Samantha kiara break ups her love
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ ఎక్కువయ్యాయి. అందాల ముద్దుగుమ్మ సమంత- అక్కినేని హీరో చైతూ ప్రేమించి పెళ్లి చేసుకోగా వారు నిండు నూరేళ్లు కలిసి ఉంటారని అనుకున్నారు. కాని నాలుగేళ్లకే విడిపోయారు. తర్వాత కూడా చాలా మంది విడాకుల బాట పట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోయిన్ కూడా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందని వార్తలు వస్తున్నాయి. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమా చేస్తుంది. ఈ సినిమాపై అమ్మడు బోలెడన్ని అంచనాలు పెట్టుకుంది.
కియారా అద్వానీ గత కొంతకాలంగా హీరో సిద్దార్థ్ మల్హ్రోత్రాతో డేటింగ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కెర్లు కొట్టాయి. కానీ సడెన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ వీరు తమ రిలేషన్‌కి ఎండ్ కార్డ్ వేసినట్లు బీటౌన్ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కియారా బ్రేకప్ వార్తలు నిజమేనంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీరిద్ధరి బ్రేకప్ వ్యవహారం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గతంలో ‘షేర్ షా’ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా సందర్భంగానే వీరికి పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది.
Samantha kiara break ups her love
గత కొన్నేళ్లుగా డేటింగ్ చేయడం ప్రారంభించారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్న తరుణంలో ఇద్దరూ విడిపోయారనే వార్త అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం మానేశారని వారితో సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి వెల్లడించాడు. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం కియారా భూల్ భూలయ్యా 2 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇటీవలే లైగర్ బ్యూటీ అనన్య.. ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతుంటే.. మరోవైపు బ్రేకప్ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.