Home » Entertainment » Kingdom Movie First Day Collections
Entertainment

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 1, 2025 10:48 am
Advertisement

Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‏డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య విడుదలైన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. ఈ సినిమాకు ఫస్ట్ రోజే 50 శాతం ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫ‌స్ట్ డే ఎంత వ‌సూలు చేసింది అంటే..!

Kingdom Movie Collections : మంచి ఓపెనింగ్..

ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం మొదటి రోజు కింగ్‏డమ్ సినిమా దాదాపు రూ.30కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. కింగ్‏డమ్ మొదటి రోజు రూ.15.75 కోట్ల షేర్స్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరిర్ లో అత్యంత విజయవంతమైన ప్రారంభరోజు ప్రదర్శనలలో ఇది ఒకటి అని చెప్ప‌వ‌చ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు

Advertisement

ఇక అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి. ఇక ఇప్పుడు భారతదేశంలో కింగ్‏డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.ఇక కింగ్‏డమ్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 57.87 % ఆక్యుపెన్సీ రాగా.. ఉదయం 63.56% హాజరు వచ్చింది, ఇది మధ్యాహ్నం 56.52%, సాయంత్రం 50.12%కి, రాత్రి ప్రదర్శనలకు మళ్ళీ 61.27%కి వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్, అయ్యప్ప పి. శర్మ కీలకపాత్రలు పోషించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి