Karthika Deepam : పదిహేను రోజులకు ఒకసారి ఆ పని.. కార్తీకదీపం మోనిత వీడియో వైరల్
Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam మోనితగా శోభా శెట్టి సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఇంతటి పాపులర్ తెచ్చుకుంది శోభా శెట్టి. కన్నడ అమ్మాయి అయినా కూడా ఇప్పుడు పూర్తిగా తెలుగమ్మాయిగా మారిపోయింది. తెలుగు గలగలా మాట్లాడుతోంది. కన్నడ, తెలుగు సీరియల్స్‌తో శోభా శెట్టి బిజీగా ఉంది. అయితే ఈ మధ్య యూట్యూబ్ చానెల్ కూడాపెట్టేసింది. అందులో రకరకాల వీడియోలు, టూర్లు చేసుకుంటూ బిజీగా ఉంటోంది.
Karthika Deepam Shobha Shetty About Golden Facial
Karthika Deepam పదిహేను రోజులకు ఒకసారి ఆ పని.. కార్తీకదీపం మోనిత వీడియో వైరల్
ఈ మధ్య సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగానే పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. సౌందర్య ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ప్రమోట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శోభా శెట్టి కూడా దూసుకపోతోంది. గత వీడియోల్లో ఫుడ్ ప్రొడక్ట్స్ గురించిప్రమోట్ చేసింది.
karthika deepam 20 august 2021 friday episode 1123 highlights
తాను ఎప్పుడూ కూడా అక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. కార్తీకదీపం సెట్ టూర్ అంటూ చేసిన వీడియోలో ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేసింది.తాజాగా తన ఇన్ స్టాగ్రాంలో సౌందర్య ఉత్పత్తుల గురించి చెప్పుకొచ్చింది. గోల్డెన్ ఫేషియల్ గురించి చెబుతూ హెర్బల్ ఉత్పత్తుల గురించి తెలిపింది.
karthika deepam Shobha Shetty Youtube Video Goes Viral
మామూలుగా గోల్డెన్ ఫేషియల్ రోజూ చేసుకోలేమని, తాను మాత్రం పదిహేను ఇరవై రోజులకు ఒకసారి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. రాత్రి పడుకునే మొహానికి ఈ హెర్బల్ గోల్డెన్ ఫేషియల్ రాసుకుంటానని, ఉదయాన్నే లేచే సరికి బంగారంలా తన మొహం మెరిసిపోతుందని మోనిత చెప్పుకొచ్చింది.
