Mahesh Babu daughter sitara did great job
Mahesh Babu ; టాలీవుడ్‌లో కొందరు హీరోలు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తను ఎంత సంపాదించాడన్నది కాకుండా సేవలు చేసుకుంటూ వెళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా వేలాది మంది చిన్నారులకు గుండె జబ్బులను నయం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాల్లోను ముందు ఉంటున్నారు. మహేష్ లానే ఆయన కుమార్తే సితారా కూడా తండ్రి నుంచి మంచి సేవా గుణాన్ని అంది పుచ్చుకుంది. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్న ఈ చిన్నారి..
తాజాగా సరికొత్త పనికి శ్రీకారం చుట్టింది. ఇటీవల మహేష్ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది. తండ్రితో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సితార ఇటీవల వెబ్ సైట్ వివరాలను వివరించింది. స్విట్జర్లాండ్‌లో మహేష్ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోగా, నూతన సంవత్సం సందర్భంగా సితార మహేష్ వెబ్ సైట్ లాంచింగ్ గురించి చెప్పుకొచ్చింది.. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పిన సితార తన తండ్రి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించబోతున్నట్లు పేర్కొంది.
Mahesh Babu daughter sitara did great job
ఫౌండేషన్ కోసం తన వంతు సాయంగా పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు సితార చెప్పుకొచ్చింది. అందరూ ఈ ఫౌండేషన్ కు విరాళాలు అందించాలని, “నూతన సంవత్సరంలో మహేష్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ http://maheshbabufoundation.org ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సితార పేర్కొంది. చిన్న వయస్సు ఉన్న సితార ఇంత పెద్ద ఆలోచన చేయడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సు ఉన్న నువ్వు దేవతవి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా, మహేష్ బాబు నూతన సంవత్సరం సందర్భంగా స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌లో ఉండగా, న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకున్నారు.
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
This website uses cookies.