Home » Entertainment » Liger Movie First Day Collections
Entertainment

Liger Movie : లైగ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత రాబ‌ట్టింది అంటే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: August 26, 2022 10:27 am
Advertisement

Liger Movie : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం లైగ‌ర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే టాక్‌ను పక్కన పెట్టేసి ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం . హైదరాబాద్‌లో 63 శాతానికి పైగా, విజయవాడలో 52 శాతం, గుంటూరులో 64 శాతం, వైజాగ్‌లో 82 శాతం, కాకినాడలో 94 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది.

Advertisement

నిజమాబాద్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 50 శాతం, మహబూబ్ నగర్‌లో 74 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. రీసెంట్ టైమ్‌లో RRR, KGF 2 చిత్రాల త‌ర్వాత ఆ రేంజ్ హైప్‌తో విడుద‌లైన సినిమా ‘లైగర్’. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేద‌నే టాక్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి.. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తోన్న తెలుగు సినిమాల స్పీడుకు కాస్త ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. అయిన‌ప్ప‌టికీ ప్రీమియ‌ర్స్‌, ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ క‌లుపుకుని చూస్తే రౌడీ స్టార్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ రూపంలో గాండ్రించాడ‌నే చెప్పాలి.

Liger Movie First Day Collections

Advertisement

లైగర్ చిత్రం ఓవర్సీస్‌‌లో 300 లొకేషన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా 476k డాలర్లను సొంతం చేసుకొన్నది.ఇక తొలి రోజు కలెక్షన్లతో 650K డాలర్లను వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో తొలి రోజు 74779 డాలర్లు, న్యూజిలాండ్‌లో 2401 డాలర్లతో శుభారంభాన్ని చేసింది. లైగ‌ర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల నుంచి 16 కోట్ల మధ్య షేర్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. . ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 90 కోట్లు కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. మ‌రి అంత రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి