Home » Entertainment » Krithi Shetty Is Going To Do Dubbing Also
Entertainment

Krithi Shetty : ఉప్పెన బ్యూటీ ఆ పని కూడా చేస్తానంటోంది..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 4, 2021 10:55 am
Advertisement

Uppena : ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది కుర్ర భామ కృతి శెట్టి. ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. యంగ్ హీరోలకి బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఉప్పెన రిలీజ్ కాకుండానే నాని, సుధీర్ బాబు సినిమాలకి సైన్ చేసి షాకిచ్చింది. నానితో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తోంది.

Advertisement

ఈ సినిమాలో సాయి పల్లవి మరొక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. అలాగే సుధీర్ బాబుతో చేస్తున్న సినిమా కూడా సెట్స్ మీదుంది. ఇక రీసెంట్‌గా ఎనర్జిటిక్ హీరో రాం సరసన కూడా ఒక సినిమా చేసేందుకు సైన్ చేసింది. మేకర్స్ అధికారకంగా కూడా కృతి శెట్టి పేరు ప్రకటించారు. ఇలా అధికారకంగా మూడు సినిమాలు కృతి శెట్టి చేతిలో ఉండగా మరో మూడు సినిమాలు కూడా కమిటయిందని తెలుస్తోంది.

Krithi Shetty is going to do dubbing also

Advertisement

Uppena : కృతి శెట్టి ఫ్యూచర్‌లో నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకునేందుకు ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.

అయితే ఏ హీరోయిన్ అయినా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని తాపత్రయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో కృతి శెట్టి కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనుందని స్వయంగా వెల్లడించింది. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కృతి శెట్టి ఫ్యూచర్‌లో నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకునేందుకు ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే సాయి పల్లవి, కీర్తి సురేష్ సహా పలువురు స్టార్ హీరోయిన్స్ తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి