Home » Entertainment » Kushbu Satires On Bullet Bhasker In Extra Jabardasth Promo
Entertainment

Bullet Bhaskar : ఒక్క మాటతో పరువుతీసేసింది.. బుల్లెట్ బాస్కర్‌పై కుష్బూ కామెంట్లు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 17, 2022, 3:00 pm
Advertisement

Bullet Bhaskar : జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల నుంచి రోజా వెళ్లిపోవడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. మనో కూడా పక్క చానెల్‌కు వెళ్లిపోయాడు. ఉన్న ఒక్క ఇంద్రజ తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇద్దరు జడ్జిలు ఉండటం అనేది పరిపాటిగా మారింది. అయితే ఇందులో భాగంగా ఇంద్రజతో పాటు ప్రతీ వారం వేరే ఒక గెస్టును తీసుకొచ్చేందుకు మల్లెమాల, జబర్దస్త్ టీం కష్టపడుతోంది. ఈ క్రమంలోనే గత వారంలో కుష్బూని తీసుకొచ్చారు. కుష్బూ కూడా మంచి ఎనర్జీతో కనిపించింది. కుష్బూ అయితే జడ్జ్‌గా బాగానే ఉంటుందని అందరికీ అర్థమైంది. ఆమె పంచులు స్పాంటేనియస్‌గానే ఉన్నాయి.

Advertisement

ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలనూ కుష్బూ అదరగొట్టేసింది. కుష్బూని కంటిన్యూ చేయండని అందరూ కోరుతున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో గానీ.. కుష్బూ వేసిన పంచులు మాత్రం అదిరిపోయాయి. ఈ ఎపిసోడ్ ప్రోమో చివర్లో కుష్బూ అదరగొట్టేసింది. కుష్బూ దాదాపు సీనియర్ హీరోలందరితోనూ నటించేసింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో నటించేసింది వెంకటేష్ కుష్బూ కలిసి చేసిన చిత్రం ప్రత్యేకం. ఆ ఇద్దరికీ అదే మొదటి సినిమా. అలా చిరు, వెంకీ, నాగ్ అందరితోనూ నటించేసింది. మీతో నటించిన హీరోలందరినీ ఈ స్టేజ్ మీదకు తీసుకొస్తున్నాం అని కుష్బూతో రష్మీ అంటుంది.

Kushbu Satires on Bullet Bhasker in Extra Jabardasth Promo

Advertisement

ఆ తరువాత అందరూ డూప్‌లు స్టేజ్ మీదకు వస్తుంటారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ చిరంజీవి గెటప్‌లో వచ్చాడు. కుష్బూని పలకరించాడు. హాయ్ అన్నయ్య అని అంటుంది. మేడం ఆయన చిరంజీవి గారు అని రష్మీ అంటే.. అవునా? మరి నాగార్జున గారిలా మాట్లాడుతున్నాడేంటి? అని అంటుంది. దీంతో బుల్లెట్ భాస్కర్ తల తిప్పేసుకుంటాడు. అలా కుష్బూ వేసిన పంచుకు బుల్లెట్ భాస్కర్‌ను చూసి అందరూ నవ్వేస్తుంటారు. మొత్తానికి కుష్బూ మాత్రం జబర్దస్త్ జడ్జ్‌గా బాగానే సెట్ అయినట్టు అనిపిస్తుంది. మరి కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి