Home » Entertainment » Karthika Deepam Serial Reached 1000 Episodes
Entertainment

Karthika Deepam : చరిత్ర సృష్టించిన కార్తీక దీపం సీరియల్.. ఆనందంలో వంటలక్క.. ఇది కదా రికార్డ్ అంటే?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 28, 2021, 3:34 pm
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే… కార్తీక దీపం సీరియల్ అంతలా… ప్రతి తెలుగు వారి ఇంట్లో కనెక్ట్ అయింది. అసలు.. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఏ తెలుగు సీరియల్ కూడా ఇంతలా సక్సెస్ కాలేదు. కార్తీక దీపం మాత్రం సూపర్ డూపర్ గా హిట్ అయింది. ముఖ్యంగా ఆ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న వంటలక్క అంటే తెలియని వాళ్లు ఉండరు. తన పేరు ప్రేమి విశ్వనాథ్. తన వల్లనే ఆ సీరియల్ కు అంత క్రేజ్.

Advertisement

karthika deepam serial reached 1000 episodes

బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నప్పుడు కూడా వంటలక్క సీరియల్… బిగ్ బాస్ రేటింగ్స్ ను తన్నేసింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సందడి చేసే బిగ్ బాస్ షో కూడా టీఆర్పీలో కార్తీక దీపం సీరియల్ ను బీట్ చేయలేకపోయిందంటే… కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ఇప్పటికే ఎన్నో సంచలనాలను సృష్టించిన వంటలక్క సీరియల్ తాజాగా మరో సంచలనానికి వేదికైంది. వంటలక్క సీరియల్ చరిత్ర సృష్టించింది. దీంతో వంటలక్క ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

Karthika Deepam : వెయ్యి ఎపిసోడ్స్ మార్క్ ను అందుకున్న సీరియల్

ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన కార్తీక దీపం తాజాగా 1000 ఎపిసోడ్స్ మార్క్ ను చేరుకుంది. అయితే… ఈ సీరియల్ ఎప్పుడు అయిపోతుందో అని అందరూ తెగ టెన్షన్ పడ్డారు. చివరకు ఇద్దరూ కలిసిపోతారని… ఇక సీరియల్ ఆగిపోతుందని భయపడ్డారు. కానీ… ఆ ఆందోళనకు సీరియల్ యాజమాన్యం చెక్ పెట్టింది. ఈ మెగా సీరియల్ త్వరలోనే 1000 ఎపిసోడ్లను పూర్తి చేసుకోబోతోంది.

Advertisement

శుక్రవారం వరకు 999 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. మార్చి 29 తో 1000 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకోబోతోంది. ఈ సీరియల్ అక్టోబర్ 2017 లో ప్రారంభం అయింది. అంటే ఇప్పటికే మూడేళ్లు పూర్తయిందన్నమాట. అయితే… 1000 ఎపిసోడ్స్ పూర్తయినా కూడా ఇప్పుడే సీరియల్ పూర్తి కాదని… మరో 450 ఎపిసోడ్స్ దాకా నడుస్తుందని అంటున్నారు. అంటే ఇంకో సంవత్సరం వరకు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఈ సీరియల్ అలరించనున్నదన్నమాట.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి