Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు వంటలక్క తప్పుకున్నారా..? ఇక వాళ్లను చూడలేమా..
Karthika Deepam : టాప్‌రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర భారీ షాకే ఇచ్చాడు. ఎప్పుడైతే చిక్ మంగుళూరు ఎపిసోడ్ మొదలైందో సీరియల్ ఓ రేంజ్‌లో రేటింగ్ ఊపందుకుంది.. ఇక ఈ సీరియల్ రేటింగ్ ఓ రేంజ్‌లో ఉంటుదనుకున్న టైంలో ఏకంగా దీపా కార్తీక్‌లనే లేపేశాడు దర్శకుడు. యాక్సిడెంట్‌లో దీప, కార్తీక్ లు చనిపోయినట్లు చూపించి ఇద్దరి ఫొటోలకు దండ వేసేశాడు. దీంతో అభిమానులు తీవ్ర షాక్ లో ఉన్నారు. కార్తీక్ దీపలు చనిపోవడంతో ప్రతిఇంట్లో ప్రేక్షకులు కన్నీరు పెట్టారు. కాగా దర్శకుడు ఈ విషాద ఘటనతో సీరియల్ క్లోజ్ చేస్తాడనుకుంటే ఈ కథను నెక్ట్స్ జనరేషన్ తో నడిపించే ప్లాన్‌లో ఉన్నాడు.
అయితే సీరియల్‌కు మూల స్థంభాలైన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్లను చంపేయగా కార్తీక్, దీపలు చనిపోవడానికి హిమే కారణం కావడంతో.. సౌర్య ఆమెపై పగపట్టింది. ఈ ఇద్దరి మధ్య ఎమోషనల్ డ్రామాతో సీరియల్ కంటిన్యూ అవుతుందని దర్శకుడు చెప్పకనే చెప్తున్నాడు. అయితే అసలు కార్తీకదీపం అంటే.. దీప కార్తీక్.. వీళ్లే ఈ సీరియల్‌కి ఆధారం వీళ్లు లేకుండా కథను ఎలా ముందుకు నడిపిస్తారు? ఖచ్చితంగా వాళ్లు బతికి వస్తారని ఈ సీరియల్ చూసే ప్రతీ ప్రేక్షకుడు భావిస్తారు.
Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు వంటలక్క తప్పుకున్నారా..? ఇక వాళ్లను చూడలేమా..
కార్తీకదీపం సీరియల్‌లో ఇకపై తాను కనిపంచనని.. దీప క్యారెక్టర్‌ని కూడా ముగించారని నిరుపమ్ పరిటాల తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. కాగా ఈ ట్విస్ట్ చూసి చాలామంది తనకి ఫోన్లు చేస్తున్నారని.. డాక్టర్ బాబు చనిపోవడం ఏంటి? ఖచ్చితంగా తిరిగి వస్తాడని అంటున్నారని.. అయితే ఈ సీరియల్‌లో ఇకపై తాము కనిపించబోమని చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఇన్ని రోజులు ప్రేక్షకులు డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్‌లకు బాగా అలవాటు పడ్డారు.సడెన్‌గా వీళ్ల పాత్రలను చంపేయడంతో ఇకపై సీరియల్ రేటింగ్ తగ్గుతుండొచ్చునని పలువురు అభిప్రయపడుతున్నారు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.