Krithi Shetty : ఉప్పెన అనే సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది కృతి శెట్టి. ఈ ఒక్క సినిమాతో కృతి రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలందరూ కూడా ఆశ్చర్యపోయేలా ఆఫర్లతో దూసుకుపోయింది. ఇక ఏ హీరోయిన్‌కు దక్కని గ్రాండ్ వెల్కమ్ కృతి శెట్టికి దక్కింది. ఉప్పెన లాంటి సక్సెస్ కృతి శెట్టికి వరంగానూ శాపంగానూ మారింది. ఇంత వరకు మళ్లీ ఉప్పెన రేంజ్ సక్సెస్‌ను కృతి శెట్టి చూడలేకపోయింది. ఆమె చేస్తోన్న సినిమాలన్నీ వరుసబెట్టి ఫ్లాపులు అవుతున్నాయి. చివరకు ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్థాయికి వచ్చింది. ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.
శ్యామ్ సింగరాయ్ చిత్రం, బంగర్రాజు చిత్రాలు కొంత పర్వాలేదు అనిపించిన మిగతావి పెద్దగా అలరించలేకపోయాయి. నిజానికి కృతి శెట్టి చిన్నప్పట్నుంచి హీరోయిన్ అవ్వాలని కలగనలేదట. కృతి ముంబైలో చదువుకుంటున్న టైంలోనే కమర్షియల్ యాడ్స్ లో అప్పుడప్పుడు కనిపించేదట. ఆమె హిందీ లో సూపర్ 30 లో స్టూడెంట్ గా నటించింది. అయితే కృతి హీరోయిన్ కావడం వెనక ఆమె ఫ్యామిలీ చాలా త్యాగం చేసిందట. కృతి శెట్టి 2003 ముంబై లో పుట్టింది. కృతి శెట్టి కర్ణాటకలోని మంగళూరు తుళు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కృతి శెట్టి తండ్రి బిజినెస్ లో సెటిల్ అయ్యి ముంబై కి వచ్చాడు. కృతి శెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్. ఈమెకు ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు.
krithi shetty mother did this for her daughter
సినిమాల్లో కృతి శెట్టి కి వరుసగా ఛాన్సులు రావడంతో కృతి శెట్టి తల్లి తన బిడ్డకోసం ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసిందట. తన కూతురితో పాటు వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో కృతి తల్లి తన కెరీర్‌ని పక్కన పెట్టి కూతురికి అండగా నిలిచిందట. ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చింది. కృతి తల్లి చేసిన త్యాగం వల్లనే కృతి ఈ స్థాయికి చేరుకుందని నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతి.. రామ్ ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా అన్ని సినిమాలలో నటించగా, కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యాయి. దీంతో కృతి శెట్టి పూర్తిగా డౌన్ ఫాల్ అయింది.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.