
krithi shetty shows her love on ram charan
Krithi Shetty : ఒక్కసినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాలోనే తన అందచందాలతో పాటు నటనతోను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ, హిట్స్ అందుకుంటుంది. రీసెంట్‌గా కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ్ రాయ్ హిట్టైంది. ఆ తర్వాత విడుదలైన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుండడంతో.. కృతీ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ సుధీర్ బాబుకు జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్` చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చిందని .. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతిగా అనిపించిందని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట పంపించారని తెలిపింది. తన చేతితో రాసిన ఓ లెటర్ , గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని… అందులో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాశారని… అందుకే ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నానని తెలిపింది.
krithi shetty shows her love on ram charan
ఇక రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా అలరించిన రామ్ చరణ్ ఆ సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ .. కృతి శెట్టి మనసు కూడా గెలుచుకున్నాడట. రీసెంట్‌గా కృతిని ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నావు అని అడుగగా… నాకు రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం. తెలుగులో నేను చూసిన తొలి చిత్రం ‘రంగస్థలం’. హిందీలో ఆయన డబ్బింగ్ సినిమాలు చూశాను. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నాకు చాలా బాగా నచ్చారు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఎప్పటికైనా రామ్ చరణ్ గారితో కలిసి పని చేయాలి” అని తెలిపింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.