
guntur karam Movie
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లాస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. మహేశ్ బాబు చేతుల్లో ప్రస్తుతం రెండే సినిమాలు ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం. మరొకటి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే ఆ సినిమా గురించి మామూలుగా ఎక్స్ పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా గ్లోబల్ మూవీ. ఆ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కానీ.. మహేశ్ బాబు ఎందుకో ఈ మధ్య వెకేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారట. దాని వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. అయితే.. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది త్రివిక్రమ్ కావడం వల్ల.. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వచ్చే సినిమా కావడం వల్ల.. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.అయితే.. ఈ సినిమా రిలీజ్ కాకముందే చాలా బజ్ ను సంపాదించుకుంది. సినిమా ఫ్రెష్ షెడ్యూల్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుందట. ప్రస్తుతం మహేశ్ లండన్ లో వెకేషన్ లో ఉన్నారు.
guntur karam Movie
లండన్ వెకేషన్ పూర్తి కాగానే వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. అలాగే అక్టోబర్ పూర్తయ్యేలోపు సినిమా సగం షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఇక.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా భారీగానే నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని త్రివిక్రమ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం మరి అప్పటి వరకు షూటింగ్ పూర్తవుతుందో లేదో?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.