Katrina Kaif is two months pregnant news viral
Katrina Kaif : బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ మన తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కత్రినా కైఫ్. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికీ అతడిపై కత్రినా మనసు పారేసుకుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
పెళ్లైనప్పటికీ కత్రినా కైఫ్ తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇవి చూసి అభిమానులు మైమరచిపోతున్నారు.విక్కీతో కత్రినా ఏకంగా రెండున్నర సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉంది. ఎక్కడ చూసినా వారిద్దరు కలిసే కనిపించే వాళ్లు. ఎట్టకేలకు ఊరించి ఊరించి ఈ జంట ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి కూడా రెండు నెలలే అయ్యింది. ఇలా పెళ్లి జరిగిందో లేదో వెంటనే కత్రినా రెండు నెలల గర్భిణీ అన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి .ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ రాసిన వార్త ఇలా క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇంతలోనే ఏం జరిగిందో కాని..
Katrina Kaif is two months pregnant news viral
ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ఆ సైట్ ఆ వార్తను తొలగించేసింది.వార్త ఎక్కడా వైరల్ అవుతుందో అని కత్రినా కైఫ్ పీఆర్వో టీం ఆఘమేఘాల మీద స్పందించి ఆ వార్తను తొలగించేలా చేసిందని అంటున్నారు. అంతేకాకుండా ఆ వార్తలని ఖండించినట్టు సమాచారం. ఏదేమైనా కత్రినా – విక్కీ ఇద్దరూ కూడా రెండున్నర సంవత్సరాలుగా డేటింగ్‌లోనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకొని ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నారు. బేబి బంప్‌తో వరుస ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కత్రినా నుండి కూడా త్వరలో గుడ్ న్యూస్ అందుకోవాలని భావిస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.