
Mahesh Babu director gives clarity
Mahesh Babu : ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుడు, మహేష్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు గత రాత్రి (జనవరి 8) కన్నుమూసిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు మరణ వార్త తెలిసి యావత్ టాలీవుడ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. కొద్ది సేపటి క్రితం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించగా పలువురు ప్రముఖులు రమేష్ బాబును కడసారి చూసి నివాళులర్పించారు.
జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి చేశారు. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తండ్రి చితికి నిప్పంటించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనా వలన మహేష్ బాబు తన అన్నయ్య చివరి చూపుకు నోచుకోలేదు. కాని ఆయన తన బాధను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.
mahesh babu emotional post is viral
‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేశ్. టాలీవుడ్ స్టార్ హీరోగా మహేష్ ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం కూడా రమేష్ అని కొందరు సినీ ప్రముఖులు చెబుతుంటారు.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.