
mahesh babu dance on the stage
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఇటీవల కాలంలో కనీసం మాట్లాడుతున్నారు కానీ, గతంలో ఆయన మాట్లాడిందే తక్కువ. అయితే డ్యాన్స్ లు, స్టేజ్ పై మూమెంట్స్ అస్సలు ఆయన నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం. అలాంటి మహేష్ బాబు.. మ.. మ.. మహేషా పాటకోసం స్టేజ్ ఎక్కారు. అదిరిపోయే స్టెప్పు వేశారు. స్టేజ్ పై కనిపించింది కాసేపే అయినా మహేష్ బాబు మాత్రం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ‘సర్కారు వారి పాట’ ఇచ్చిన సక్సెస్ జోష్ ఏమో తెలియదు కానీ.. మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.మే 12న విడుదలైన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ఎస్‌వీపీ చిత్రంకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మహేశ్ స్వాగ్‌ను అభిమానులు వెండితెరపై ఆస్వాదిస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా భారీ హిట్ కొట్టడంతో సోమవారం (మే 16) రాత్రి ‘మమ మాస్ సెలబ్రేషన్స్’ పేరుతో కర్నూలులో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ వేదికపైకి వెళ్లి ‘మమ మహేశా’ పాటకి డ్యాన్సర్లతో స్టెప్పులు వేశాడు.
mahesh babu dance on the stage
ఆ తర్వాత మహేశ్ బభౌ స్టేజ్‌పైకి వెళ్లి స్టెప్పులు వేశారు. సినిమాలో ‘మమ మహేశా’ ఉన్న స్పెప్స్ సూపర్ స్టార్ వేశారు. దీంతో అక్కడ ఉన్న మహేష్ అభిమానులు అరుపులతో ఊగిపోయారు. దాంతో అక్కడి సభ మొత్తం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరో లైవ్‌లో స్టెప్పులేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందపడ్డారు.ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా సినిమా నిలకడగా ఆడుతోంది. గతంలో ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లే కానీ, ఇలా సక్సెస్ మీట్లకు మహేష్ కాస్త దూరంగానే ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం కాస్త సీరియస్ గా ప్రమోషన్ పై దృష్టిపెట్టారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
This website uses cookies.