Home » Entertainment » Keerthy Suresh Photo Viral
Entertainment

Keerthy Suresh : అంత ఎత్తులో నిలబడి ఆ పని చేస్తున్న కీర్తి సురేశ్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 13, 2021, 8:15 am
Advertisement

Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ భామ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.‘మహానటి’ సినిమాకుగాను నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తూనే మరో వైపున సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తోంది.

Advertisement

సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది కీర్తి సురేశ్. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫొటో పోస్ట్ చేసింది కీర్తి. సదరు ఫొటోలో కీర్తి సురేశ్ అత్యంత ఎత్తైన ప్రదేశంలో అనగా బిల్డింగ్ పెంట్ హౌజ్‌పైన కాఫీ తాగుతూ నిలబడింది. లాంగ్ ఫ్రాంగ్ ధరించిన కీర్తి సురేశ్ క్యూట్ స్మైల్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

keerthy suresh Photo viral

Advertisement

Keerthy Suresh : స్లిమ్ అయిపోతున్న బ్యూటిఫుల్ కీర్తి సురేశ్..

ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కీర్తి సురేశ్ బాగా సన్నబడిపోయి స్లిమ్ అవుతుందని చర్చించుకుంటున్నారు. కీర్తి ఫొటోను చూసి ‘బ్యూటిఫుల్, సో క్యూట్, బేబీ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భామ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించిన ‘పెద్దన్న’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించబోతుంది. ఇందులో మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా తమన్నా భాటియా కనిపించబోతుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి