krithi shetty behaving like samantha
Krithi Shetty : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరయిన్ స్టేటస్ దక్కించుకుంది అందాల భామ కృతిశెట్టి. ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషనల్ స్టార్ అయిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఆ చిత్రంతో కృతిశెట్టి..హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ భామ ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఈమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ విడుదలైంది. ఇందులో కృతి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో ఈమె నటించిన ‘బంగార్రాజు’ విడుదల కానుంది.
కృతిశెట్టి డేట్స్ కోసం ప్రజెంట్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్ టాక్. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో ‘నాగలక్ష్మి’గా కృతిశెట్టి అలరించనుంది. ఇందులో మహిళా సర్పంచ్ పాత్రను నాగలక్ష్మి అత్యద్భుతంగా పోషించిందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం డెఫినెట్‌గా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.ఈ చిత్రంలో కృతిశెట్టి నాగార్జునకు భార్యగా నటించింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో హీరోలు నాగార్జున, నాగచైతన్య, హీరోయిన్ కృతిశెట్టి యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
krithi shetty behaving like samantha
ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. కాగా, ప్రమోషన్స్‌లో కృతిశెట్టి బిహేవియర్ గురించి సోషల్ మీడియాలో పలువురు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్యలు సమంతను మరిచిపోయేలా కృతిశెట్టి బిహేవ్ చేస్తోందని, షూటింగ్ టైం నుంచి మొదలుకుని ప్రమోషన్స్ వరకు ఎప్పుడూ హీరోలతోనే ఉంటున్నదని అంటున్నారు. అలా కృతిశెట్టి హ్యాపీగా అక్కినేని వారి భజన చేస్తోందని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత కూడా తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో ఇలాగే చేసిందని, ‘మనం’ షూటింగ్, ఫిల్మ్ ప్రమోషన్స్‌లో సేమ్ కృతిశెట్టి లాగానే బిహేవ్ చేసిందని పోస్టులు పెడుతున్నారు.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.