Home » Entertainment » Keerthy Suresh Yoga Video Viral
Entertainment

Keerthy Suresh : ఒంటిని విల్లులా వంచేసిన కీర్తి సురేష్‌.. అమ్మ‌డిని చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 21, 2022, 7:00 pm
Advertisement

Keerthy Suresh : నేడు అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులు కూడా యోగా వేడుక‌ల‌లో పాల్గొన్నారు. అంతేకాక సోష‌ల్ మీడియా వేదిక‌గా యోగ‌స‌నాల‌కి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేశారు. తాజాగా కీర్తి సురేష్ యోగ‌స‌నాల‌కు సంబంధించి వీడియోని షేర్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ ఒంటిని విల్లులా వంచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ర‌బ్బ‌రు మాదిరిగా ఈ ముద్దుగుమ్మ వంచ‌గా, ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. కీర్తిని కుక్క డిస్ట్ర‌బ్ చేస్తుండ‌గా, దానిని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నేను శైలజ చిత్రంతో కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.

keerthy suresh yoga video viral

Advertisement

Keerthy Suresh : కీర్తి యోగాస‌నాలు..

ప్రిన్స్‌ మహేష్‌బాబు పక్కన స్క్రీన్‌ షేర్ చేసుకున్న తర్వాత కీర్తి సురేష్‌ పేరు కళావతిగా మారిపోయింది. ఇండస్ట్రీలో బిగ్‌స్టార్‌తో యాక్ట్ చేసిన మహానటి ఫేమ్ యాక్టరస్ ఇప్పుడు సోషల్ మీడియాలో దూకుడు పెంచింది. ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న కీరీసురేష్ రీసెంట్‌గా అంతే ట్రెడిషనల్‌ డ్రెస్సులతో దిగిన ఫోటోలను ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. సర్కారు వారి పాట ఇచ్చిన సక్సెస్‌ కిక్కుని బాగా ఎంజాయ్ చేస్తోంది మహానటి.స్వతహాగా మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికి మహానటి సినిమాతో ఆరణాల తెలుగు హీరోయిన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది కీర్తి సురేష్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి