Home » Entertainment » Keerthy Suresh Intresting Comments Viral
Entertainment

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 28, 2025, 9:00 pm
Advertisement

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఇలాంటి చాలా విపరీతమైన అనుభవాలను ఎదుర్కొన్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.తాజాగా విడుదలైన ఉప్పు కప్పురంబు చిత్ర ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, “నా తొలి సినిమా గీతాంజలి షూటింగ్‌లో ఓ సన్నివేశం చేసేటప్పుడు దర్శకుడు ప్రియదర్శన్ నన్ను చూస్తూ ‘ఎంత చెత్తగా చేశావో నీకు తెలుసా?’ అని తిట్టారు.

Advertisement

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : అదే కార‌ణం..

ఆ మాటలు నన్ను ఎంతగానో బాధ పెట్టాయి. కానీ అప్పటి నుండి నేనెప్పుడూ తలదించుకోలేదు. తలతోనే పైకి వచ్చాను,” అని కీర్తి గుర్తుచేసుకున్నారు.అయితే, ఉప్పు కప్పురంబు దర్శకుడు శశి గురించి మాట్లాడుతూ, “ఆయన నటీనటులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తారు. ఎప్పుడూ కోపంగా ఉండరు. ఆయన కోపంగా తిట్టే పరిస్థితి రాకుండా నేనే నా పాత్రను బాగా న్యాయపరచేందుకు ప్రయత్నించాను” అని చెప్పారు.

Advertisement

ఈ కథనంలో కీర్తి తన సినీ ప్రయాణంలోని మొదటి దశలో ఎదుర్కొన్న కష్టాలను, వాటిని ఎలా అధిగమించిందో స్పష్టంగా చెప్పారు. కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులోనే కాక ఇత‌ర భాష‌లలోను న‌టిస్తూ మెప్పిస్తుంది. ఆమె న‌టించిన చాలా చిత్రాలు మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ‌.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి