Home » Entertainment » Lavanya Tripathi In Love Really That Hero
Entertainment

Lavanya Tripathi : ఆ హీరోతో లావ‌ణ్య త్రిపాఠి ల‌వ్‌లో ఉన్నారా.. నిజ‌మెంత‌..?

Authored By
mallesh
The Telugu News | Published on: January 21, 2022, 11:00 am
Advertisement

Lavanya Tripathi : సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో ర‌కాల గాసిప్స్ చెక్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ఇలాంటి గాసిప్స్ ల‌లో ఎక్కువ‌గా ఈ న‌డుమ వినిపిస్తున్న‌ది మాత్రం బ్యూటిఫుల్ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ల‌వ్ లో ఉందని. ఈ వార్త ఇప్ప‌టిది కాదండోయ్‌.. చాలా ఏండ్లుగా చెక్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా లావ‌ణ్య ఆ హీరో చెల్లెలు పెండ్లి వేడుక‌కు హాజ‌రైన అతి కొద్ది మంది అతిథుల్లో ఉండ‌టంతో అప్పటి నుంచే ఈ త‌ర‌హా వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఓ సెక్ష‌న్ ఆఫ్ మీడియా కూడా ఇదే విష‌యాన్ని ఎన్నో నెల‌లుగా బ‌లంగా ప్ర‌చారం చేస్తోంది.

Advertisement

కాగా ఇప్పుడు మ‌రోసారి ఈ త‌ర‌హా వార్త‌లు ఊపందుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఆ హీరోతో రెండు సినిమాల్లో న‌టించింది లావ‌ణ్య త్రిపాఠి. అయితే అప్ప‌టి నుంచే ఈ రూమ‌ర్లు కొంచెంగా వ‌చ్చాయి. కానీ ఎప్పుడైతే ఆ హీరో చెల్లెలు పెండ్లి వేడుక‌కు లావ‌ణ్య వ‌చ్చిందో అప్ప‌టి నుంచి ఇవి కాస్తా ఎక్కువ‌య్యాయి. ఇక రీసెంట్ గా ఆ హీరో బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ రూమ‌ర్లు మ‌రోసారి ట్రెండింగ్ అయ్యాయి. అంతే కాకుండా ఆ హీరో లావ‌ణ్య‌కు ప్రపోజ్ చేయబోతున్నాడ‌ని ఇందుకోసం వీరిద్ద‌రూ క‌లిసి బెంగళూరుకు వెళ్లారని చాలా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

lavanya tripathi in love really That Hero

Advertisement

Lavanya Tripathi : తెలివిగా స‌మాధానం ఇచ్చేసిన లావ‌ణ్య‌..

ఇక తాజాగా త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది. తాను ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లో ఉన్నాన‌ని, బెంగళూరులో లేనంటూ చెప్పుకొచ్చింది. చాలామంది సోష‌ల్ మీడియా ద్వారా అటు సెల‌బ్రిటీలు, ఇటు అభిమానులు ఆ హీరోకు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. కానీ లావ‌ణ్య మాత్రం విషెస్ చెప్ప‌కుండా.. మ‌ధ్యాహ్నం డెహ్రాడూన్‌లో ఉన్న పిక్‌ను షేర్ చేశారు. దీంతో అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. అంటే ప్రేమ రూమ‌ర్లు అబ‌ద్ధం అని చెప్ప‌క‌నే చెప్పారా.. బెంగుళూరులో తాను లేన‌నే విష‌యాన్ని తెలివిగా చెప్పారా అని అంటున్నారు చాలామంది. మ‌రి ఈ రూమ‌ర్ల‌పై ఆ హీరో గానీ, లేదంటే లావ‌ణ్య గానీ ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి