Home » Entertainment » Keerthy Suresh Stunning Looks 2
Entertainment

Keerthy Suresh : స‌రికొత్త అవ‌తారంలో కీర్తి సురేష్‌..మైండ్ బ్లోయింగ్‌గా ఉందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 1, 2022, 5:30 pm
Advertisement

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు గత కొద్ది రోజులుగా ట్రెండీగా ఫొటోషూట్లు నిర్వహిస్తూ తన రూట్ మార్చింది. గతంలో ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చే ఈ బ్యూటీ.. ఇటీవల వెస్టర్న్ వేర్ లో స్టైలిష్ గా రెడీ అవుతూ అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ హీరోయిన్ కీర్తి సురేశ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహా నటి’తో జాతీయ స్థాయిలో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకుని తన పాపులారిటీని పెంచుకుంది.తెలుగు ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించింది.

Advertisement

ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది.
ర‌చ్చ రంబోలా..స‌ర్కారు వారి పాట సినిమా క‌న్నా ముందు కీర్తి సురేష్ మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతుంది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ‘సాని కాయిధం’ అనే తమిళ చిత్రాన్ని ‘చిన్ని’ పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్‌డ్‌ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్‌ సోదరుడు, డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ కీలక పాత్ర పోషించాడు.

keerthy suresh stunning looks

Advertisement

మే 6న చిత్రం విడుదల కానుండ‌గా, ఈ మూవీ ప్రమోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది కీర్తి.ట్రెండీ వేర్ దుస్తుల‌లో ఫొటో షూట్స్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ్లామర్ పిక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో కీర్తి సురేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. డెనిమ్ జీన్స్, ట్రెండీ షర్ట్ ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. సిట్టింగ్ పోజిషనల్ లో మతిపోయేలా ఫోజులివ్వడంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెరైటీ స్టిల్స్ పెట్టిన కీర్తి సురేష్‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. అమ్మ‌డికి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి