ఉంటాయి. ఇంతలో దుర్గ వస్తాడు. ఏంటి బంగారం.. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో దీప కోసం వచ్చా అంటుంది. దీప ఇంట్లో లేదా అంటాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కావచ్చు అంటాడు దుర్గ. వాళ్లిద్దరూ కలిసి పోయారు. కావాలంటే చూడు వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసే వస్తారు. నువ్వు ఇక నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది అంటాడు. దీంతో నోర్మూయ్.. వాళ్లు ఎప్పటికీ కలవరు. ఇప్పుడు కూడా వాళ్లు కలిసి రారు. దీప ఒక్కతే వస్తుంది చూస్తూ ఉండు అంటుంది మోనిత. ఇంతలో కారులో కార్తీక్, దీప ఇద్దరూ వస్తారు. ఇంటికి వచ్చి తలుపులు తీసి ఉన్నాయి ఏంటి.. ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఉంటారా అంటాడు కార్తీక్. దీంతో దుర్గ వచ్చి ఉంటాడులే డాక్టర్ బాబు అంటుంది దీప.

Advertisement

ఇంతలో కార్తీక్, దీప ఇద్దరూ కలిసి రావడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఏమైంది దుర్గ గారు అంటుంది. ఏం లేదు కార్తీక్ సార్. దీప ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రా అని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. నేనేమో.. వద్దు దీపమ్మ వస్తుంది అని అన్నా. ఇంతలోనే మీరు వచ్చారు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు దుర్గ.

మీకు ఆ ఇల్లు సరిపోలేదా మోనిత. అక్కడ స్టాఫ్ ఉంటారు కదా. అందుకని ఇక్కడికి వచ్చారా అంటాడు కార్తీక్. దీంతో ఆపు కార్తీక్. నేను వచ్చింది మీ సంగతి తేల్చడానికి అంటుంది మోనిత. దీంతో ముందు నీ సంగతి చెప్పు. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.

డాక్టర్ బాబు.. ఇప్పుడు నాకు ఏ విషయం గురించి వాదించడానికి ఓపిక లేదు. మోనితను తీసుకొని వెళ్లండి అంటుంది దీప. బొటిక్ బిజినెస్ చూసుకునేవాడివి ఇదివరకు. ఇప్పుడు ఆ బిజినెస్ వదిలేసి ఈ బిజినెస్ చూసుకుంటున్నావా. అసలు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతుంది మోనిత.

Karthika Deepam 9 Nov Today Episode : ఎవరు ఎవరిని పట్టుకున్నారు అని మోనితతో కార్తీక్ సీరియస్

ఇది నిన్ను పట్టుకొని వేలాడుతోంది.. అని ఆవేశపడి మాట్లాడుతుంది మోనిత. దీంతో నోర్మూయ్.. ఎవరు ఎవరిని పట్టుకున్నారు. ఎవరు ఎవరిని పట్టుకొని ఇక్కడ వేలాడటం లేదు. పాపం వంటలక్క తన పిల్లల కోసం వెతుకుతూ బాధపడుతుంటే తనకు సాయం చేశాను అంతే అని చెప్పి అక్కడి నుంచి మోనితను తీసుకొని వెళ్తాడు కార్తీక్.

కార్తీక్ మాటలు చూస్తుంటే ఆ దుర్గ గాడు చెప్పిందే నిజం అనిపిస్తోంది. అసలు కార్తీక్ కు గతం గుర్తొచ్చిందా? లేదా? అని అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత మోనితను తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఆ తర్వాత తన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శౌర్య.

మరోవైపు ఆనంద రావు, హిమ ఇద్దరూ కలిసి హోటల్ కు వెళ్తారు. అక్కడ లక్ష్మణ్ కనిపిస్తాడు. ఆనంద్ తమ్ముడు వచ్చాడా అని అడుగుతుంది హిమ. దీంతో లేదమ్మా.. మోనిత దగ్గరే ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లు లక్ష్మణ్ అంటాడు ఆనంద రావు. ఏంటి తాతయ్య.. ఆనంద్ ను ఇంటికి తీసుకొద్దామని అనుకుంటే నువ్వు వద్దంటున్నావు ఏంటి అంటుంది హిమ.

ఏంటి తాతయ్య నువ్వు.. అటు ఆనంద్ ను తీసుకురానివ్వు.. ఇటు శౌర్య రాదు అంటుంది. సరే.. మనమే మోనిత దగ్గరికి వెళ్లి ఆనంద్ ను తీసుకొద్దాం అంటాడు ఆనంద రావు. మరోవైపు కార్తీక్ రూమ్ కు వెళ్లి కార్తీక్ బట్టలను చెక్ చేస్తుంది. తన పర్స్ చూస్తుంది మోనిత.

అందులో చాలా డబ్బు ఉంటుంది. ఇంత డబ్బు కార్తీక్ కు ఎక్కడిది అని అనుకుంటుంది.. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఏం చేస్తున్నావు మోనిత అని అడుగుతాడు. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం డబ్బులు కావాలి. నీ దగ్గర చేంజ్ ఉన్నాయేమో అని చూశా అంటుంది.

అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది మోనిత. దీంతో మోనితకు డౌట్ వచ్చినట్టుంది అని అనుకుంటాడు కార్తీక్. నేను పెద్ద డాక్టర్ ను. సర్జరీలు చేయగా వచ్చిన డబ్బు అది అంటాడు కార్తీక్. దీంతో మోనిత షాక్ అవుతుంది. లేకపోతే ఏంటి.. నా దగ్గర ఉన్న చైన్ ను తాకట్టు పెట్టాను అంటాడు కార్తీక్.

ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. మోనిత ఈ చైన్ ఎలా ఉంది అని అడుగుతాడు దుర్గ. దీంతో నాకెందుకు అంటుంది మోనిత. దీంతో నువ్వు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు అది ఎలా ఉందో కూడా నువ్వు చెప్పాలి కదా అంటాడు దుర్గ. దీంతో నా మెడలో లేకుంటేంది.. నీకు నచ్చిన వారి మెడలో ఉంది కదా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Watermelon : పుచ్చకాయ తింటే ప్రాణం పోతుందా? ముంబై ఘటన వెనుక అసలు నిజాలివే !

వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…

37 minutes ago

Myrobalan : నైట్ 1 స్పూన్ ఈ పొడి తింటే చాలు.. మలబద్ధకం, గ్యాస్ మటాష్..!

Myrobalan  : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…

2 hours ago

Software Engineer : ఎంతపని చేశావ్ మానస! ముఖం చూడకుండానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల టోకరా..

Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…

4 hours ago

Pregnant Summer : ఎండాకాలం గర్భిణీ స్త్రీలు ఏమి తినకూడదో మీకు తెలుసా..?

Pregnant Summer  : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…

6 hours ago

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం కుర్రాళ్ల యుద్ధం! 15 ఏళ్ల వైభవ్ సంచలనం.. టార్గెట్ చేసిన అభిషేక్, ఇషాన్!

ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…

8 hours ago

Puranapanda Srinivas : ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్..!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

9 hours ago

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

2 days ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

3 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

4 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

4 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

4 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

4 days ago