Home » Entertainment » Kiara Advani Cute Moments Viral In Social Media
Entertainment

Kiara Advani : ప‌ల‌చ‌ని చీర‌లో కేక పెట్టిస్తున్న కియారా అద్వాని.. ఇలా చూస్తే ఎవ‌రైన పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 26, 2022 1:16 pm
Advertisement

Kiara Advani : కియారా అద్వాని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత విన‌య విధేయ రామ చిత్రంతో ద‌గ్గ‌రైంది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. సిద్దార్థ్‌ మల్హోత్రాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల‌ బ్రేకప్ తో బి-టౌన్‌లో హాట్‌టాపిక్ గా నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు.

Advertisement

వీరి బ్రేకప్‌పై బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్న తమకేం పట్టనట్టు వ్యవహరించింది ఈ జంట. కియారా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆ త‌ర్వాత కూడా ఇన్‌డైరెక్ట్‌గా త‌మ రిలేష‌న్ షిప్‌పై ప‌లు కామెంట్స్ చేసింది కియారా.

kiara advani cute moments viral in social media

Advertisement

Kiara Advani : కియారా క్యూట్ పిక్స్..

ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారాలు వారి రిలేషన్‌పై ఇంతవరకు స్పందించలేదు. కానీ ముంబై రోడ్లలో జంటగా చక్కర్లు కొడుతూ విందులు, వినోదాలకు కలిసి వెళుతుంటారు. అంతేకాదు కియారా పలుమార్లు సిద్ధార్థ్‌ ఇంటికి వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. 2021లో వీరిద్దరు జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలో కియారా, సిద్ధార్థ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కియారా క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ప‌ల‌చ‌ని శారీ ధ‌రించి మెస్మ‌రైజింగ్ అందాల‌తో క‌వ్విస్తుంది. ప్ర‌స్తుతం కియారా స్ట‌న్నింగ్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి