Keerthy Suresh : బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. కీర్తి సురేష్ టాలెంట్‌కి ఆమె వెనుక ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించింది. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఒకవైపు కథానాయికగా చేస్తూనే మరో వైపు చెల్లెలు పాత్రలలో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి తాను చెల్లి పాత్రలు చేయడానికి గల కారణాలు బయట పెట్టింది కీర్తి సురేష్.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే చెల్లి పాత్రలు వచ్చినా కాదనకుండా చేస్తున్నానని అన్నారు. తనకు ఎప్పటి నుంచో రజినీకాంత్ గారితో నటించాలని ఉండేదని.. ఆ అవకాశం దొరకడం చాలా కష్టం అని అందుకే పెద్దన్నలో చెల్లి పాత్ర చేశానని ఆమె చెప్పుకొచ్చింది. గ్లామర్ పాత్రల విషయంలో ఆమె మాట్లాడిన మాటలు మిస్‌ఫైర్ అవ్వడంతో ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. గ్లామరస్ క్యారెక్టర్స్ చేయడానికి తనకేం అభ్యంతరం లేదని, స్కిన్ షో మాత్రం చేయడం తనకి ఇష్టం లేదని తేల్చి చెప్పింది.
గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. కురచ దుస్తులలో ఈ అమ్మడు అందాల రచ్చ కేక పెట్టిస్తుంది. క్యూట్ లుక్స్ లో ముద్దుగుమ్మ మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ పింక్ కలర్ డ్రెస్‌లో కుర్రకారు గుండెలలో సెగలు రేపుతుంది. ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని నటిగా నిలదొక్కుకుంది. ఒక రకంగా ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఒక్క సారిగా నెక్ష్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.