Prabhas : ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. టీజర్ అద్భుతంగానే ఉంది. డార్లింగ్ అభిమానులే కాకుండా అందరినీ మెప్పించేలానే ఉంది. అయితే అనుకున్న స్థాయిలో లేనట్టుగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక అసలే ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు. వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్‌తో పోలుస్తున్నారు.
దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతర్జాతీయ సంస్థలతోనే గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు చేయించాడు. అయితే ఇందులో రియాల్టీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏదేదో చేసేసి.. ప్రభాస్‌కు బాడీ తగిలించినట్టుగా.. గ్రాఫిక్స్‌లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పా.. ఒరిజినల్ కాదంటూ జనాలు అంటున్నారు. ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ చానెల్లో చూసినట్టుగా అనిపిస్తోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. దీనిపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తుండగా, దీనిపై లీగల్ గా పోరాడేందుకు ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య సిద్ధమయ్యాకరట. ఒకప్పుడు కృష్ణం రాజు కోసం పని చేసిన లాయర్ తో ఆమె సంప్రదిస్తున్నారు . తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠినమైన శిక్ష పడేలా ప్రభాస్ పెద్దమ్మ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక టీజర్ విషయానికి వస్తే.. భూమి కృంగినా.. నింగి చీలినా..
న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు. ‘న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి.నీటిలో రాముడిలా ప్రభాస్ ధ్యానం చేస్తున్న షాట్స్.. రామసేతు మీద నడుస్తున్న షాట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తే ఫ్యాన్స్‌కు పక్కా గూస్ బంప్స్ రావడం ఖాయం. రావణసురిడిగా సైఫ్ ఆలీ ఖాన్ గెటప్ కూడా సూపర్‌గా సెట్ అయింది. ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దూసుకుపోతుండగా.. యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించనుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.