Home » Entertainment » Krithi Shetty Mond Blowing Demand
Entertainment

Krithi Shetty : కృతి శెట్టి అంటే ఆ హీరోకి అంత ఇష్ట‌మా.. దానికి కూడా సిద్ధ‌మ‌ట‌

Authored By
Sam C
The Telugu News | Updated on: July 5, 2022 6:01 pm
Advertisement

Krithi Shetty : కన్న‌డ బ్యూటీ కృతి శెట్టి ఏ ముహూర్తాన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందో కాని అమ్మ‌డికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. క్యూట్ లుక్స్, కళ్ళతోనే హావభావాలు పలికించగలిగే కెపాసిటీ యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టేలా చేశాయి. ఉప్పెనలో కృతి శెట్టి నటనకు 100 శాతం మార్కులు పడ్డాయి. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. గత ఏడాది కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతినిండా సినిమాలు ఉన్నాయి.

Advertisement

నితిన్ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ చిత్రాలని ప్రస్తుతం కృతి శెట్టి చేస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది. కృతి డిమాండ్ అలాంటిది… ఇప్పటికే అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయిన ..కృతి కి మరో కోలీవుడ్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హీరో రామ్..ది వారియర్ సినిమా తో తమిళంలోను లక్ టెస్ట్ చేసుకోబోతున్న కృతి..మరో స్టార్ హీరో సూర్య సినిమాలోను నటిస్తుంది. ఇప్పుడు అది కాకుండా మరో స్టార్ హీరో విశాల్ కూడా అమ్మడు పై ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. విశాల్ హీరోగా రానున్న కొత్త తమిళ సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందట.

Krithi Shetty mond blowing demand

Advertisement

నిజానికి అమ్మడు కాల్ షీట్స్ అస్సలు ఖాళీ గా లేవట. కానీ, విశాల్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆఫర్ కి అమ్మడు టెంప్ట్ అయ్యి కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ..ప్రాజెక్ట్ కి సైన్ చేసిందట. కృతి శెట్టి ఈ సినిమా కోసం దాదాపు 3 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫ్రీ టైం ఉన్న సమయంలోనే షూటింగ్ పనులు పూర్తి చేద్దాం..కంటిన్యూగా కూదా అవసరం లేదు..జంబ్లింగ్ గా కూడా ఓకే అంటూ విశాల్..కృతికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో కృతి ఓకే చేసిందట. స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ అమ్మ‌డి వెన‌క ప‌డ‌డం ప‌ట్ల అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి