Home » Entertainment » Keerthy Suresh Prepares Food Video Viral
Entertainment

Keerthy Suresh : కిచెన్‌లో వంటలు చేస్తున్న కీర్తి సురేష్‌.. ఎందుకిలా?

Authored By
Sam C
The Telugu News | Published on: April 2, 2022, 2:30 pm
Advertisement

Keerthy Suresh : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌ని డిసైడ్ అయ్యారు మ‌న అందాల ముద్దుగుమ్మ‌లు. క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మ‌హాన‌టి సినిమాతో స్టార్‌డం సంపాదించిన కీర్తి సురేష్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. హీరోయిన్‌గానే కాకుండా సోద‌రిగా, అమ్మ‌గా పలు పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. పెంగ్విన్’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా నటించింది కీర్తి. కాగా ప్రస్తుతం ఈ మహానటి ఫేమ్.. మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ ప్లే చేస్తోంది.

Advertisement

అందం, అభినయంలో కీర్తి సురేష్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది. ‘మహానటి’ మూవీ తర్వాత కీర్తి సురేష్ కు వచ్చిన ఫేం అంతా ఇంతా కాదు. ఆ పాపులారిటీతోనే స్టార్ హీరోయిన్ గా కేరీర్ లో దూసుకుపోతోంది. అయితే కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ స్టార్ హీరోల ఫేమ్ తో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ నటించిన సినిమాలు హిట్ కావు అనే టాక్ ఉండిపోయింది. నిజానికి తను ఇటీవల ఎం చేసినా ఎదురుదెబ్బే అవుతోంది.ఏదేమైనా కీర్తి మాత్రం అటు సినిమాలు చేస్తూ.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.

keerthy suresh prepares food Video Viral

Advertisement

Keerthy Suresh : కీర్తి మ్యాజిక్ మాములుగా లేదు…

తాజాగా ఈ అమ్మ‌డు ఓ యాడ్ కోసం కిచెన్‌లో గ‌రిటె ప‌ట్టింది. కీర్తి సురేష్ ట‌కాట‌కా వంట వండేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇదిలా ఉంటే దర్శకుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు శర్వానంద్.. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోవాలని అనుకున్నారు. ఆమెను సంప్రదించగా.. కెరీర్ బిగినింగ్‌లో తల్లి పాత్రలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నో చెప్పిందట.. ఆమె రిస్క్ అనుకున్న పాత్రను ఫేస్ చేయడానికి ఇప్పుడు కీర్తి సురేష్ రెడీ అయిందట.. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి పాత్రలో నటించబోతోందని సమాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి