clarity on keerthy suresh love marriage
Keerthy Suresh : ఏ సినీ ఇండస్ట్రీ అయినా సరే.. హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే ఖతం. వాళ్లు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లు అయినా సరే.. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇక ఖేల్ ఖతం అన్నట్టే లెక్క. ఒకప్పుడు పెళ్లయిన హీరోయిన్లకు అంతగా అవకాశాలు రాకపోయేవి. దర్శకనిర్మాతలు వాళ్లను పట్టించుకునేవారు కాదు. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా హీరోయిన్లకు అవకాశాలు విషయంలో ఎలాంటి కొదవ ఉండటం లేదు. వాళ్ల వైవాహిక జీవితంలో ఉన్నప్పటికీ సినిమాల్లోనూ నటిస్తూ అటు ఇంట.. ఇటు సినిమాల్లో రాణిస్తున్నారు.
అలా ఈతరం హీరోయిన్లలో పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ ఇంకా టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక.. మరో టాప్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేశ్ పెళ్లి విషయంపై చాలా గాసిప్స్ వస్తున్నాయి. అప్పటి వరకు కీర్తి సురేశ్ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే మహానటి సినిమాలో నటించిందో.. ఆ సినిమా విడుదల అయ్యాక తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
keerthy suresh is going to get married soon
తను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా తనకు పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేశ్ బంధువుల అబ్బాయినే పెళ్లి చేసుకోబోతోందట. అతడు ఒక యువ పారిశ్రామికవేత్త అని విదేశాల్లో ఉంటాడని తెలుస్తోంది. త్వరలోనే అతడితో కీర్తి సురేశ్ త్వరలో మూడు ముళ్లు వేయించుకోనుందని టాక్. ఒకవేళ అతడిని పెళ్లి చేసుకున్నాక కీర్తి సురేశ్ కూడా గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతుందా అని తన అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. చూద్దాం మరి కీర్తి సురేశ్ ఏం చేస్తుందో? పెళ్లి చేసుకుంటుందా? చేసుకున్నా సినిమాల్లో నటిస్తుందా? లేక విదేశాలకు చెక్కేస్తుందా?
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.