Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసిన లావణ్య త్రిపాఠి దూసుకెళ్తా అనే సినిమా కూడా చేయగా ఆ పాత్ర ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేక పోయింది. ఆ తర్వాత ఏడాది బ్రహ్మ అనే సినిమా ద్వారా తమిళ సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా ఆ సినిమా కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు. భలే భలే మగాడివోయ్ సినిమాతో లావణ్య దశ తిరిగింది. ఈ అమ్మడు అక్కడ నుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తుంది.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న లావణ్య త్రిపాఠి అప్పుడప్పుడు సోషల్ మీడియాలోను రచ్చ చేస్తుంటుంది. ఈ అమ్మడు ట్రోలర్స్‌కి కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంటుంది.
తమిళనాడులో లావణ్య ఆత్మహత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో కొందరు లావణ్యకు బదులుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్ వాడుతున్నారు. దీంతో ఓ నెటిజన్ .. ‘లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ట్యాగ్ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి. లావణ్య త్రిపాఠి ఒక చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఆమెను ఆ హీరోయిన్‌తో పోల్చకండి’ అని దురుసుగా మాట్లాడాడు.దీనిపై లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించింది. ‘నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్‌గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు.
ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!’ అని ట్వీట్ చేసి గట్టి కౌంటరిచ్చింది. ఇక తాజాగా నెటిజన్స్ తో ముచ్చటిస్తున్న క్రమంలో లావణ్య పెళ్లి ప్రస్తావన రాగా, నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే” గురించి టాపిక్ డైవర్ట్ చేసింది. అయితే అభిమానులు పెళ్లి గురించి పదేపదే అడగడంతో “కొంతమంది ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు. నా పెళ్లి గురించి వాళ్ళకే ఎక్కువ తెలుస్తోంది” అంటూ ఎటకారంగా సమాధానం చెప్పడం గమనార్హం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.