uppena heroine Krithi Shetty want to do more telugu films
Krithi Shetty : కృతి శెట్టి అనేకన్నా.. బేబమ్మ అంటే అందరికీ గుర్తొస్తుంది. బేబమ్మగానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ కన్నడ భామ. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కేవలం 16 ఏళ్లకే హీరోయిన్ అవడమే కాదు.. బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. తనకు ఆఫర్లు వస్తున్నాయన్న తొందరలో.. ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఓకే చెప్పేసి అడ్డంగా బోల్తా పడింది. ఉప్పెన తర్వాత తనకు అంతగా సరైన హిట్ ఒక్కటీ దక్కలేదు. కొన్ని సినిమాలు ఏదో నడిచాయి అంతే కానీ..
ఉప్పెన సినిమాలో తనకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదు.ఒక రెండు సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. కానీ.. తనకు ఏమాత్రం పేరు తీసుకురాలేకపోయాయి. మరో మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. దీంతో ప్రస్తుతం బేబమ్మకు సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం తన చేతుల్లో ఒక్క కసిడి అనే సినిమా మాత్రమే ఉంది. ప్రస్తుతం తన ఆశలన్నీ ఆ సినిమా మీదనే. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక కృతి కెరీర్ పుల్ స్టాప్ అయినట్టే లెక్క. ఒకవేళ సినిమా ఛాన్సులు రాకపోతే ఎలా.. అంటూ మధన పడిపోయిన కృతి శెట్టి..
krithi shetty daring steps to get movie offers
చివరకు ఐటెమ్ సాంగ్స్ లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఒకవేళ తను నటించే సినిమాలు హిట్ కాకపోయినా కనీసం ఐటెమ్ సాంగ్స్ తో అయినా తనకు పేరు వస్తుందని భావిస్తున్నదట కృతి శెట్టి. ఐటెం సాంగ్స్ లోనూ నటించేందుకు తాను సిద్ధం అన్నట్టుగానే కృతి శెట్టి డైరెక్టర్లకు హింట్ ఇస్తోందని.. ఇలా స్టార్ హీరోయిన్ గా ఉన్న కృతి శెట్టి.. చివరకు ఇంతలా ఎందుకు దిగజారిపోయింది అంటూ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. చూద్దాం మరి.. కృతి శెట్టి సినిమా కెరీర్ ఎంత దూరం వెళ్తుందో?
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.