Home » Entertainment » Kr Vijaya Daughter Star Heroin In Tollywood Now
Entertainment

KR Vijaya Daughter : హీరోయిన్ కె.ఆర్ విజయ కూతురు ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఆమె మరెవరు కాదో…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 3, 2022, 12:20 pm
Advertisement

KR Vijaya Daughter : తెలుగు పరిశ్రమలో అప్పటి హీరోయిన్ కె.ఆర్ విజయ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సావిత్రి, యమున వంటి పలు హీరోయిన్లతో సమానంగా ఈమె తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. కె ఆర్ విజయ జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాలలో ఎక్కువగా నటించారు. ఇక తెలుగు సినిమాలలో దేవత పాత్ర అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే నటి కె ఆర్ విజయ అని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

Advertisement

అలాగే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే కె ఆర్ విజయ కూతురు మరియు చెల్లెలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనే సంగతి చాలామందికి తెలియదు. ఈమె చెల్లెలు అయిన సావిత్రి మలయాళం లో హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకున్నారు. హీరోయిన్ సావిత్రి కేవలం మలయాళం సినిమాలను మాత్రమే చేశారు. ఇక కె ఆర్ విజయ ఇద్దరు కూతుర్లు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకరు హీరోయిన్గా మరొకరు నటి గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

KR Vijaya Daughter star heroin in tollywood now

Advertisement

ఆమె కూతురు అనూష హీరోయిన్ గా మరియు మరొక కూతురు మణిరాగా సుధా నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగుతోపాటు వీళ్లు తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించారు. కె ఆర్ విజయ బంధువులు చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక కెఆర్ విజయ కూతురు అనూష మలయాళం లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాలలో హీరోయిన్గా చేసింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి