Sitara Ghattamaneni : “అతడు” సినిమా సాంగ్ కి మహేష్ బాబు కూతురు సితార అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..!!
Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలతో పాటు విదేశాల టూర్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటది. ఈ తరహాలోనే తాజాగా మహేష్ బాబు నటించిన “అతడు” సినిమాలో పాటకి డాన్స్ చేసింది.
Mahesh Babu Daughter Sitara Ghattamaneni Latest Dancing Video
ఈ సినిమాలో “పిల్ల గాలి అల్లరి” అనే సాంగ్ కీ సితార దుమ్మురేపే డాన్స్ తో అదరగొట్టింది.వీడియోలో సితార స్టెప్పులకీ అభిమానులు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని స్టెప్పులు మహేష్ డాన్స్ ని గుర్తు చేస్తున్నాయి. యానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందించడం జరిగింది. డాన్స్ పరంగా సితార చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తోంది. ఇంక నటనపరంగా కూడా కూడా ఆరితేరితే మాత్రం ఇంకా హీరోయిన్ గా…
Mahesh Babu Daughter Sitara Ghattamaneni Latest Dancing Video
ఎంట్రీ ఇచ్చేయచ్చని అభిమానులు అంటున్నారు. గత ఏడాది మహేష్ నటించిన “సర్కారు వారి పాట” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెనీ సాంగ్ కీ సితార అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. ఫస్ట్ టైం కెమెరా ముందు సితార వేసిన స్టెప్పులు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే దూకుడుతో సితార చేస్తున్న వీడియోలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.
