kevvu karthik : కెవ్వు కార్తీక్.. ఈ పేరు వినగానే అందరికీ జబర్దస్త్ షో గుర్తుకు వస్తుంది. మాస్ అవినాష్ కెవ్వు కార్తీక్ పేరుతో ఉన్న టీంలో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. జబర్దస్త్ షో చాలా మంది నటులకు లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో చేరిన వారంతా ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ నటులంతా వేరే వేరే బుల్లితెర షోలల్లో కూడా కనిపిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో వచ్చిన ప్రోగ్రాం కూడా చాలా బాగా నడుస్తోంది. ఇందులో కూడా ఈ నటులంతా కనిపిస్తున్నారు. సుడిగాలి సుధీర్ దీనికి యాంకర్‌గా పనిచేస్తున్నాడు. సుధీర్ తో పాటు మరికొందరు నటులు కూడా ఇందులో కనిపిస్తున్నారు.
హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, పొడుగు సుందరి వర్ష, ఇమాన్యుయేల్ వంటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా శ్రీ దేవీ డ్రామా కంపెనీలో నటిస్తున్నారు. ఇందులో జడ్జిగా సీనియర్ యాక్టర్ ఇంద్రజ చేస్తుంది. ఈ నటి తన నవ్వుతో ప్రోగ్రామ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇందులో కమెడియన్స్ చాలా బాగా నవ్వులు పూయిస్తున్నారు. వచ్చే ఆదివారం ఇందులో రజినీకాంత్ కోసం స్పెషల్ షో ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ రజినీ పుట్టినరోజు సందర్భంగా సభ్యులందరూ రజనీ స్టైల్‌ను ఫాలో అయ్యారు. స్పెషల్ గెటప్పుల్లో కనిపించనున్నారు. అయితే, కెవ్వు కార్తీక్ మాత్రం అందరి కంటే కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు..
పొట్టి నటుడి వేషంలో మరుగుజ్జుగా కార్తీక్ కనిపిస్తాడు. ఆ స్కిట్ కోసం కార్తీక్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఇందులో పొట్టిగా ఉన్నాడని తన లవర్ అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. మధ్యలో ఎలా వదిలేసి వెళ్లిపోతావ్ అని కార్తీక్ అడుగగా.. నిన్ను ఆ దేవుడే ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడని దారుణం గా అవమానిస్తుంది. అమ్మాయితో కలసి ఏడు అడుగులు వేయాలంటే ఆరు అడుగుల పొడవు మా పేరెంట్స్‌కు తెలియదు ఏమో.. అందరూ నా ఆకారాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ, నా మనసు ఎందుకు చూడటం లేదని బాధపడుతాడు. తన నటనతో అందరినీ ఏడిపించేశాడు. ఇలా ప్రతీవారం ఏదో ఒక స్కిట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కార్తీక్ నటనను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.